👉ఈ మందు ఏంటి ?👉 ఇది ఎలా పని చేస్తుంది?
👉 దీని ప్రభావం ఎంత?👉 ఔషధం విరివిగా దొరుకుతోందా?👉 దీని ఫలితాలపై డబ్ల్యుహెచ్ఓ స్పందన ఏంటి?👉 సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?🖉 బ్రిటన్‌లో జరిగిన అధ్యయనంలో ఈ ఔషధం కరోనావైరస్ సోకినవారి ప్రాణాలను కాపాడేందుకు తోడ్పతున్నట్లు తేలింది. కోవిడ్-19పై ఇలాంటి ఫలితాలను ఇచ్చిన తొలి ఔషధం ప్రపంచవ్యాప్తంగా ఇదే.ఈ మందు ఏంటి?🖉 డెక్సామెథాసోన్ ఒక స్టెరాయిడ్. శరీరంలో ఉత్పత్తయ్యే హార్మన్లను అనుకరిస్తూ పనిచేయడం ద్వారా మంటను తగ్గిస్తుంది.🖉 శరీర రోగ నిరోధక వ్యవస్థను కట్టడి చేయడం ద్వారా ఈ ఔషధం కోవిడ్-19 చికిత్సలో పనిచేస్తుంది.ఇది ఎలా పని చేస్తుంది?🖉 కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌పై పోరాడే క్రమంలో శరీరంలో మంట పెరుగుతుంది. కొన్ని సార్లు రోగ నిరోధక వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. ఇన్ఫెక్షన్‌పై దాడి చేయాల్సింది పోయి, శరీర కణాలనే లక్ష్యంగా చేసుకుంటుంది.డెక్సామెథాసోన్ ఈ ప్రభావాన్ని తగ్గిస్తుంది.దీని ప్రభావం ఎంత?🖉 కోవిడ్-19 సోకి బాగా అనారోగ్యంతో ఉన్నవారు, అంటే ఆసుపత్రుల్లో ఆక్సీజన్, కృత్రిమ శ్వాసపై జీవిస్తున్నవారికి ఈ ఔషధం సరిగ్గా పనిచేస్తుంది.🖉 లక్షణాలు తక్కువగా ఉన్నవారికి ఈ ఔషధం పనిచేయదు. ఈ దశలో వారి వ్యాధి నిరోధక వ్యవస్థను కట్టడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.👉 అధ్యయనంలో ఏం తేలింది?🖉 వెంటిలేటర్‌పై ఉన్న రోగుల్లో మరణాలను ఈ ఔషధం 33 శాతం వరకూ తగ్గించగలదని తమ అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.🖉 ఆక్సిజన్ పెట్టినవారిలో మరణాలు 20 శాతం తగ్గవచ్చని పేర్కొన్నారు. మిగతా రోగుల్లో ఈ ఔషధం ప్రయోజనం పెద్దగా కనిపించలేదని చెప్పారు.🖉 ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ అధ్యయనం నిర్వహించింది. వివిధ ఆరోగ్య సమస్యల కోసం ఇదివరకు వాడుతున్న ఔషధాలు కోవిడ్-19 చికిత్సలో ఉపయోగపడతాయా అనేది తెలుసుకునేందుకు దీన్ని చేపట్టింది.🖉 దాదాపు 2,100 మంది రోగులకు రోజుకు ఆరు మిల్లీగ్రాముల చొప్పున పది రోజులపాటు డెక్సామెథాసోన్ ఇచ్చారు.🖉 అదనంగా ఏ చికిత్సా ఇవ్వని మరో 4,300 రోగుల శాంపిల్స్‌తో వీరి శాంపిల్స్‌ను పరిశోధకులు పోల్చి చూశారు.🖉 మరిన్ని ఔషధాలతో కలగలిపి డెక్సామెథాసోన్‌ను ఉపయోగించడం ద్వారా మరణాలను మరింత తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.🖉 గర్భిణులు, పాలిస్తున్న తల్లులకు మినహా వయోజనులందరికీ ఈ ఔషధం ఉపయోగించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.👉 ఔషధం విరివిగా దొరుకుతోందా?🖉 డెక్సామెథాసోన్ చవకైన ఔషధం. ఇప్పటికే ఇది విరివిగా అందుబాటులో ఉంది.రెండు లక్షల మందికి సరిపడేలా ఈ ఔషధం నిల్వలు తమ వద్ద ఉన్నాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.🖉 బ్రిటన్‌లో ఒక్క రోగికి డెక్సామెథాసోన్ ఇచ్చేందుకు రోజుకు సుమారు రూ.500 చొప్పున ఖర్చవుతుంది. పది రోజుల పాటు ఈ ఔషధాన్ని అలా ఇవ్వాల్సి ఉంటుంది.🖉 డెక్సామెథాసోన్ తొలిసారి 1957లో తయారైంది. బ్రిటన్‌లో 1960ల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.🖉 చాలా కాలం నుంచి ఉన్న ఔషధం కావడంతో దీనికి ఇప్పుడు పేటెంట్ ఏదీ వర్తించదు. ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు దీన్ని తయారుచేయొచ్చు.👉 దీని ఫలితాలపై డబ్ల్యుహెచ్ఓ స్పందన ఏంటి?🖉 ఈ అధ్యయన ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. అయితే, తక్కువ లక్షణాలున్నవారికి చికిత్స మార్గాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.🖉 అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ అధ్యయనం శుభవార్తే. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో డెక్సామెథాసోన్ రూ.150 కన్నా తక్కువ ధరకే దొరుకుతోంది.🖉 దక్షిణాఫ్రికాలో ఆక్సీజన్, వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ఈ ఔషధంతో చికిత్స చేయాలని ప్రభుత్వం సూచన కూడా చేసింది.👉 సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?🖉 శరీరంలో మంట, వాపు, వ్యాధి నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల వచ్చే సమస్యలు, అస్థమా వల్ల శ్వాసనాళం, ఊపిరితిత్తుల్లో వచ్చే మంట వంటివాటిని నయం చేసేందుకు డెక్సామెథాసోన్ ఉపయోగపడుతుంది.వ్యాధి నిరోధక వ్యవస్థ శరీరంపైనే దాడి చేసే రెముటాయిడ్ ఆర్థరైటిస్, లుపస్ లాంటి సమస్యలకు కూడా దీన్ని వినియోగిస్తారు.🖉 డెక్సామెథాసోన్ వాడినప్పుడు ఆందోళన, నిద్ర లేమి, బరువు పెరగడం, శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు. అరుదుగా కంటి సమస్యలు, రక్తస్రావం కూడా జరగొచ్చు.
🖉 అయితే, కరోనావైరస్ రోగులకు తక్కువ మోతాదులోనే డెక్సామెథాసోన్ ఇస్తారు కాబట్టి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు.
0 Comments