✊ భారత్‌తోపాటు ఐర్లండ్, మెక్సికో, నార్వే
✊ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి
👉 UNSC యొక్క విధులు మరియు అధికారాలు
👉 1267 కౌంటర్ టెర్రరిజం కమిటీ ఏం చేస్తుంది?
👉 1267 కమిటీ ఆంక్షల రకాలు
👉 కమిటీ జాబితాను ఎలా నిర్ణయిస్తుంది?
👉 జాబితాలో ఎంతమంది ఉన్నారు?
👉 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. 👉 మొత్తం 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 192 దేశాలు ఓటింగులో పాల్గొనగా, భారత్‌కు అనుకూలంగా 184 దేశాలు ఓటేశాయి. 👉 ఫలితంగా మరోసారి తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది. 👉 భద్రతా మండలి శాశ్వత సభ్యత్వాన్ని కోరుకునే ప్రయత్నాలను కొనసాగిస్తున్న భారతదేశానికి.. 2021-22 కాలానికి కౌన్సిల్ లోకి ప్రవేశం పొందడం కీలకం.👉 భారత్ ఇలా ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి. 2021-22 కాలానికి భారత్‌ను ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎన్నుకున్నట్టు భారత శాశ్వత ప్రతినిధి TS తిరుమూర్తి తెలిపారు. కాగా, భారత్‌తోపాటు ఐర్లండ్, మెక్సికో, నార్వే కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించాయి. 👉 అలాగే భారత్ గతంలో 1950-1951, 1967-1968, 1972-1973, 1977-1978, 1984-1985, 1991-1992, 2011-12లలో విజయం సాధించింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి
👉 సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ళ కాలవ్యవధి కొరకు ఎన్నిక కాబడు తాత్కాలిక సభ్యదేశాలు. 👉 అమెరికా, రష్యా, ఇంగ్లాండు, చైనా, ఫ్రాన్సులు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం కూడా ఉంది.👉 సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేసారు. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను 10 కి పెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ ఐరోపా నుండి ఇద్దరు, తూర్పు ఐరోపానుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. 👉 తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు. 👉 దీనికి అధ్యక్షుడు ప్రతి మాసము మారుతుంటాడు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.
👉 UNSC యొక్క విధులు మరియు అధికారాలు
✊ ఐక్యరాజ్యసమితి సూత్రాలు మరియు ప్రయోజనాలకు అనుగుణంగా అంతర్జాతీయ శాంతి భద్రతలను కొనసాగించడం.
✊ అంతర్జాతీయ ఘర్షణకు దారితీసే ఏదైనా వివాదం లేదా పరిస్థితిని పరిశోధించడానికి ముందు ఉంటుంది.
✊ ఎటువంటి వివాదాలను మరియు పరిష్కార నిబంధనలను సర్దుబాటు చేసే పద్ధతులను సిఫారసు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయగలదు.
✊ శాంతికి లేదా దూకుడు చర్యకు ముప్పు ఉనికిని నిర్ణయించడానికి మరియు ఏ చర్య తీసుకోవాలో సిఫారసు చేస్తుంది.
✊ దురాక్రమణదారుడిపై సైనిక చర్య తీసుకొంటుంది.
దురాక్రమణను నివారించడానికి లేదా ఆపడానికి శక్తిని ఉపయోగించకుండా ఆర్థిక ఆంక్షలు మరియు ఇతర చర్యలను వర్తింపజేయడానికి సభ్యులను ముందుకు పిలుపునిస్తుంది.
✊ కొత్త సభ్యుల ప్రవేశాన్ని సిఫార్సు చేస్తుంది.
✊ "వ్యూహాత్మక ప్రాంతాలలో" ఐక్యరాజ్యసమితి యొక్క ట్రస్టీషిప్ విధులను నిర్వహిస్తుంది.
✊ సెక్రటరీ జనరల్ నియామకాన్ని సర్వసభ్యానికి సిఫారసు చేయడం మరియు అసెంబ్లీతో కలిసి అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులను ఎన్నుకొంటుంది
అసలు ఐక్యరాజ్య సమితి ఒకరిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఎలా ప్రకటిస్తుంది ? అలా ప్రకటించేందుకు ఏఏ ప్రమాణాలు పాటిస్తుంది?
👉 తీవ్రవాద సంస్థలు లేదా వ్యక్తులను జాబితాలో చేర్చే పని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 1267 కమిటీది.
👉 1267 కౌంటర్ టెర్రరిజం కమిటీ ఏం చేస్తుంది?
✊ టెర్రరిస్ట్ సంస్థలపై ఆంక్షలు, చర్యల అమలును ఇది పర్యవేక్షిస్తుంది
✊ తీర్మానాల జాబితాలో ఉన్న నిబంధనల ప్రకారం తగిన వ్యక్తులు, సంస్థలను సూచిస్తుంది
✊ ఐఎస్ఐస్, అల్-ఖైదా (ఈ రెండు సంస్థలకు సంబంధం ఉందని తేలినప్పుడు) ఆంక్షల జాబితా నుంచి పేర్లను చేర్చడం, తొలగించడం గురించి వచ్చే అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, వాటిపై నిర్ణయం తీసుకుంటుంది
✊ ఐఎస్ఐఎస్, అల్-ఖైదా ఆంక్షల జాబితాలో చేర్చే వ్యక్తులు, సంస్థల గురించి ప్రత్యేక సమీక్షలను నిర్వహిస్తుంది
✊ ఆయా సంస్థలు, వ్యక్తులపై పర్యవేక్షణ బృందం సమర్పించిన నివేదికలను పరిశీలిస్తుంది
✊ ఆంక్షలు అమలు చేయడం గురించి ఏటా భద్రతా మండలికి నివేదిక ఇస్తుంది
👉 1267 కమిటీ ఆంక్షల రకాలు
✊ ఈ జాబితాలో ఉన్న సంస్థలు, వ్యక్తులు ఆయుధాలను వినియోగించటంపై నిరోధం ఉంటుంది
వారి ప్రయాణాలపై నిషేదం ఉంటుంది
✊ ఆయా సంస్థలు, వ్యక్తుల ఆస్తుల స్వాధీనం చేసుకుంటుంది
✊ ఈ చర్యలకు తుదిగడువు ఏదీ ఉండదు
✊ ఈ ఆంక్షలు, చర్యలను 18 నెలలకొకసారి సమీక్షిస్తారు
👉 జాబితాలో ఎంతమంది ఉన్నారు?
✊ భద్రతా మండలి 1267 కౌంటర్ టెర్రరిజం కమిటీలో ఇప్పటివరకూ 257 మంది వ్యక్తులు, 81 సంస్థలను నమోదు చేశారు.
✊ జాబితాలో నమోదుకు పాటించే ప్రమాణాలు
✊ ఒక వ్యక్తి లేదా సంస్థకు ఐఎస్ఐఎస్ లేదా అల్-ఖైదాతో సంబంధం ఉన్నట్టు సూచించే ఏవైనా చర్యలు, లేదా కార్యకలాపాలకు పాల్పడితే వారు ఐఎస్ఐస్, అల్-ఖైదా ఆంక్షల జాబితాలో చేర్చడానికి అర్హులు అవుతారు.
✊ ఐఎస్ లేదా అల్-ఖైదా తరఫున పనిచేయడం, లేదా వారికి సహకరించడం, వారికి, లేదా సంబంధిత విభాగాలకు ఆయుధాల సరఫరా, అమ్మకం, బదిలీ చేసినా, వారి కోసం పెట్టుబడులు పెట్టినా, ప్రణాళికలు రూపొందించినా ఈ జాబితాలో చేరుస్తారు. ఆ సంస్థల కోసం లేదా వాటి అనుబంధ సంస్థల కోసం ఎవరినైనా రిక్రూట్ చేసుకున్నా వారిని జాబితాలో చేరుస్తారు.
👉 కమిటీ జాబితాను ఎలా నిర్ణయిస్తుంది?
✊ 1267 కౌంటర్ టెర్రరిజం కమిటీ ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయాలు తీసుకుంటుంది. ఒక ప్రత్యేక అంశంపై ఏకాభిప్రాయం సాధించలేకపోతే, కమిటీ అధ్యక్షుడు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించవచ్చు. అప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోతే, ఆ అంశాన్ని భద్రతా మండలికి సమర్పించవచ్చు.
✊ సాధారణంగా, ఏ అభ్యంతరాలూ లేనట్లయితే ఐదు రోజుల్లో నిర్ణయాలు తీసుకోవచ్చు. పేర్ల నమోదుకు, తీసివేయడానికి నో అబ్జక్షన్ ప్రక్రియ పది రోజుల వరకూ పడుతుంది.
✊ ప్రతిపాదిత నిర్ణయాన్ని ఎలాంటి కాల పరిమితి లేకుండా సభ్యులు హోల్డులో ఉంచవచ్చు.
✊ అయితే పెండింగులో ఉన్న అంశాన్ని పరిష్కరించడానికి మూడు నెలల తర్వాత అప్ డేట్స్ అందించాలని అభ్యర్థించవచ్చు.
0 Comments