😎 పెర్మఫ్రోస్ట్ అంటే ఏమిటి ?

😎 పెర్మఫ్రోస్ట్ అంటే ఏమిటి?
😎 నోరిల్క్ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద మంచి నీటి సరస్సుని కలుషితం చేసింది.
✍️ ప్యాసిన నది మరింత కలుషితం అవ్వకుండా చూసుకోవల్సిన అవసరం


https://www.facebook.com/INDIANRAMANA/

✍️ ఆర్కిటిక్‌ తీరంలో భారీ చమురు ట్యాంకు కుప్పకూలిన ఘటన రష్యాకు పెద్ద తలపోటుగా మారింది.
✍️ దాదాపు 20వేల టన్నుల డీజిల్‌ మంచి నీటి నదుల్లో కలవటంతో ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే అత్యవసర పరస్థితిని ప్రకటించింది.
✍️ అత్యవసర విభాగాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. నదిపై తెట్టెలుగా తేలిన చమురును తొలగించటానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
✍️ సహాయక బృందాలు ఇప్పటికే 23వేల క్యూబిక్‌ మీట్లర్లలోని చమురును తొలగించాయి. పెనుగాలుల ప్రభా వంతో నదిలోని చమురు వేగంగా విస్తరిస్తుండటం సహాయక సిబ్బందికి మరింత తలనొప్పిగా మారింది.

✍️ ఉత్తర రష్యా ప్రాంతంలో ఉన్న ఆయిల్ ట్యాంకుల నుంచి జరిగిన ఇంధన లీకేజ్ నోరిల్క్ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద మంచి నీటి సరస్సుని కలుషితం చేసింది.
✍️ఈ లీకేజ్ ఆర్కిటిక్ సముద్ర ప్రాంతం వరకు విస్తరించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
✍️ కూలిపోయిన ఒక ఆయిల్ ట్యాంక్ నుంచి జరిగిన ఈ లీకేజ్ ఇప్పటికే నోరిల్క్ కి ఉత్తరంగా 20 కిలోమీటర్ల వరకు వ్యాపించింది. దీనిని నియంత్రణలోకి తేవడానికి ఎమర్జెన్సీ సిబ్బంది కృషి చేస్తోంది.
✍️ ఇది రష్యా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అతి ఘోరమైన ప్రమాదమని, పర్యావరణవేత్తలు, అధికారులు చెబుతున్నారు. మే 29 వ తేదీన ఆయిల్ లీక్ అవ్వడం మొదలైంది.
https://www.facebook.com/INDIANRAMANA/
✍️ ఇప్పటికే లీక్ అయిన 21000 టన్నుల ఆయిల్ అమ్బర్ణాయ నది, చుట్టుపక్కల పరీవాహక ప్రాంతాన్ని కలుషితం చేసింది.
✍️ నోరిల్క్ నదీ పరివాహక ప్రాంతంలో పెర్మాఫ్రోస్ట్ కరగడం వలన ఈ ఆయిల్ ట్యాంక్ మునిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో గత కొన్ని వారాలుగా అసాధారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇది గ్లోబల్ వార్మింగ్ కి సంకేతం కావచ్చు.
✍️ ప్రపంచంలోనే అతి పెద్ద స్థాయిలో నికెల్, పల్లాడియంని ఉత్పత్తి చేసే నోరిల్క్ నికెల్ కి ఈ లీకేజీ జరిగిన పవర్ ప్లాంట్ అనుబంధ సంస్థగా ఉంది.

✍️ ఆర్కిటిక్ మహా సముద్రంలో భాగమైన కార సముద్రంలో కలిసే ప్యాసిన నదికి, ప్యాసినో సరస్సు తీరంగా ఉంది. అక్టోబర్ నుంచి జూన్ వరకు ఈ నది గడ్డ కట్టి ఉంటుంది.
✍️ "ఈ ఇంధనం ప్యాసినో సరస్సులో కలిసిందని క్రాస్నోయర్స్క్ ప్రాంత గవర్నర్ అలెక్సాన్డెర్ ఉస్ తెలిపారు.
✍️ 70 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సరస్సులో చేపలు, మంచి జీవావరణం ఉన్నాయని ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
✍️ ఇప్పటికే 812,000 క్యూబిక్ అడుగుల లోతులో కలుషితమైన మట్టిని తొలగించినట్లు రియా నోవోస్తి వార్తాసంస్థ ప్రచురించింది.
✍️ ప్యాసిన నది మరింత కలుషితం అవ్వకుండా చూసుకోవల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
✍️ గ్రీన్ పీస్ ఈ ఆయిల్ లీకేజ్ ని 1989లో అలస్కాలో చోటు చేసుకున్న వాల్డెజ్ ఉత్పాతంతో పోల్చింది.
✍️ పెర్మఫ్రోస్ట్ ప్రాంతంలో నెలకొల్పిన ప్రమాదకరమైన యూనిట్లను పరిశీలించమని రష్యా ప్రాసిక్యూటర్లు ఆదేశాలు జారీ చేశారు.
https://www.facebook.com/INDIANRAMANA/
✍️ ఈ ఇంధన లీకేజ్ విషయంలో జరిగిన సమాచార జాప్యం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన సంస్థ డైరెక్టర్ వ్యాకేస్లావ్ స్టారోస్టిన్ ని అదుపులోకి తీసుకున్నారు.
✍️ ఈ ఇంధన లీకేజీ లో జరిగిన నిర్లక్ష్యానికి గాను రష్యా పరిశోధన బృందం క్రిమినల్ కేసును నమోదు చేసింది.

పెర్మఫ్రోస్ట్ అంటే ఏమిటి?

✍️ ఏదైనా భూభాగం రెండు గాని అంత కన్నా ఎక్కువ గానీ సంవత్సరాలు మంచుతో గడ్డ కట్టి ఉంటె ఉంటే ఆ ప్రాంతాన్ని పెర్మ ఫ్రోస్ట్ అంటారు.
✍️ రష్యా భూభాగంలో 55 శాతం , ముఖ్యంగా సైబీరియా ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పి ఉంటుంది. ఈ ప్రాంతంలో రష్యాలోని ఆయిల్ గ్యాస్ ఫీల్డ్ లు నెలకొని ఉంటాయి.
✍️ అయితే, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వలన మంచు కరగడంలో, ఈ ఆయిల్ నిల్వలకి గతంలోలా ఈ ప్రాంతం అనువుగా లేదని, 2017 లో ఆర్కిటిక్ కౌన్సిల్ కి అందచేసిన నివేదిక పేర్కొంది.
✍️ రష్యాలో ప్రస్తుతం లీక్ అయిన ఇంధనం అమ్బర్ణాయ నదిని ఎరుపు వర్ణంలోకి మార్చేసింది.
✍️ ఈ ఘటన గురించి తగిన సమయంలోనే అధికారులకి సమాచారం అందించినట్లు నోరిల్క్ నికెల్ సంస్థ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
✍️ ఈ ప్రాంతం శుభ్రం చేయడానికి కావలసిన నిధులను కంపెనీ యాజమాన్యమే సమకూరుస్తుందని తెలిపింది.
✍️ నోరిల్క్ ఇప్పటికే బాగా కలుషిత ప్రాంతంగా పేరు పొందింది.
✍️ గతంలోఇదే ప్లాంట్లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా దగ్గర్లో ఉన్న నదిలోని నీరు ఎర్రగా మారినట్లు సంస్థ అంగీకరించింది.
✍️ అయితే, ఇప్పటికే ఇక్కడ కాలుష్యం నది అంతర్భాగాన్ని ఆవరించిందని రష్యా క్రస్నోయర్స్క్ ఉప పర్యావరణ మంత్రి యూలియా గుమెన్ యుక్ అన్నారు.
https://www.facebook.com/INDIANRAMANA/
✍️ప్రపంచ ప్రఖ్యాత చమురు సంస్థ నోరిల్‌స్క్‌ నికెల్‌కు చెందిన ఆర్కిటిక్‌ ప్రాంతంలోని ప్లాంటులో ఓ చమురు ట్యాంకు గత నెల 31న కుప్పకూలింది. దీంతో ట్యాంకులోని 20వేల టన్నుల చమురు కొద్దికొద్దిగా లీకవుతూ అక్కడికి దగ్గరగా ఉన్న డల్‌డైకాన్‌, అంబర్‌నాయ నదులలో కలిసింది. అంబర్‌నాయ నదిలో చమురు ప్రభావం ఎక్కువగా ఉంది.
✍️ దాదాపు 12మైళ్ల మేర చమురు వ్యాపించింది. లీకేజీ కారణంగా వాతావరణంలో సైతం మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu