✍️ టాంజానైట్ ఖనిజం కేవలం ఉత్తర టాంజానియాలో మాత్రమే దొరుకుతుంది. ఉంగరాలు, నెక్‌లెస్‌లు, బ్రేస్‌లెట్లు వంటి నగలలో ఉపయోగించే రత్నాలలో దీనికి చాలా ప్రజాదరణ ఉంది.
✍️ భూమి మీద అత్యంత అరుదుగా లభించే రత్నాలలో ఇదొకటి. రాబోయే 20 ఏళ్లలో ఈ రత్నాల సరఫరా పూర్తిగా అంతరించిపోతుందని స్థానిక భౌగోళిక శాస్త్రవేత్త ఒకరు చెప్తున్నారు.
✍️ ఈ విలువైన శిల ఆకర్షణ దీనిలోని ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగులు సహా విభిన్న వర్ణాల్లో ఉంటుంది.
✍️ ఎంత అరుదైన శిల అనేదానిని బట్టి దీని విలువను నిర్ధారిస్తారు. శిల రంగు ఎంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది.
✍️ లేజర్‌కు గత వారంలో రెండు టాంజానైట్ శిలలు దొరికాయి.
✍️ ఒక దాని బరువు 9.2 కిలోలు ఉంటే, మరొకటి 5.8 కిలోల బరువు ఉంది. వాటిని బుధవారం నాడు మాన్యారా ప్రాంతంలో వాణిజ్య కార్యక్రమం సందర్భంగా విక్రయించారు.
✍️ దీనికి ముందు వరకూ దొరికిన టాంజానైట్ శిలల్లో అతి పెద్ద శిల బరువు 3.3 కిలోలు మాత్రమే.
✍️ దేశాధ్యక్షుడు జాన్ మగుఫులి స్వయంగా లేజర్‌కు ఫోన్ చేసి అభినందించారు.
✍️ ‘‘చిన్నతరహా మైనర్లతో కలిగే ప్రయోజనం ఇది. టాంజానియా సంపన్నమైన దేశమని ఇది నిరూపిస్తోంది’’ అని అధ్యక్షుడు పేర్కొన్నారు.
✍️ గనుల తవ్వక రంగంలో టాంజానియా ప్రయోజనాలను పరిరక్షిస్తానని, దానిపై ప్రభుత్వ ఆదాయం పెంపొందిస్తాననే హామీలతో 2015లో అధికారంలోకి వచ్చారు మగుఫులి.
0 Comments