✍ ఛత్తీస్‌గఢ్ నూతన పధకం
✍ ఎందుకు
✍ వర్మీకంపోస్టు ఎరువును సహకార...
✍ రోడ్లపై ఆవుల సంచారాన్ని నిరోధించడంతోపాటు పశుసంవర్ధకశాఖను లాభాల దిశగా మళ్లించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ వినూత్న పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు
ముఖ్యమంత్రి భూపేష్ చెప్పారు.
✍ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా రైతులకు ఆర్థిక ప్రయోజనాల కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
✍ రైతుల నుంచి ఆవు పేడను సేకరించేందుకు ధరను నిర్ణయించేందుకు వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ మంత్రి రవీంద్ర చౌబే అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతులు, గోశాల నిర్వాహకుల అభిప్రాయాలు తీసుకొని ఆవు పేడకు ధర నిర్ణయిస్తామని సీఎం పేర్కొన్నారు.
✍ ఆవు పేడ సేకరణకు ధరను హరేలీ ఫెస్టివల్‌లో ప్రకటిస్తామని, ఈ పథకం వల్ల ఆవులను వీధుల్లోకి వదిలివేయరని సీఎం వ్యాఖ్యానించారు. పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఆవు పేడను సేకరించి వర్మికంపోస్టు ఉత్పత్తి చేయాలని సూచించారు.
✍ వర్మీకంపోస్టు ఎరువును సహకార సంఘాల ద్వారా అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పట్టణాభివృద్ధి శాఖల ప్లాంటేషన్ కార్యక్రమాలకు, రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు.
0 Comments