పూరి జగన్నాథ్ టెంపుల్


👉 ఆలయ నిర్మాణ విశేషాలు
👉 పహండీ అంటే ఏమిటి ?
👉 రథయాత్ర ఎలా చేస్తారు  ?

👉 జూన్ 23 నుండి జరగాల్సిన ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో సుప్రీంకోర్టు వార్షిక రథయాత్రను నిబంధనలతో జరుపుకొనేలా ... సుప్రీం కోర్టు అనుమతించింది.

👉 ఆలయ నిర్మాణ విశేషాలు

👍 ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. 
👍 శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జండా ఉంటుంది. జండామీద సుదర్శన చక్రం ఉంటుంది. 
👍 ఇది కొన్నిమైళ్ళ దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. 
👍 సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. 
👍 ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది.
 👉 రథయాత్ర :
👍 పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాల విశేషంగా జరుగుతోంది. 
👍 హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 
👍 ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగ పరిగణించబడుతుంది. 
👍 ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందుప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి.

👍 రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం  లభిస్తుంది. 
👍 ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా...) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. 
👍 ఈ ఉత్సవాన్ని 'పహండీ' అంటారు. 
👍 ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా... 'ఇలపై నడిచే విష్ణువు'గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే 'చెరా పహారా' అంటారు.

 👉 రథ నిర్మాణం ఏవిధంగా చేస్తారు 

👍 రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. 
👍 పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేదపండితులు శాంతి నిర్వహించాక.... జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప అవసరం. 
👍 ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. 
👍 తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. 
సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదళన్‌. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా...ఆలయ తూర్పు భాగంలోని సింహ ద్వారం దగ్గర నిలబెడతారు. 
👍 లాగేందుకు అనువుగా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు.
👉 పూరి టెంపుల్ ఆర్కిటెక్చర్

✌జగన్నాథ్ ఆలయం చాలా పెద్ద ఆలయం మరియు 37000 మీ 2 విస్తీర్ణంలో ఉంది. బయటి గోడ యొక్క ఎత్తు 6.1 మీ.గా ఉంటుంది. 
✌ దీని చుట్టూ 6.1 మీటర్ల ఎత్తైన ఎత్తైన గోడ ఉంది, దీనిని మేఘనాడ పచేరి అంటారు.
✌ ఈ ఆలయం యొక్క ప్రధాన భాగం చుట్టూ కుర్మ భేదా అని పిలువబడే గోడ ఉంది.
✌ఈ ఆలయం రేఖ డ్యూలా శైలిలో నిర్మించబడింది మరియు నాలుగు విభిన్న విభాగ నిర్మాణాలను కలిగి ఉంది, 
అవి :
రత్నవేది (ముత్యాల సింహాసనం) పై త్రయం దేవతలను ఉంచే డ్యూలా, విమన లేదా గార్బా గ్రిహా (గర్భగుడి) ముఖశాలా (ఫ్రంటల్ పోర్చ్) నాగ మందిర్ / నాటమండప, దీనిని జగమోహన్ (ఆడియన్స్ హాల్ / డ్యాన్స్ హాల్) అని కూడా పిలుస్తారు, మరియు భోగా మండప (సమర్పణల హాల్)

Post a Comment

0 Comments

Close Menu