ఒకదేశం సంతోషకరమైన దేశంగా నిలవాలంటే ఏమి ఉండాలి ??

✌మనిషి సంతోషం అనేది నిజాయితీతో ముడిపడి ఉంది
నమ్మకం నిజాయతి కలిసేలాగే ఉండాలి
 ఫిన్లాండ్‌లో "సిసు" అనే ఒక ప‌దం
✌అంద‌రి మంచి కోసం ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని 
✌ఫిన్లాండ్ వాసులు సాయం చేస్తారు. కానీ అనవసర విషయాల్లో తలదూర్చరు
మేం చాలా తక్కువగా మాట్లాడతాం
✍మనిషి సంతోషం అనేది నిజాయితీతో ముడిపడి ఉంది అని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనం లో తేల్చి చెప్పింది నిజానికి ఇది వాస్తవమే ఎట్టి వివాదం లేదు ఇందులో ఇప్పుడు ఒక దేశమే  సంతోషకరమైన దేశంగా నిలవాలంటే అందులో ప్రజలందరూ సంతోషకరమైన వారు అయ్యిఉండాలి ఇది ఎలా సాధ్యం ఫిన్లాండ్ మూడేళ్లుగా వరుసగా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది దానికి కారణాలు ఏమి అని పరిశీలిస్తే ...

✍ ఫిన్లాండ్ మూడేళ్లుగా వరుసగా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది ?

✍ నిజాయితీగా ఉండ‌టమ‌నేది ఫిన్లాండ్ సంస్కృతిలో భాగం. మిగ‌తా దేశాల‌తో పోల్చిన‌ప్పుడు ఇది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.
✍ నిజం చాలా విలువైన‌ది. దాన్ని చాలా అరుదుగా వాడాలి అని ఇంగ్లిష్‌లో ఒక సామెత ఉంది. కానీ ఫిన్లాండ్‌లో ఎప్పుడూ నిజ‌మే చెబుతారు. ఆంగ్లేయుల తీరుకు ఇది విరుద్ధమే ..మరి కాబట్టి ఎవరి సంస్కృతిని వారి భాషతో ప్రోత్సహించుకోవడం ఒకరకంగా మంచిదే. 
✍ ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో ఇదొక మంచి సుగుణం ఉదాహరిస్తే  పిల్ల‌లు మ‌ర‌చిపోయిన హ్యాండ్ గ్లవ్స్ మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ చెట్ల‌పై క‌నిపిస్తుంటాయి.పిల్ల‌లు తరచుగా హ్యాండ్ గ్ల‌వ్స్ మ‌రిచిపోతుంటారు. ఇవి మ‌ళ్లీ పిల్ల‌ల‌కు చేరేలా చూసేందుకు వీటిని చెట్ల‌పై వేళ్లాడ‌దీస్తుంటారు. ఎవ‌రివి వారే తీసుకుంటార‌ని ఇక్క‌డి ప్ర‌జ‌ల గ‌ట్టి న‌మ్మ‌కం.
✍అవును నమ్మకం నిజాయతి కలిసేలాగే ఉండాలి. తనది కానిది ఏ వస్తువు తాకడం తీసుకోవడం అనేది లేకుండా పిల్లలని పసిప్రాయం నుండే విద్యా బుద్దులతో నేర్పాలి.

✍ కొన్ని సంవ‌త్స‌రాల క్రితం రీడ‌ర్స్ డైజెస్ట్ ఒక అధ్య‌య‌నం నిర్వ‌హించింది. దీని పేరు 'లాస్ట్ వాలెట్ టెస్ట్'‌. దీనిలో భాగంగా ప్ర‌పంచ వ్యాప్తంగా 192 న‌గ‌రాల్లో త‌మ రిపోర్టర్లు త‌మ వాలెట్ల‌ను ఏదో ఒక‌చోట విడిచిపెట్టారు. ఒక్కోదానిలో 50 డాల‌ర్ల న‌గ‌దుతోపాటు త‌మ వివ‌రాలు, కుటుంబ స‌భ్యుల వివ‌రాలు, బిజినెస్ కార్డులు పెట్టారు. హెల్సింకి‌లోని 12 వాలెట్ల‌లో 11 వాలెట్లు తిరిగి త‌మ రిపోర్ట‌ర్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన‌ట్లు సంస్థ తెలిపింది. ఈ న‌గ‌రాన్ని ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ నిజాయితీ న‌గ‌ర‌మ‌ని సంస్థ కితాబిచ్చింది.
✍ ఫిన్లాండ్ శ‌తాబ్దాల‌పాటు స్వీడ‌న్ ఆధీనంలో గ‌డిపింది. ఇక్క‌డి ధ‌న‌వంతులు స్వీడిష్‌.. మాట్లాడితే.. రైతులు, చ‌ర్చి సిబ్బంది ఫిన్నిష్ భాషలో మాట్లాడుకునేవారు. 1809లో ఫిన్నిష్ యుద్ధం అనంత‌రం ర‌ష్యాకు చెందిన అలెగ్జాండర్‌-1 ఈ ప్రాంతానికి స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌ల్పించారు. దీంతో గ్రాండ్ డ‌చీ ఆఫ్ ఫిన్లాండ్‌గా అవ‌త‌రించింది. ఇదే ఇప్పుడు ఫిన్లాండ్‌గా మారింది. నేడు ఫిన్నిష్ భాష పరిఢ‌విల్లడంతోపాటు ఫిన్లాండ్ కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపూ ఉంది.
✍ ఫిన్లాండ్ ‌వాసులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తార‌ని, నిక్క‌చ్చిగా ఉంటార‌ని, క‌ష్ట స‌మ‌యాల్లో దేవుడిపై భారంవేసి త‌మ విధి తాము పూర్తి చేస్తార‌నే పేరుంది. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ నిజాయితీకి ద‌గ్గ‌ర బంధువులే అని భాషా నిపుణుడు ఉర్పు స్ట్రెల్‌మ్యాన్ వివ‌రించారు.
✍ ఇక్క‌డి విస్తార‌మైన గ్రామీణ ప్రాంతాల‌కు గ‌జ‌గ‌జ వ‌ణికించే శీతాకాలాలు తోడవుతుంటాయి. దీంతో మంచి దేశంగా పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించాలంటే మంచి ల‌క్ష‌ణాలు త‌ప్ప‌నిస‌ర‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తుంటారు. 
✍ ఫిన్లాండ్‌లో "సిసు" అనే ఒక ప‌దం ఉంది. ధైర్యం, క‌ఠిన ప‌రిస్థితుల‌కు ఎదురు నిల‌వ‌డం, తీవ్రంగా శ్ర‌మించ‌డం లాంటి అంశాలే తమ‌ దేశానికి, సం‌స్కృతికి గుర్తింపు తెచ్చిపెడ‌తాయ‌ని దీని అర్థం.నిక్క‌చ్చిగా ఉండ‌టం, నిజాయితీ లాంటి విలువ‌ల‌ను నేడు ఫిన్లాండ్‌లో చాలా గౌర‌విస్తారు.ఇవి ఫిన్లాండ్ న‌ర‌న‌రాన వేళ్లూనుకున్నాయి అని అక్కడి వారు తెలియజేస్తారు.

✍ తప్పులు ప్రతిచోటా జరుగుతాయి తిరిగి అదే తప్పు జరగకుండా చేయడమే గొప్ప 

✍ 2001లో ఎఫ్ఐఎస్ నోర్డిక్ స్కీ ఛాంపియ‌న్‌షిప్‌కు అతిథ్యం వహించిన‌ప‌పుడు ఫిన్లాండ్‌లో వెలుగుచూసిన కుంభ‌కోణాన్ని ఆయ‌న ఉదాహ‌ర‌ణ‌గా ప్ర‌స్తావించారు. ఛాంపియ‌న్‌షిప్‌లో ఆరు ఫిన్లాండ్ క్రీడాకారులు డోపింగ్ కేసుల్లో ప‌ట్టుబ‌డ్డారు. ఇది దేశానికి సిగ్గుచేట‌ని జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. దేశం మొత్తానికి వీరు త‌ల‌వంపులు తెచ్చార‌ని పేర్కొంది.
✍ ఫిన్లాండ్ వాసులకు ఈ కుంభ‌కోణంలో దుర‌దృష్ట‌క‌ర అంశం కుంభ‌కోణమే కాదు.. అని ద ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ ద హిస్ట‌రీ ఆఫ్ స్పోర్ట్‌లో ఒక ఆర్టికల్‌లోకూడా ప్రచురించారు  "ఈ వార్త‌లు త‌మ క్రీడ‌ల్లో నిజాయితీని శంకించేలా చేస్తాయ‌ని, త‌మ క‌ష్ట‌ప‌డే త‌త్వాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేస్తాయ‌ని వారు భావించారు."
వారు దీన్ని దేశ కీర్తి ప్ర‌తిష్ఠ‌ల‌కు సంబంధించిన అంశంగా చూశారు. నార్వేలో దీనికి విరుద్ధ‌మైన ప‌రిస్థితులు క‌నిపించాయి. నార్వేకు చెందిన మ‌హిళా క్రీడాకారిణి డోపింగ్‌లో ప‌ట్టుబ‌డిన‌ప్పుడు.. దేశం మొత్తం ఆమెకు అండ‌గా నిలిచింది. శిక్ష‌ను వీలైనంత త‌గ్గించాల‌ని డిమాండ్ చేసింది అని అక్కడివారు చెబుతారు.
✍ నార్వే దేశాన్ని చెప్పడం కాదుకానీ దాదాపు అన్ని దేశాలు అలానే ప్రవర్తిస్తాయి వ్యక్తికోసం దేశం నిలవడమే ఒక ముర్కపుచర్య అని నా అభిప్రాయం.దేశం అంటే విలువల నిధిగా పరిగణించాలి అని చెప్పవచ్చు.

✍ స‌మాజంలో ఒక‌రిపై మ‌రొక‌రికున్న విశ్వాసంపై ఫిన్లాండ్ వాసులు గ‌ర్వ ప‌డుతుంటారు. ఇది కూడా అంద‌రూ నిజాయితీ ఉంటార‌ని చెప్ప‌డానికి ఒక సంకేతం గా భావించవచ్చు .
ఫిన్లాండ్‌లో ప్ర‌భుత్వాన్ని మిత్రుడిగా చూస్తారు. శ‌త్రువుగా కాదు అని క‌ననెన్ అనే వ్యక్తి వివ‌రించారు. 
✍ అంద‌రి మంచి కోసం ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తారు. అధికారులు కూడా అంద‌రి ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని ప‌నిచేస్తారు. తోటి పౌరులు, ప్ర‌భుత్వాధికారులు, పోలీసులు.. ఇలా అంద‌రిపైనా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌క‌ముంటుంది. ఇక్క‌డి వారు సంతోషంగా ప‌న్నులు చెల్లిస్తారు. ఈ డ‌బ్బు అంద‌రి కోసం ఉప‌యోగిస్తార‌ని, ఎవ‌రూ త‌మ‌ను మోసం చేయ‌ర‌ని వారు భావిస్తారు. అని అయన చెప్పుకొచ్చారు.నిజమే ప్రజల కు ఆమాత్రం నమ్మకం ప్రభుత్వాలు కల్పించాలి ఈ విషయంలో మనం ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది.

✍ ఒక‌సారి అబ‌ద్ధం చెబుతూ ప‌ట్టుబ‌డితే ఇక్క‌డి ప్ర‌జ‌లు ఇక వారిని న‌మ్మ‌ర‌ని అక్కడి వారు చెబుతారు. ఫిన్లాండ్ ఇంగ్లండ్ కంటే ప‌ది రెట్లు పెద్ద‌దైనా.. జ‌నాభా విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లండ్లో ప‌ది శాతం మంది మాత్ర‌మే ఇక్క‌డ ఉంటారు. 55 ల‌క్ష‌ల మంది జనాభాలో ఎక్కువ మంది ద‌క్షిణాన ఉండే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నివ‌సిస్తారు. జ‌నాభా త‌క్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌జ‌ల మ‌ధ్య ప‌రిచ‌యాలు కాస్త ఎక్కువ‌గానే ఉంటాయి.
✍ వ‌రుస‌గా మూడోసారి ప్ర‌పంచంలోనే అత్యంత సంతోష‌క‌ర దేశంగా ఫిన్లాండ్ రికార్డు సాధించింది. అస‌లు ఇది ఎలా సాధ్య‌మైందో తెలుసుకోవాలని అందరికి  కుతూహలంగా గానే ఉంటుంది 
"సంతోషం అనేది నిజాయితీతో ముడిపడి ఉంది" అని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. నిజం చెబితే మానసిక, శారీరక ఆరోగ్యాలు మెరుగు పడతాయని, ఈ రెండింటి మధ్యా సంబంధముందని వెలుగులోకి వచ్చింది.
✍ నిజాయితీని పక్కన పెడితే, దేశంలో ఎక్కువ‌ అని చెప్పుకొనే సంతోషం బయట అంత సులువుగా కనిపించదు. 

ఫిన్లాండ్ వాసులు సాయం చేస్తారు. కానీ అనవసర విషయాల్లో తలదూర్చరు. చాలా కలసిమెలిసి ఉంటారు. కానీ అతిగా జోక్యంచేసుకోరు. అన్ని విషయాల్లో వారికి స్పష్టత ఉంటుంది. అనవసర ఖర్చులూ చేయరు. 
అన్ని విషయాలనూ వారు సూటిగా చెప్పడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్ట్రెల్ మ్యాన్ ప్రకారం ఇవన్నీ నిజాయితీ, నిక్కచ్చిగా ఉండటానికి లక్షణాలు.
మేం చాలా తక్కువగా మాట్లాడతాం. అనవసరంగా మాట్లాడేకంటే మౌనంగా ఉండటమే ఉత్తమమని భావిస్తాం అని అక్కడి ప్రజలు చెబుతుంటారు 
ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాలని మాకు చిన్నప్పటినుంచి  చెబుతారు. అనవసర వాగ్దానాలు ఇవ్వొద్దని, అనవసర మెరుగులు దిద్దొద్దని చెబుతారు. వాక్ చాతుర్యంతో మాట్లాడే కంటే సూటిగా చెప్పడం మేలని ఫిన్లాండ్ వాసులు బలంగా  భావిస్తారు.

✍ ప్రతి పదాన్ని ఫిన్లాండ్ వాసులు సీరియస్‌గా తీసుకుంటారు. విపరీతమైన మాటలు, వ్యాఖ్యలను ఫిన్లాండ్ వాసులు ఎలా చూస్తారో వివరిస్తూ ఎథనోగ్రాఫర్ డోనల్ కార్బా ఒక అధ్యయనం చేపట్టారు. వారు చెప్పినదే చేస్తారని, దానిపైనే సమయం కేటాయిస్తారని ఆయన పేర్కొన్నారు.
✍ ఫిన్లాండ్ వాసులు అన్నింటినీ ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు. నేను తిన్న బర్గర్ల‌న్నింటిలో ఇదే మేలైనదని మీరు చెబితే... మీరు ఇప్పటివరకు తిన్న అన్ని బర్గర్ల వైపుగా సంభాషణ వెళ్లొచ్చు. దీని ప్రకారం ఏది మేలైనదో వారు గుర్తిస్తారు. మీరు మామూలుగా అన్నానని అంగీకరించేవరకూ ఈ విషయాన్ని వారు అనుమానాస్పదంగానే చూస్తారు.
✍ అన్ని వేళలా నిజాయితీతో వ్యవహరించడం మేలైన మార్గమని ఫిన్లాండ్ వాసులు చెబుతుంటారు. అయితే దీన్ని అలవాటు చేసుకోడానికి కొత్తవారికి కొంచెం సమయం పడుతుంది.

యాతా వాతా తేల్చేదేమిటంటే 
హరిచంద్రుడిలా సత్యమే పలకాలి రాముడిలా మాటమీదే నిలబడాలి నిజాయతీగానే బ్రతకాలి సంతోషంగా జీవించాలి ...DOT

Post a Comment

0 Comments

Close Menu