✌ విజయానికి కావల్సిందేమిటి ?

✌ మెటాకాగ్నిషన్ అంటే ఏమిటి ?
✌ దృఢ సంకల్పం కూడా ముఖ్యం 
✌ పది శాతం ప్రేరణ, తొంభై శాతం కఠోర శ్రమ  అన్నారు థామస్ అల్వా ఎడిసన్.

✌ ఎడిసన్ బల్బ్ కనిపెట్టడానికి ముందు కొన్ని వందలసార్లు  సార్లు విఫలమయ్యారట
✌ ఇది మనకి గొప్ప స్ఫూర్తినిస్తుందన్నమాట నిజమేగానీ.. కఠోర శ్రమ మాత్రమే లక్ష్యాలకు దగ్గర చేస్తుంది.
✌ బలమైన కోరిక, దృఢ నిశ్చయం మాత్రమే లక్ష్యానికి చేరువయ్యేలా చేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
✌ కానీ తన లక్ష్యాలను చేరుకునే దిశలో ఎడిసన్ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది కూడా పరిశీలించవలసిన అంశమే ఇక్కడ ముఖ్య విషయం.
✌ ఆయన ఒక ప్రయోగం విఫలమవ్వగానే మరో ప్రయోగానికి గాలివాటంగా మళ్లలేదు.
✌ విఫలమైన ప్రతీసారి తన ఆలోచనలను తానే విశ్లేషించుకుంటూ, మెరుగుపరుచుకుంటూముందుకు సాగారు.
 
✌ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుని, అది విఫలమయ్యేవరకూ దాని మీదే పని చేస్తాను. అది విఫలం అయ్యిందని తెలిసాక మరో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాను అని ఎడిసన్ 1890లో హార్పర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 

✌ ఎడిసన్ తన వైఫల్యాలనుంచి నేర్చుకుంటూ, చిన్న చిన్న విజయాలబాటగా లక్ష్యాన్ని చేరుకున్నారు.

✌  వ్యూహాత్మక ఆలోచనా విధానం కూడా చాలా ముఖ్యమైనది.

✌ ఇక్కడ నిరంతరం మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ, మన ఆలోచనలను మనమే విశ్లేషించుకుంటూ,తప్పులు దిద్దుకుంటూ ముందుకి వెళ్తే లక్ష్యాలను సులువుగా చేరుకోగలుగుతాం.
వ్యూహాత్మక ఆలోచనా విధానం ఒక పనిని మరింత సమర్థవంతంగా చెయ్యడానికి ఉపయోగపడుతుంది.  

✌ ఆలోచనల గురించి ఆలోచించడం
✌ఈ ఆలోచన పరిధి మెటాకాగ్నిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మెటాకాగ్నిషన్ అంటే మన సొంత ఆలోచనా ప్రక్రియ గురించి మనకున్న అవగాహన అన్న మాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే   మన ఆలోచనల గురించి మనమే ఆలోచించుకోవడం.
✌ మెటాకాగ్నిటివ్ వ్యూహం అంటే లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఎంత ముందుకు వెళుతున్నామో లేదో సమీక్షించుకోవడం, వైఫల్యాలనుంచీ నేర్చుకుంటూ, సవాళ్లను అధిగమిస్తూ ముందు సాగడం.
 
కొందరికి సహజంగా వ్యూహాత్మక ఆలోచనావిధానం అలవడుతుందా? 

ఈ అంశం పరిశోధించాల్సిన విషయమని కొందరు భావించారు. వ్యూహాత్మకా ఆలోచనా విధానాన్ని నేర్పించగలమా అనేది కూడా పరిశీలించవలసిన విషయం.
ఈ అంశాలను పరిశీలించేందుకు చెన్ అనే ఒక బృందం ఒక ప్రశ్నాపత్రాన్ని తయారుచేసింది.
ఈ కింది ప్రశ్నాప్రత్రాన్ని నింపడం ద్వారా మీలోని వ్యూహాత్మక ఆలోచనా విధానాన్ని మీరే స్వయంగా పరీక్షించుకోవచ్చు అని కొన్ని ప్రశ్నలు ఇచ్చారు.  
✌ కిందనున్న అంశాలను 1 (ఎప్పుడూ కాదు) నుంచి 5 (ఎల్లప్పుడూ) స్కేలు మీద కొలవండి.

✌ మీరు చేస్తున్న పని మధ్యలో ఆగిపోయి ముందుకు కదలనప్పుడు "ఈ చిక్కునుంచి బయటపడి ముందుకు వెళ్లడానికి నేనేం చెయ్యగలను?" అని మిమ్మల్ని మీరు ఎంత తరుచుగా ప్రశ్నించుకుంటారు?

✌ మీరు చేస్తున్న పనిలో పురోగతి లేనప్పుడు ఇంతకన్నా మెరుగైన పద్ధతి ఏమైనా ఉందా అని మిమ్మల్ని మీరు తరచి చూసుకుంటారా?

✌ మీరు ఏదైనా పనిలో నిరాశ, నిస్ఫృహలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఈ పని ఇంతకన్నా బాగా చేయ్యగలిగే పద్ధతులేమైనా ఉన్నాయా అని అన్వేషిస్తారా ?

✌ మీరు ఏదైనా సవాలు ఎదుర్కొన్నప్పుడు దాన్ని సాధించడానికి అవసరమైన సాధనాలేమిటో అన్వేషిస్తారా ?

✌ ఏదైనా కష్టం ఎదురైనప్పుడు, ఇందులోంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారా?

✌ మీ స్కోరు ఎంత ఎక్కువ వస్తే అంత ఎక్కువ వ్యూహాత్మక ఆలోచనా విధానం మీకున్నట్టు లెక్క.
 
✌ఒక  ల్యాబ్ కి తీసుకెళ్లి ఒక పరీక్ష పెట్టారు. అక్కడ కొన్ని గుడ్లు పెట్టి గుడ్డులోని తెల్లసొనను, పసుపు సొనను వేరు చెయ్యమన్నారు. తెల్ల సొనల డబ్బాలో పసుపు సొన పడిపోతే మార్కులు తగ్గించేస్తారు.
✌ రెండిటినీ ఎలా వేరు చెయ్యాలన్నదానికి ప్రత్యేకమైన పద్ధతి ఏదీ లేదు. 
✌ ఎవరికి తోచిన విధానాన్ని వాళ్లు అనుసరించవచ్చు. గుడ్డు చిన్నగా పగలగొట్టి మొదట పచ్చ సొనను బయటకి తీసి తరువాత తెల్ల సొనను తీయొచ్చు లేదా వేళ్లతో రెండిటినీ వేరు చెయ్యొచ్చు. ఇలా ఏ పద్ధతైనా పాటించవచ్చు. ఎంత సమర్థవంతంగా ఎన్ని ఎక్కువ గుడ్లలో సొనలను వేరు చెయ్యగలరన్నదే పరీక్ష.
✌ కొంతమంది చాలా సమర్థవంతంగా, చాలా క్రియేటివ్‌గా ఈ పని చేశారు.
✌ మెటాకాగ్నిషన్ గురించి  తెలుసుకున్నవారు ఈ పరీక్షలో మెరుగైన పనితనం చూపించారు. చిక్కులు వచ్చినప్పుడు అందులోంచి బయటపడడానికి ప్రయత్నించడం, వైఫల్యాలనుంచి నేర్చుకుని ముందుకు వెళ్లడం, ఎప్పటికప్పుడు తమ పనిని విశ్లేషించుకుంటూ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవడంవంటివన్నీ చేశారు.
 
 
✌ దృఢ సంకల్పం కూడా ముఖ్యం

✌ లక్ష్య సాధన దిశలో వ్యూహాత్మక ఆలోచనా విధానం ఎంత ముఖ్యమో దృఢ సంకల్పం కూడా అంతే ముఖ్యం
ఈ రెండిటికీ ఏదైనా సంబంధం ఉందా అని పరిశీలించి చూస్తే మెటాకాగ్నిషన్‌కు, దృఢసంకల్పానికి సంబంధం లేదనికానీ లక్ష్యాన్ని చేరుకోవడానికి  ఈ రెండూ కూడా దోహదపడతాయని వారి ప్రయోగ ఫలితాల్లో తేలింది.
✌ దృఢసంకల్పం అనేది దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడుతుంది. లక్ష్యాలు దీర్ఘకాలికమైనవి అయినా కాకపోయినా ఒక పనిని సమర్థవంతంగా చేసేందుకు వ్యూహాత్మక ఆలోచనా విధానం తోడ్పడుతుంది
✌ కొందరికి సహజంగా వ్యూహాత్మక ఆలోచనా విధానం ఉంటుంది. అది లేనివారికి ఈ విధానాన్ని భోదించే పద్ధతులపై పరిశోధకులు దృష్టి సారించాలి
ఎడిసన్ చెప్పినట్టు "పది శాతం ప్రేరణ, తొంభై శాతం కఠోర శ్రమ" లో కొంత శ్రమ తప్పించుకుని సమర్థవంతంగా లక్ష్యాలను చేరుకోవడానికి ఈ వ్యూహాత్మక ఆలోచన విధానం తోడ్పడుతుందని చెన్ బృందం చేసిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu