✊ యోగా అంటే ??
✊ 2,500 ఏళ్ల క్రితం యోగా..
👍 శారీరక, మానసిక శాంతికి యోగా
👍 యోగాతో కలిగే ప్రయోజనాలేంటి?
👉ప్రపంచ యోగ దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు.
✊ యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం.
✊ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం.
✊మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది.
✊దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు.వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు.
✊ ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది.
✊ హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.
👉"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి.భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు కూడా ఉన్నాయి.
👍 భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు.దీనినే రాజయోగం అంటారు (పతంజలి మాత్రం "రాజయోగం" అనే పదాన్ని వాడలేదు)
👍యోగాసనాల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.యోగాలో కఠినమైన ఆసనాలు ఉంటాయి. తేలికైన ఆసనాలు ఉంటాయి. అందరికి ఉపయోగపడే ఆసనాలు ఉంటాయి.
👍అలాంటి వాటిల్లో ప్రాణాయామం ఒకటి. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
👍ఉచితాసనంలో వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి. ఒక ముక్కు రంద్రాన్ని వేలుతో మూసి, మరో ముక్కు రంద్రంతో గాలిని పీల్చాలి. ఆ తరువాత రెండో ముక్కు రంద్రం మూసి, మొదటి ముక్కు రంద్రం తెరిచి గాలిని మెల్లిగా వదలాలి.
👍ఇలా మార్చి మార్చి చేయడం వలన ఊపిరితిత్తులు శుద్ధి అవుతాయి. వ్యాకోచిస్తాయి. ఫలితంగా ఎక్కువ స్వచ్ఛమైన గాలిని తీసుకునేందుకు వీలు కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితే ఎలాంటి రోగాలనైనా జయించేందుకు వీలు కలుగుతుంది. అంతేకాదు రోజు పదినిమిషాలపాటు ప్రాణాయామం చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. శరీరంలోని అన్ని వ్యవస్థలు ఉత్తేజితం అవుతాయి.
👍 శారీరక, మానసిక శాంతికి యోగా
👍యోగాలో చాలా రకాలు ఉన్నాయని, వాటిలో కొన్ని మిగతా వాటితో పోలిస్తే మతపరంగా కనిపిస్తాయని రెబెకా ఫ్రెంచ్ అంటారు. ఉదాహరణకు హరేకృష్ణ భక్తులు ''సాధుభక్తి యోగా''ను అనుసరిస్తారు. పాశ్చాత్య దేశాలలో యోగా అంటే హఠయోగా. ఇది శారీరక, మానసిక బలాన్ని పెంచుకోవడానికి అనుసరించే విధానం.
👍చాలామంది హిందువులు యోగా ద్వారా ప్రకృతి నిజమైన స్వభావాన్ని, మన వాస్తవ స్థితి గురించి తెలుసుకోవచ్చని నమ్ముతారు. జనన, మరణ బంధాలను వదిలించుకోవడానికి చాలామంది దీనిని ఒక సాధనంగా భావిస్తారు. క్రైస్తవ, ఇస్లాం, ఇంకా ఇతర మతాలలో వీటన్నింటినీ నమ్ముతారా అనేది చర్చనీయాంశం.
👍 సూర్య నమస్కారాలు
👍సూర్య నమస్కారం శారీరక శ్రమలకు సంబంధించిన సమ్మిళిత భంగిమ. కానీ ఇది హిందూవుల సూర్యారాధనతో ముడిపడి ఉంది.ఇది కొంచెం మతపరమైనది, కానీ అది మీ దృక్పథంపై ఆధారపడి ఉంటుంది.మోకరిల్లడం అంటే ప్రార్థన అని అర్ధం.నమస్కరిస్తున్నానని కూడా అనుకోవచ్చు .
యోగా ఎలా విస్తరించింది?
👍యోగాను పశ్చిమ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తిగా స్వామీ వివేకానందకు పేరుంది.
👍1893లో షికాగో వేదికగా జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లిన స్వామీ వివేకానంద భారత్ ప్రతిష్ట, హిందూ మతం గురించి తన ఉపన్యాసాలలో వివరించారు.
👍1896లో అమెరికాలోని మన్‌హటన్ నగరంలో ఆయన 'రాజ యోగా' పుస్తకాన్ని ఆవిష్కరించారు. యోగా ప్రాముఖ్యతను పశ్చిమ దేశాలు తెలుసుకునేందుకు ఆ పుస్తకం ఎంతగానో దోహదపడింది.
👍 ఆ తర్వాత భారత్ నుంచి అనేక మంది యోగా గురువులు, టీచర్లు అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లారు.
2,500 ఏళ్ల క్రితం యోగా
👍 యోగా చాలా పురాతనమైనది. వేదకాలం నుంచే దాని గురించి ప్రస్తావన ఉంది. 2500 ఏళ్ల క్రితం సాధువులు యోగా సాధనలు చేసేవారని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకుడు, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జిమ్ మల్లిన్‌సన్ చెప్పారు. ఆయన యోగా చరిత్ర మీద అధ్యయనం చేస్తున్నారు.
👍 అప్పట్లో స్థిరంగా ఒక భంగిమలో ఉంటూ యోగా చేసేవారని, ప్రస్తుతం యోగా శిక్షణ కేంద్రాల్లో మనం చూస్తున్న శారీరకపరమైన ఆసనాలు అప్పట్లో ఉండేవి కాదని మల్లిన్‌సన్ వివరించారు.
👍 ప్రస్తుతం చాలామందికి తెలిసిన 'సూర్యనమస్కారం' లాంటి కొన్ని యోగా ఆసనాలు ఒకప్పుడు వాడుకలో ఉండేవి కాదని ఆయన తెలిపారు. 1930ల నుంచే 'సూర్యనమస్కారం' ఆసనం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర పుస్తకాలను తిరగేస్తే తెలుస్తోందని అన్నారు.
👍 గడచిన శతాబ్ద కాలంలో ప్రపంచీకరణలో భాగంగా యోగా కూడా అనేక రూపాలు తీసుకుంది. విభిన్నమైన కొత్త ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి. చాలా దేశాల్లో యోగాకు ప్రాధాన్యత కూడా బాగా పెరిగింది.
👍 అష్టాంగ యోగా, అయ్యంగార్, విన్యాస యోగా కూడా ఈ క్రమంలో రూపుదిద్దుకున్నవే. 'అష్టాంగ యోగ'ను పతంజలి మహర్షి సిద్ధం చేశారని చెబుతారు.
👍 యోగాతో కలిగే ప్రయోజనాలేంటి?
👌యోగాతో మనకు ప్రశాంతత, విశ్రాంతి లభిస్తుంది. దాంతో, మానసిక ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
👌ఆసనం వేసి స్థిరంగా ఉండటం వల్ల శరీర అవయవాలకు మనసుకు మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
👌శరీరంలో నొప్పులు తగ్గేందుకు ప్రెగ్నెన్సీ యోగా ఉపయోగపడుతుంది. నిద్ర బాగా పడుతుంది.
👌'ప్రసవానంతర యోగా' ద్వారా మహిళలు త్వరగా మామూలు స్థితికి వచ్చేందుకు వీలుంటుంది.
👌విద్యార్థులు రోజూ యోగా చేస్తే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మెదడు చురుగ్గా పని చేస్తుంది.
👌యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
👌శరీరం నుంచి వ్యర్థాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి.
👌శారీరకపరమైన సాధనలతో కండారాలు దృఢంగా తయారవుతాయి.
0 Comments