✊ అసలు ఈ నిషేధం సాధ్యమేనా ?
✊ వేటిని దిగుమతి చేసుకుంటోంది?
👉 75 శాతం స్మార్ట్‌ఫోన్లు చైనావే..
✊ నిషేధం విధిస్తే ఎవరి ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ప్రభావితం అవుతుంది ?
👉ఇలాంటి డిమాండ్లు రావడం ఇదేమీ తొలిసారి కాదు. అయితే గత 40ఏళ్లలో ఎన్నడూలేని స్థాయిలో లద్దాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో విధ్వంసకర ఘర్షణల నడుమ ఈ డిమాండ్లు ప్రస్తుతం ఎక్కువయ్యాయి.
✊ఇంతకీ భారత్‌కు చైనా ఎలాంటి వస్తువులు ఎగుమతి చేస్తోంది. వేటిని దిగుమతి చేసుకుంటోంది? ఎవరిపై ఎవరు ఎక్కువ ఆధారపడుతున్నారు?
✊నిషేధం విధిస్తే ఎవరి ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ప్రభావితం అవుతుంది? అసలు ఈ నిషేధం సాధ్యమేనా ?
👉 భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి
✊ ఆసియాలో 14.14 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో చైనాదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
✊ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా (21.44 ట్రిలియన్ డాలర్లు) తర్వతి స్థానం చైనాదే. 2.94 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో భారత్ ఐదో స్థానంలో ఉంది.
✊ వాణిజ్యం విషయానికి వస్తే... భారత్‌కు అమెరికా తర్వాత అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనానే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సమాచారం ప్రకారం.. భారత్ చేసుకునే దిగుమతుల్లో చైనా వాటా 14.09 శాతం వరకు ఉంది.
✊ ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం సాధనాలు, కంప్యూటర్ విభాగాలు (హార్డ్‌వేర్, ఇతర విడిభాగాలు), ఫార్మా ఉత్పత్తులు, ప్లాస్టిక్ బొమ్మలు.. భారత్‌కు చైనా నుంచి ఎక్కువ దిగుమతి అవుతున్నాయి.
✊ భారత్ ఎగుమతుల విషయానికి వస్తే.. చైనా మూడో స్థానంలో ఉంది. 5.33 శాతం ఎగుమతులు చైనాకే వెళ్తున్నాయి.
✊ పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుప ముడి ఖనిజం, రసాయనాలను చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.
✊ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. చైనాకు భారత్ 11వ అతిపెద్ద భాగస్వామి. చైనాకు వచ్చే దిగుమతుల్లో భారత్ వాటా 0.88 శాతం వరకు ఉంది. భారత్ నుంచి కంటే ఆఫ్రికా దేశం అంగోలా నుంచి చైనా ఎక్కువ వస్తువులు దిగుమతి చేసుకుంటోంది.
✊ చైనా చేసే ఎగుమతుల్లో 3.08 శాతం భారత్‌కు వస్తున్నాయి. ర్యాంకుల వారీగా చూస్తే.. చైనా ఎగుమతి భాగస్వాముల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది.
✊ అంటే నిషేధంతో.. 3.08 శాతం మాత్రమే చైనా ఎగుమతులు ప్రభావితం అవుతాయి. అదే భారత్ విషయానికి వస్తే 5.33 శాతం ఎగుమతులు ప్రభావితం అవుతాయి.
👉 నేరుగా వచ్చే పెట్టుబడులు తక్కువే
✊ భారత్‌కు చైనా నుంచి నేరుగా వచ్చే పెట్టబడులు చాలా తక్కువ. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సమాచారం ప్రకారం.. గత 20ఏళ్లలో మొత్తం పెట్టుబడుల్లో కేవలం 0.51 శాతం (2.3 బిలియన్ డాలర్లు) మాత్రమే చైనా నుంచి వచ్చాయి.
✊ అయితే, భారత్‌లోని తొలి 30 దిగ్గజ అంకుర సంస్థల్లో(స్టార్టప్‌లలో)ని 18 సంస్థల్లో చైనా పెట్టుబడులున్నట్లు విదేశీ వ్యవహారాల మేధోమథన సంస్థ గేట్ వే హౌస్- ఇండియన్ కౌన్సిల్ ఆన్ గ్లోబల్ రిలేషన్స్ నివేదిక చెబుతోంది.
✊ కొన్ని అంకుర సంస్థల్లో నేరుగా.. మరికొన్నింట్లో సింగపూర్, మారిషస్ లాంటి దేశాల గుండా చైనా సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్లు వివరిస్తోంది.
👉 అంకుర సంస్థల్లో ఇలా ..
✊ చైనాకు చెందిన వివిధ సంస్థలు, అవి పెట్టుబడులు పెట్టిన భారత స్టార్టప్‌లు..
✊ అలీబాబా గ్రూప్ - పేటీఎం, బిగ్‌బాస్కెట్, స్నాప్‌డీల్, జొమాటో, డైలీ హంట్, ర్యాపిడో
✊ టెన్సెంట్ - బైజూస్, డ్రీమ్-11, ఫ్లిప్‌కార్ట్, హైక్, ఓలా, ఉడాన్, స్విగ్గీ, ప్రాక్టో, ఎంఎక్స్ ప్లేయర్, గానా, ఖాతాబుక్
✊ స్టెడ్‌వ్యూ క్యాపిటల్ - డ్రీమ్-11, ఫ్లిప్‌కార్ట్ ఓలా, పాలసీ బజార్, క్వికర్
✊ సైఫ్ పార్ట్‌నర్స్ - రివీగో, స్విగ్గీ, పేటీఎం
✊ ఫోసున్- డెల్హీవరీ, దీదీ చుక్సింగ్ - ఓయో
✊ సీట్రిప్- మేక్‌మైట్రిప్
👉 75 శాతం స్మార్ట్‌ఫోన్లు చైనావే..
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోనూ చైనా ఫోన్లదే ఆధిపత్యం. దాదాపు 75 శాతం వరకూ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు చైనావేనని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ చెబుతోంది.
✊ 2020 మొదటి త్రైమాసికం విక్రయాల్లో షియోమి (30), వీవో (17), రియల్‌మీ (14), ఒప్పో (12) లాంటి ప్రముఖ చైనా బ్రాండ్లు ఆధిపత్యం ప్రదర్శించినట్లు వివరిస్తోంది.
✊ టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హలో, లైక్, బ్యూటీ ప్లస్ తదితర యాప్‌లు కూడా చైనావే. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటూ ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
✊ మరోవైపు చైనాలోనూ కొన్ని భారత సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. 54 ప్రధాన సంస్థలు.. షాంఘై, బీజింగ్, గువాంగ్‌డాంగ్ లాంటి ప్రధాన నగరాల్లో పనిచేస్తున్నట్లు కన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నివేదిక చెబుతోంది.
✊ వస్తూత్పత్తి, ఆరోగ్య రంగం, ఆర్థిక సేవలు, ఐటీ, టెలీ కమ్యూనికేషన్లు తదితర రంగాల్లో ఈ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.
👉 చైనా ఉత్పత్తులపై నిషేధం దిశగా ఇప్పటికే తాము చర్యలు మొదలుపెట్టినట్లు కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చెబుతోంది.
✊ 40,000 వాణిజ్య సంఘాల సమాఖ్యే సీఏఐటీ. ఏడు కొట్ల వర్తకులకు తాము ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు సీఏఐటీ పేర్కొంది.
✊ అయితే, చైనా వస్తువులను బహిష్కరించడం కానీ, చైనా ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేయడం కానీ, చైనా సంస్థల పెట్టుబడులను అడ్డుకోవడం కానీ ఇప్పటికిప్పుడు సాధ్యం కావని వాణిజ్యరంగ నిపుణులు చెబుతున్నారు.
😎 చైనా యాప్‌లివే..
✍️ టిక్‌టాక్,
✍️ వాల్ట్-హైడ్,
✍️ విగో వీడియో,
✍️ బిగో లైవ్,
✍️ వీబో,
✍️ వీచాట్,
✍️ షేర్‌ఇట్,
✍️యూసీ న్యూస్,
✍️ యూసీ బ్రౌజర్,
✍️ బ్యూటీప్లస్,
✍️ ఎక్సెండర్,
✍️ క్లబ్‌ఫ్యాక్టరీ,
✍️ హలో,
✍️ లైక్,
✍️ క్వాయ్,
✍️రోమ్‌వీ,
✍️షీన్,
✍️ న్యూస్‌డాగ్,
✍️ ఫొటో వండర్,
✍️ అపస్ బ్రౌజర్,
✍️ వివోవీడియో-క్యూయూ వీడియో ఇంక్ పర్ఫెక్ట్ కార్ప్,
✍️ సీఎం బ్రౌజర్,
✍️వైరస్ క్లీనర్ (హై సెక్యూరిటీ లాబ్),
✍️ఎంఐ కమ్యూనిటీ,
✍️డీయూ రికార్డర్,
✍️యూకామ్ మేక్‌అప్,
✍️ఎంఐ స్టోర్,
✍️ 360 సెక్యూరిటీ,
✍️డీయూ బ్యాటరీ సేవర్,
✍️డీయూ బ్రౌజర్,
✍️డీయూ క్లీనర్,
✍️డీయూ ప్రైవసీ,
✍️క్లీన్ మాస్టర్ - చీతా కేక్ క్లీనర్,
✍️డీయూ యాప్స్ స్టూడియో,
✍️బైడూ ట్రాన్స్‌లేట్,
✍️బైడూ మ్యాప్,
✍️వండర్ కెమెరా,
✍️ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్,
✍️ క్యూక్యూ ఇంటర్నేషనల్,
✍️క్యూక్యూ లాంచర్,
✍️క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్,
✍️ క్యూక్యూ ప్లేయర్,
✍️ క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్,
✍️క్యూక్యూ న్యూస్ ఫీడ్,
✍️వీసింక్,
✍️సెల్ఫీ సిటీ,
✍️క్లాష్ ఆఫ్ కింగ్స్,
✍️మెయిల్ మాస్టర్,
✍️ఎంఐ వీడియో కాల్-షామీ,
✍️పారెలల్ స్పేస్.
0 Comments