ఆర్‌బిఐ పరిధిలోనే సహకార బ్యాంకులు

✎ సహకార బ్యాంకులు
✎ 1,482 పట్టణ సహకార బ్యాంకులు, 58 అంతర్రాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకులు..
✎ RBIకి అధికారాలు
🖊 అన్ని పట్టణ మరియు బహుళ-రాష్ట్ర సహకార బ్యాంకులను ఆర్‌బిఐ ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకురావాలని ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది.

✎ 2019 లో పంజాబ్ మరియు మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పిఎంసి) బ్యాంక్ వద్ద జరిగిన పెద్ద కుంభకోణంతో సహా అనేక మోసాలు మరియు తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
✎ ఇప్పటి వరకు, అన్ని సహకార బ్యాంకులు ఆర్‌బిఐ మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్ యొక్క ద్వంద్వ నియంత్రణలోకి వచ్చాయి.
✎ ఇంతకుముందు, సహకార బ్యాంకు పునర్నిర్మాణం యొక్క అమలు చేయగల పథకాన్ని రూపొందించడానికి RBIకి అధికారాలు లేవు.
✎ అయితే, ఇప్పటి నుండి పట్టణ మరియు బహుళ-రాష్ట్ర సహకార సంస్థ ఆర్బిఐ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వస్తుంది.
✎ ఈ చర్య వాణిజ్య బ్యాంకుల తరహాలో అన్ని పట్టణ మరియు బహుళ-రాష్ట్ర సహకార బ్యాంకులను నియంత్రించడానికి ఆర్బిఐకి అధికారం ఇస్తుంది.

✎ సహకార బ్యాంకులు

✎ ఇది దాని సభ్యులకు చెందిన ఒక ఆర్థిక సంస్థ
✎ ఇది వాణిజ్య బ్యాంకుల నుండి భిన్నంగా ఉంటుంది.
✎ ఇక్కడ  తమ కార్యకలాపాల ప్రాంతం ఆధారంగా విస్తృతంగా పట్టణ మరియు గ్రామీణ సహకార బ్యాంకులుగా వర్గీకరించబడ్డారు.
✎ ఇవి  సంబంధిత రాష్ట్ర సహకార సంఘాల చట్టం క్రింద లేదా బహుళ-రాష్ట్ర సహకార సంఘాల చట్టం, 2002 క్రింద నమోదు చేయబడ్డాయి.
✎సహకార బ్యాంకులు చట్టాలద్వారా  పాలించబడతాయి అవి
బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టం, 1949.
బ్యాంకింగ్ చట్టాలు (సహకార సంఘాలు) చట్టం, 1955

✎ దేశంలో 1,500పైగా సహకార బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్‌ చేసిన మదుపర్లకు భరోసా కల్పించే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 
✎ ఈ బ్యాంకులను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) పర్యవేక్షణలోకి తీసుకొచ్చే ఆర్డినెన్స్‌ను బుధవారమిక్కడ ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. 
✎ 1,482 పట్టణ సహకార బ్యాంకులు, 58 అంతర్రాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకులు సహా ప్రభుత్వ బ్యాంకులన్నీ ఇక ఆర్‌బీఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌  వెల్లడించారు. 
✎ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదించగానే ఇది అమల్లోకి వస్తుందన్నారు. 
దీనివల్ల ఈ బ్యాంకుల్లోని రూ.4.84 లక్షల కోట్ల సొమ్ము కు భద్రత ఏర్పడుతుందని.. 8.6 కోట్ల మంది మదుపర్లకు భరోసా ఉంటుందని చెప్పారు. గత ఏడాది ముంబైలోని పంజాబ్‌-మహారాష్ట్ర సహకార బ్యాంకు(పీఎంసీ)లో కుంభకోణం జరిగిన నేపథ్యంలో సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పరిధిలోకి తేవాలని కేంద్రం నిశ్చయించింది.
✎ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయం ప్రకటించారు. 
✎ కేబినెట్‌ నిర్ణయంతో ఇక నుంచి దేశంలోని అన్ని సహకార బ్యాంకులు.. షెడ్యూల్‌ బ్యాంకుల్లా పూర్తిగా ఆర్‌బీఐ నిబంధనలకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. 
✎ ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై)లోని ‘శిశు’ విభాగం కింద రుణాలు (రూ.50 వేలకు తక్కువగా) తీసుకునేవారికి 2ు వడ్డీ రాయితీ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. 
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు బకాయి ఉన్న అని శిశు రుణాలకు రాయితీ వర్తిస్తుందని జావడేకర్‌ చెప్పారు. 
✎ ఇంకోవైపు.. రూ.15 వేల కోట్లతో పశు సంవర్ధక మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఏహెచ్‌ఐడీఎఫ్‌) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 
✎ దీనిప్రకారం.. డెయిరీ, మాంసం ఉత్పత్తుల ప్రాసెసింగ్‌, పశు ఆహారోత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టే ప్రైవేటు సంస్థలు, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ)కు 3శాతం వడ్డీ రాయితీ కల్పిస్తారు. ఈ నిర్ణయం వల్ల దేశంలో పాల ఉత్పత్తి, ఎగుమతులు పెరుగుతాయని.. అదనంగా 35 లక్షల ఉపాధి అవకాశాలు దొరుకుతాయని జావడేకర్‌ వెల్లడించారు. 
✎ కరోనాతో దెబ్బతిన్న పరిశ్రమలను, రైతులను, సామాన్యులను ఆదుకునేందుకు ప్రకటించిన రూ.20 లక్షల ప్యాకేజీలో ఇది భాగం. అలాగే ఎంఎ్‌సఎంఈల నిబంధనలకు లోబడి ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు రుణ హామీ ఇచ్చేందుకు రూ.750 కోట్లతో ప్రభుత్వం నిధిని ఏర్పాటు చేయనుంది. నాబార్డు దీనిని పర్యవేక్షిస్తుంది. కాగా.. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలు కూడా పాలుపంచుకునేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
✎ ఇందుకోసం ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌-ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పే్‌స)ను ఏర్పాటు చేశారు. అంతరిక్ష కార్యకలాపాలతో పాటు గ్రహాన్వేషణ మిషన్లలోనూ ప్రైవేటు సంస్థలు భాగస్వాములు కావచ్చు.భారతీయ అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడాన్ని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ స్వాగతించారు.

Post a Comment

0 Comments

Close Menu