✌ ఇది ఎలా ఏర్పడింది?
✌ అక్కడ ఏవి నివసించేవి?
✌ఎంతకాలంగా నీటిలో మునిగివుంది?
✌ తాజా ఫలితాలు
✌ ఎలా జిలాండై ఉద్భవించింది ?
✌ జిలాండై
✌ అది 1642 సంవత్సరం. అబెల్ టాస్మాన్ ఒక లక్ష్యంతో బయలుదేరారు. అతడు అనుభవజ్ఞుడైన డచ్ నావికుడు. దక్షిణార్ధగోళంలో ఒక విస్తారమైన భూ ఖండం ఉందని బలంగా నమ్మేవాడు. దానిని వెదికి పట్టుకోవాలన్నది అతడి సంకల్పం.
✌ ఆ కాలంలో భూగోళం మీద దక్షిణ భాగం యూరోపియన్ అన్వేషకులకు చాలావరకూ తెలియదు. కానీ అక్కడ పెద్ద భూభాగం ఉండి తీరాలని వారి అచంచల విశ్వాసం.
✌ ఆ భూభాగానికి వారు ముందుగానే టెర్రా ఆస్ట్రేలియా అని పేరు కూడా పెట్టారు. ఈ భూఖండం ఉనికి గురించి ప్రాచీన రోమన్ కాలంలోనే ఒక నమ్మకం ఏర్పడింది. అయితే ఆ నమ్మకాన్ని పరిశీలించే సమయం మాత్రం 16వ శతాబ్దానికి కానీ రాలేదు.
✌ టాస్మాన్ 1642 ఆగస్టు 14న ఇండోనేషియాలోని జకార్తా నుంచి రెండు చిన్న ఓడలతో బయలుదేరాడు. తొలుత పశ్చిమ దిశగా పయనించాడు. తరువాత దక్షిణానికి మళ్లాడు. ఆ తరువాత తూర్పు వైపు సాగాడు. చివరికి నేటి న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌కు చేరాడు. అక్కడి ఆదివాసీలైన మావోరి ప్రజలతో అతని మొదటి అనుభవం బెడిసికొట్టింది.
✌రెండో రోజు కొంత మంది నావికులు చిన్నపడవపై బయలుదేరి.. డచ్ ఓడల మధ్య సందేశాలను చేరవేసే ఒక చిన్న పడవను ఢీకొట్టారు. ఆ ఘటనలో నలుగురు యూరోపియన్లు చనిపోయారు. యూరోపియన్లు ఆ తరువాత మరో 11 మావోరీల పడవలపై ఫిరంగితో కాల్పులు జరిపారు. ఆ పడవల్లోని వారికి ఏమైందో ఎవరికీ తెలీదు.
✌ టాస్మాన్ ప్రయాణం అక్కడితో ముగిసింది. కొన్ని వారాల తర్వాత.. ఆ కొత్త భూమిపై అడుగు పెట్టకుండానే వెనుదిరిగాడు. ఆ ప్రదేశానికి మూర్డెనార్స్ (హంతకుల) బే అని పేరు పెట్టాడు. ఒక భారీ దక్షిణ భూ ఖండాన్ని నిజంగా కనుగొన్నానని అతడు నమ్మాడు. కానీ.. అతడు ఆశించినట్లు అదేమీ వాణిజ్య స్వర్గధామం కాదని తేలింది. అతడు మళ్లీ ఆ ప్రాంతానికి తిరిగి వెళ్లలేదు.
✌అయితే.. దక్షిణార్థగోళంలో భారీ భూకండం గురించి తన అంచనా ఆసాంతం సరైనదేనని టాస్మాన్‌కు ఏమాత్రం తెలియదు. కనిపించకుండాపోయిన భూ ఖండం ఒకటి ఉంది.
✌జీలాండియా (మావోరి భాషలో టే రియు-ఎ-మాయి) అనే భూ ఖండాన్ని కనుగొన్నట్లు జియాలజిస్టులు ప్రకటించారు. అది పతాక శీర్షికలకు ఎక్కింది. ఆ భారీ భూఖండం సుమారు 18.9 లక్షల చదరపు మైళ్ళు (49 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తరించివుంది. మడగాస్కర్ కంటే ఆరు రెట్లు పెద్దది.
✌ ప్రపంచంలో ఏడు ఖండాలు మాత్రమే ఉన్నాయని ఎన్‌సైక్లోపీడియాలు, మ్యాప్‌లు, సెర్చ్ ఇంజన్లు కొంత కాలం మొండికేసినప్పటికీ.. అది తప్పు అని సదరు పరిశోధకుల బృందం ప్రపంచానికి ధీమాగా తెలియజేసింది. మొత్తానికి భూమి మీద ఎనిమిది ఖండాలు ఉన్నాయి. సరికొత్తగా జాబితాలో చేరిన ఈ ఎనిమిదో ఖండం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది - ఇది ప్రపంచంలోని అతిచిన్న ఖండం, అతి సన్నని ఖండం, అతి పిన్న వయసు ఖండం. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఖండంలో 94 శాతం ప్రాంతం సముద్ర జలాల్లో దాగి వుంది.
✌ న్యూజీలాండ్ వంటి కొన్ని ద్వీపాలు నీటిపైకి చొచ్చుకువచ్చాయి. ఇన్నాళ్లుగా ఈ ఖండం మన కళ్లముందే దాక్కుని ఉంది.
✌ కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ ఖండం ఉనికి గురించి ప్రపంచానికి చాటి నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఇంకా ఈ ఖండం రహస్యాలు నీటి కింద 6,560 అడుగుల (2 కిలోమీటర్ల) లోతులో దాగే ఉన్నాయి.
✌ ఇది ఎలా ఏర్పడింది?
✌ అక్కడ ఏవి నివసించేవి?
✌ఎంతకాలంగా నీటిలో మునిగివుంది?
✌ నిజానికి, జీలాండియాను అధ్యయనం చేయటం ఎప్పుడూ చాలా కష్టంగానే ఉంది అని పరిసోదకులు తెలిపారు.
✌ 1642లో టాస్మాన్ న్యూజీలాండ్‌ను కనుగొన్న రెండు దశాబ్దాల తరువాత.. బ్రిటన్ తమ మ్యాప్ రూపకర్త జేమ్స్ కుక్‌ను దక్షిణార్ధగోళంలో శాస్త్రీయ పరిశోధన కోసం సముద్రయానానికి పంపించింది. సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో లెక్కించటం కోసం.. భూమికి, సూర్యుడికి మధ్య శుక్రుడు ప్రయాణించడాన్ని అధ్యయనం చేయాలని అతడికి అధికారికంగా నిర్దేశించారు.
✌ అయితే ఒక సీల్డు కవరు కూడా అతడికి ఇచ్చిపంపారు. అధికారికంగా నిర్దేశించిన పనిని పూర్తి చేసిన తర్వాత ఆ కవరును తెరిచి చూడాలని ఆదేశించారు.
✌ దక్షిణార్థ గోళంలోని భూ ఖండాన్ని కనుగొనే అత్యంత రహస్య కార్యక్రమం చేపట్టాలనే ఆదేశం ఆ సీల్డు కవరులో ఉంది. అంటే.. అతడు న్యూజీలాండ్ చేరుకోవడానికి ముందుగానే ఆ భూ ఖండం మీదుగా ప్రయాణించాడనేది స్పష్టం.
✌ 1895లో న్యూజీలాండ్ దక్షిణ తీరంలోని ద్వీపాల శ్రేణిని సర్వే చేయడానికి సముద్రయానం చేసిన స్కాటిష్ ప్రకృతి శాస్త్రవేత్త సర్ జేమ్స్ హెక్టార్.. జీలాండియా ఉనికి గురించి మొట్టమొదటి నిజమైన ఆధారాలను సేకరించారు.
✌ ఆ దీవుల భౌగోళిక, భూగర్భ పరిస్థితులను అధ్యయనం చేసిన ఆయన.. న్యూజీలాండ్ అనేది "దక్షిణానికి, తూర్పుకు సుదూరంగా విస్తరించి ఉన్న ఒక భారీ ఖండానికి చెందిన ఒక పర్వత శ్రేణి అవశేషం.. ఆ భూఖండం ఇప్పుడు నీటిలో మునిగి ఉంది..." అని నిర్ధారించారు.
0 Comments