👉 కోవిడ్-19 వ్యాధిని నయం చేసే మందు.
👉గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ
👉 గర్భిణులను, పాలిచ్చే తల్లులను చేర్చలేదు
👉'ఫ్యాబిఫ్లూ' అనే పేరుతో మార్కెట్లోకి విడుదల
👉 కోవిడ్-19 వ్యాధిని నయం చేసే మందును కనిపెట్టామని భారత్‌లోని గ్లెన్‌మార్క్ ఫార్మా సంస్థ ప్రకటించింది.
✊ స్వల్ప స్థాయి నుంచి ఒక మోస్తరు తీవ్రతతో కోవిడ్-19తో బాధపడుతున్న వారి మీద తాము అభివృద్ధి చేసిన మందు, ఫావిపిరవిర్ మెరుగ్గా పని చేసిందని, రోగుల్లో 88 శాతం మెరుగుదల కనిపించిందని గ్లెన్‌మార్క్ వెల్లడించింది .
✊ అయితే, ఈ ఔషధంతో చేసిన పరిశోధనలలో గర్భిణులను, పాలిచ్చే తల్లులను చేర్చలేదని ఆ సంస్థ వివరించింది.
✊ నోటి ద్వారా తీసుకునే ఫావిపిరవిర్ మందును గ్లెన్‌మార్క్ 'ఫ్యాబిఫ్లూ' అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
✊ "ఆ యాంటీ వైరల్ మందు రకరకాల ఆర్ఎన్ఏ వైరస్‌పై పని చేస్తుంది. 20 నుంచి 90 ఏళ్ళ మధ్య వయసు వారిలో ఈ మందును పరీక్షించినప్పుడు చెప్పుకోదగిన మెరుగుదల కనిపించింది. ✊ ఫావిపిరవిర్ మందును కోమార్బిడ్ పరిస్థితుల్లో అంటే మధుమేహం, హృద్రోగాలతో కూడా బాధపడుతున్న రోగులకు కూడా ఇవ్వవచ్చు" అని గ్లెన్‌మార్క్ తన ప్రకటనలో తెలిపింది.
✊ భారత అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ ఈ యాంటీ వైరల్ మందు ఫావిపిరవర్‌కు 'నియంత్రిత అత్యవసర ఉపయోగానికి' అనుమతి ఇచ్చిందని ఏఎన్ఐ వార్తా సంస్థ శుక్రవారం రిపోర్ట్ చేసింది.
✊తాజాగా ఈ సంస్థ ఈ మందు ఉత్పత్తికి, పంపిణీకి భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ నుంచి అనుమతి పొందింది.
✊గ్లెన్‌మార్క్ సంస్థ ఈ ఔషధాన్ని తన పరిశోధన-అభివృద్ధి బృందంతోనే విజయవంతంగా అభివృద్ధి చేసింది.
👉 ఈ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సాల్దాన్హా, "దేశంలో కరోనావైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న సమయంలో ఈ అనుమతి లభించింది. నిజానికి, దేశంలో విస్తరిస్తున్న వైరస్ కేసులు మన ఆరోగ్య వ్యవస్థను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఫ్యాబిఫ్లూ ఔషధం కోవిడ్ రోగులకు సమర్థ చికిత్సగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం" అని వారు తెలిపారు.
0 Comments