15,000 కోట్లతో పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి

🙏కేంద్ర ప్రభుత్వం ఇటీవల
✐ 5,000 కోట్ల రూపాయలతో పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి
✐ 90 శాతం నిధులు షెడ్యూల్డ్ బ్యాంకుల ద్వారా
🙏కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీ యొక్క ప్రోత్సాహంతో, కేంద్ర మంత్రి మండలి  15,000 కోట్ల రూపాయలతో పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎ.హెచ్.ఐ.డి.ఎఫ్) ఏర్పాటును ఆమోదించింది.
✐ పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సహకార రంగం నుండి పెట్టుబడులను ప్రోత్సహించడానికి 10,000 కోట్ల రూపాయలతో పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (డి.ఐ.డి.ఎఫ్) ను ప్రభుత్వం గతంలో ఆమోదించింది.
✐ అదేవిధంగా, పశుసంవర్ధక రంగంలో ప్రాసెసింగ్ మరియు విలువను పెంచే మౌలిక సదుపాయాలలో పాల్గొనడానికి ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లతో పాటు ప్రైవేట్ సంస్థలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
✐పాడి పరిశ్రమ, మాంసం ప్రాసెసింగ్ మరియు పశుగ్రాసం ప్లాంట్లలో మౌలిక సదుపాయాల పెట్టుబడులను ఈ రోజు ఆమోదం పొందిన ఏ.హెచ్.ఐ.డి.ఎఫ్. ప్రోత్సహిస్తుంది. 
✐ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలు (ఎఫ్.‌పి.ఓ.లు), ఎం.ఎస్.‌ఎం.ఈ. లు, సెక్షన్ 8 కింద నమోదైన కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు మరియు వ్యక్తిగత పారిశ్రామికవేత్తలు ఈ పథకం కింద లబ్ధిపొందానికి అర్హులు.
✐ వీరు 10 శాతం మార్జిన్ మనీ మాత్రమే కట్టవలసి ఉంటుంది.
✐ మిగిలిన 90 శాతం నిధులు షెడ్యూల్డ్ బ్యాంకుల ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు.
✐ ఆశాజనక జిల్లాల నుండి అర్హత కలిగిన లబ్ధిదారులకు 4 శాతం మరియు ఇతర జిల్లాల నుండి లబ్ధిదారులకు 3 శాతం చొప్పున వడ్డీ ఉపసంహరణను భారత ప్రభుత్వం అందిస్తుంది. 
✐ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ముందుగా 2 సంవత్సరాలు తాత్కాలిక నిషేధం ఉంటుంది, ఆతర్వాత 6 సంవత్సరాలలో మొత్తం ఋణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. 
✐ భారత ప్రభుత్వం ఏర్పాటుచేసే 750 కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌ను నాబార్డ్ నిర్వహిస్తుంది. ఎమ్.ఎస్.ఎమ్.ఈ. ల కోసం నిర్వచించిన సీలింగు పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు ఈ నిధి క్రెడిట్ హామీని అందిస్తుంది.
✐ రుణగ్రహీత యొక్క క్రెడిట్ సదుపాయంలో 25 శాతం వరకు హామీ కవరేజ్ ఉంటుంది.

ప్రయోజనాలు  :

✐ పశుసంవర్ధక రంగంలో ప్రైవేటు రంగ పెట్టుబడుల ద్వారా పరిస్థితిని మెరుగు పరచడానికి అవకాశాలు భారీగా  ఉన్నాయి.  ప్రైవేట్ పెట్టుబడిదారులకు వడ్డీ ఉపసంహరణ పథకంతో ఏ.హెచ్.ఐ.డి.ఎఫ్. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ముందస్తు పెట్టుబడులను తీర్చడానికి మూలధన లభ్యతను నిర్ధారిస్తుంది.
✐ అదేవిధంగా మొత్తం రాబడిని పెంచడానికి / పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి ఇది సహాయపడుతుంది. అర్హత కలిగిన లబ్ధిదారుల ప్రాసెసింగ్ మరియు విలువను పెంచే మౌలిక సదుపాయాలలో పెట్టే ఇటువంటి పెట్టుబడులు ఎగుమతులను ప్రోత్సహిస్తాయి.
✐ భారతదేశంలో పాడి పరిశ్రమ ఉత్పత్తి యొక్క తుది విలువలో దాదాపు 50 - 60 శాతం తిరిగి రైతుల వైపుకు ప్రవహిస్తున్నందున, ఈ రంగంలో పెరుగుదల రైతు ఆదాయంపై గణనీయమైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. 
✐ పాల మార్కెట్ పరిమాణం మరియు పాల అమ్మకాల నుండి రైతులకు లభించే ఆదాయం సహకార మరియు ప్రైవేట్ డెయిరీలచే వ్యవస్థీకృత ఆఫ్ టేక్ అభివృద్ధితో ముడిపడి ఉంది. 
✐ ఈ విధంగా, ఏ.హెచ్.ఐ.డి.ఎఫ్. ద్వారా 15,000 కోట్ల రూపాయల మేర అందించే పెట్టుబడి, ప్రయివేటు పెట్టుబడుల పరపతిని అనేక రేట్లు పెంచడంతో పాటు, రైతులు కూడా మరింతగా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
✐ తద్వారా లభించే అధిక ఉత్పాదకత రైతుల ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తుంది.  ఈ రోజు ఏ.హెచ్.ఐ.డి.ఎఫ్. ను ఆమోదిస్తూ తీసుకున్న చర్య, సుమారు 35 లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష జీవనోపాధి కల్పనకు సహాయపడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu