రాజ్యం, సమాజం,ప్రభుత్వం,సంస్థలు అనగా నేమి ??


✌ రాజ్యం పదానికి అర్థం ఏమిటి ??
✌ రాజ్యం  నిర్వచనాలు ??
✌ రాజ్యం - ముఖ్య లక్షణాలు ??
✌ రాజ్యం, సమాజం,ప్రభుత్వం మధ్య తేడాలు ??

రాజ్యం ఒక రాజకీయ సంస్థ. ఇది అన్ని సామాజిక సంస్థలకంటే అత్యంత ముఖ్యమైనది, శక్తిమంతమైనది ''రాజ్యం" సహజమైన, అవసరమైన సంస్థ అని అరిస్టాటిల్ గారు తెలిపారు. 

మాకియవెల్లీ అనే తత్త్వవేత్త క్రీ.శ. 16వ శతాబ్దంలో ''ది ప్రిన్స్" అనే గ్రంథంలో ''రాజ్యం" అనే పదాన్ని ''లాస్టేటో"గా తొలిసారిగా ఉపయోగించాడు.ఇతడి ప్రకారం రాజ్యం అనేది అధికారాన్ని చెలాయించే సంస్థ.

ఆధునిక యుగంలో రాజ్యం అనే పదాన్ని ప్రభుత్వం, ప్రాంతం, జాతి అనే పర్యాయ పదాలతో సూచించారు ఆధునిక రాజ్యం ఏకాంత రాజ్యం కాదు. ఇతర దేశాలతో సంబంధాలు లేకుండా ఏ దేశం కూడా ఒంటరిగా మనలేదు. కాబట్టి ప్రతి రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అవసరం.

✌ మానవుడిపై అధికారంతో కూడిన ప్రాబల్యాన్ని రాజ్యం అని మాకియవెల్లీ నిర్వచించాడు. 

 ''రాజ్యం మానవుడి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవతరించి, అతడికి ఉత్తమ జీవితం ప్రసాదించడానికి కొనసాగుతుంది" అని అరిస్టాటిల్ భావన

రాజ్యం పదానికి అర్థం ఏమిటి ??
              
✌ రాజ్యాన్ని ఆంగ్లంలో ''స్టేట్" అంటారు. స్టేట్ అనే ఆంగ్ల పదం ''స్టేటస్" అనే 'ట్యూటానిక్' భాష నుంచి ఆవిర్భవించింది. ఇటలీ దేశస్తుడై ''మాకియవెల్లీ" క్రీ.శ. 16వ శతాబ్దంలో ''ది ప్రిన్స్" అనే గ్రంథంలో రాజ్యం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు.

రాజ్యం  నిర్వచనాలు ??

''మానవుడికి సుఖమైన, గౌరవమైన జీవనాన్ని ప్రసాదించడమే ధ్యేయంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం" - అరిస్టాటిల్
  ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం - బ్లంట్ షీలి
''ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిర నివాసులై, స్వతంత్య్రంగా ఉంటూ, వ్యవస్థాపిక ప్రభుత్వానికి విధేయులుగా ఉండే ప్రజా సముదాయమే రాజ్యం" - గార్నర్

రాజ్యం - ముఖ్య లక్షణాలు ??
          
✌ రాజ్యానికి ముఖ్యంగా ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమత్వం అనే నాలుగు ముఖ్య లక్షణాలతో పాటు 'అంతర్జాతీయ గుర్తింపు' కూడా అవసరం.

✌ ప్రజలు: రాజ్యం ఒక మానవ సంస్థ, మానవరహిత ప్రదేశాన్ని రాజ్యం అనరు. రాజ్య జనాభా ఎంత ఉండాలి అనే అంశం మీద నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. రాజ్య జనాభా 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటే బాగుంటుందని అరిస్టాటిల్ తెలిపాడు.ఆధునిక భౌగోళిక రాజ్యాల్లో అత్యధిక జనాభా గల దేశాలు ఉన్నాయి.
ఉదా: చైనా, భారతదేశం.
✌ అతి తక్కువ జనాభా గల దేశాలు కూడా ఉన్నాయి
ఉదా: అండోరా, మొరాకో.

✌ అసలు రాజ్యంలో జనాభా ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు. ఆ జనాభా ఎలాంటి వారు అనేది ప్రధానం.ఒక దేశంలోని జనాభా విద్యావంతులు, నైపుణ్యం కలవారు, దేశం కొరకు త్యాగం చేసే గుణం కలవారు ఉన్నట్లయితే ఆ దేశం బలవంతమవుతుంది. అది ఆదర్శ రాజ్యమవుతుంది.

 ప్రదేశం:
                 
ప్రదేశం లేదా భూభాగం అనేది రాజ్యం యొక్క రెండో ముఖ్య లక్షణం, రాజ్య జనాభా నిర్దిష్టంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న భూభాగాన్ని ప్రదేశం అంటాం. 
ఇందులో నిర్దిష్ట భూభాగం లేని సంచార జాతులను గుర్తించరు. 
1948లో యూదులంతా ఇజ్రాయెల్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక రాజ్యంగా గుర్తింపు పొందారు. 
రాజ్య భూభాగానికి సహజ సరిహద్దులు ఉంటే రక్షణ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సరిహద్దుల వెంబడి సముద్ర తీరం, పర్వత శ్రేణులు ఉంటే అది రాజ్య భూభాగానికి సహజ రక్షణలుగా నిలిచి శత్రువుల దురాక్రమణను అరికడతాయి. 
ఇక రాజ్యానికి ఎంత ప్రదేశం ఉండాలి అనే అంశంలో ఏకాభిప్రాయం లేదు. ఎక్కువ విస్తీర్ణంతో ఉన్న దేశాలు కొన్ని ఉంటే, అతి తక్కువ విస్తీర్ణంతో ఉన్న దేశాలు కూడా కలవు. 
రాజ్యానికి భూభాగం ఎంత అన్నది ముఖ్యం కాదు. ఆ భూభాగం ఎలాంటిది అన్నదే ప్రధానం. ఒక రాజ్య భూభాగంలో సహజ వనరులు, నీరు, నదీజలాలు, సారవంతమైన నేలలు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉంటే ఆ రాజ్యం బాగా అభివృద్ధి చెందుతుంది.

3) ప్రభుత్వం:
                
ప్రభుత్వమనేది రాజ్యానికి మూడో లక్షణం. రాజ్యం యొక్క ఆశయాలను నెరవేర్చే యంత్రాంగమే ప్రభుత్వం. రాజ్యం యొక్క ఆశయాలను రూపొందించి అమలుపరచడంలో నిమగ్నమైన వ్యక్తుల సముదాయాన్ని ప్రభుత్వంగా చెప్పవచ్చు.
✌ప్రభుత్వం శాంతిభద్రతలు కాపాడుతుంది. రాజ్య సరిహద్దులను కాపాడుతుంది. ప్రజలకు న్యాయాన్ని ప్రసాదిస్తుంది. ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతుంది. ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. రాజ్యం శాశ్వతమైనది. ప్రభుత్వం తాత్కాలికమైనది.

4) సార్వభౌమాధికారం:
                
రాజ్య ముఖ్య లక్షణాల్లో సార్వభౌమాధికారం అత్యంత ముఖ్యమైనది. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం ఉన్నా సార్వభౌమాధికారం లేకపోతే రాజ్యం ఏర్పడదు. రాజ్యానికి ఉన్న అత్యున్నత శాసనాధికారాన్ని సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు.
సార్వభౌమాధికారం 2 రకాలు:
 అంతర సార్వభౌమత్వం
✌ బాహ్య సార్వభౌమత్వం

రాజ్యం - సమాజం మధ్య తేడాలు ??

       సమాజంలోని అనేక సంఘాల్లో రాజ్యం ఒకటి. రాజ్యం, సమాజం వేర్వేరు. ఈ రెండూ ఒకటి కావు
 రాజ్యం కంటే సమాజం ముందు పుట్టింది.
 సమాజ పరిణామ క్రమంలో రాజ్యం ఏర్పడి.. క్రమేణా అభివృద్ధి చెందింది.
✌ రాజ్యం కంటే సమాజం విస్తృతమైనది.
 రాజ్యం ఒక రాజకీయ సంఘం.
 ఇది సమాజంలోని అనేక సంఘాల్లో ఒకటి.
 సమాజంలో అనేక సంఘాలు ఉంటాయి.
 రాజ్య సమాజానికి నిర్ణీత భూభాగం అవసరం లేదు. కానీ రాజ్యానికి నిర్ణీత భూభాగం అవసరం.
 సమాజ కార్యకలాపాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
 రాజ్య లక్ష్యాలు శాంతి భద్రతలు, న్యాయం, సంక్షేమానికి పరిమితమవుతాయి.
 సమాజానికి దండనాధికారం లేదు. సాంఘికాచారాలను ఉల్లంఘిస్తే వారిని సమాజం శిక్షించలేదు.
 ప్రజల సహకారం మీద సమాజం నడుస్తుంది. రాజ్యానికి దండనాధికారం ఉంటుంది. రాజ్య శాసనాలను ఉల్లంఘిస్తే అది శిక్షిస్తుంది.

రాజ్యం - ప్రభుత్వం మధ్య తేడాలు ??

 రాజ్యం యజమాని వంటిది. ప్రభుత్వం దాని ప్రతినిధి. రాజ్యం యొక్క నాలుగు ముఖ్య లక్షణాల్లో ప్రభుత్వం ఒకటి.
 రాజ్యానికి సంబంధించిన ఆశయాలను నెరవేర్చే యంత్రాంగమే ప్రభుత్వం.
రాజ్యం విస్తృతమైనది- ప్రభుత్వం పరిమితమైంది. రాజ్యంలో పాలకులు-పాలితులు ఉంటారు. కానీ ప్రభుత్వంలో పాలకులు మాత్రమే ఉంటారు.
 రాజ్యం శాశ్వతమైంది. ప్రభుత్వం తాత్కాలికమైంది. రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. ప్రభుత్వం నిర్దిష్టకాలం తర్వాత మారుతుంది.
 రాజ్యానికి సార్వభౌమాధికారం అనే విశిష్ట లక్షణం ఉంటుంది. ఇది ప్రభుత్వ లక్షణం కాదు. రాజ్యాధికారం సహజమైంది. స్వతఃసిద్ధమైంది. కానీ ప్రభుత్వం చెలాయించే అధికారం దత్తత అధికారం.
✌ అన్ని దేశాల్లో రాజ్య స్వరూపం ఒకే విధంగా ఉంటుంది. అన్ని దేశాల్లో ప్రదేశం, ప్రభుత్వ సార్వభౌమాధికారం అనే నాలుగు లక్షణాలు ఉంటాయి. 
✌ కానీ అన్ని దేశాల్లో ప్రభుత్వ స్వరూపం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం, భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది.  

రాజ్యం - సంస్థల మధ్య తేడాలు ??

రాజ్యంలో సభ్యత్వం నిర్బంధం - ఇతర సంఘాల్లో సభ్యత్వం వ్యక్తి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. నిర్భంద కాదు.
 ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం కలిగి ఉంటాడు. కానీ ఒక వ్యక్తి ఒకే సమయంలో అనేక సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండవచ్చు.
 రాజ్యానికి సరిహద్దులు, నిర్ణీత భూభాగం ఉంటుంది. కానీ సంస్థలకు సరిహద్దులు నిర్ణీత భూభాగం ఉండదు. కొన్ని సందర్భాల్లో కొన్ని క్లబ్‌లు, ఆఫీసులు, రాజ్య సరిహద్దులు అవతల వాటి కార్యకలపాలను నిర్వహిస్తుంటాయి.
✌ రాజ్యం సమాజ సంక్షేమం కోసం ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతుంది. కానీ సంస్థలు పరిమితమైన పనులను అందులోని సభ్యుల స్వప్రయోజనాలకోసం మాత్రమే చేపడతాయి.
 రాజ్యం శాశ్వతమైనది - సంస్థలు తాత్కాలికమైనవి.
 ఒక రాజ్యాన్ని మరో రాజ్యం జయిస్తే లేదా తనను తాను విభజించుకుంటే తప్ప రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
సంఘాలు తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు నెరివేరితే రద్దు చేసుకోవచ్చు. అనేక విధాలుగా అవతరిస్తుంటాయి, రద్దవుతుంటాయి.
 రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది. రాజ్యం, శాసనాలను ఉల్లంఘిస్తే శిక్షిస్తుంది. కాని సంఘాలకు శిక్షించే అధికారం లేదు.
 సంఘ నియమాలను ఉల్లంఘిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం కలిగి ఉంటాయి. సంఘాలు రాజ్యాధికారానికి లోబడి తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తాయి.
✌  సంఘాలపై రాజ్యానికి సంపూర్ణాధికారం ఉంటుంది.

  
రాజ్యం - ప్రభుత్వం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి ?

            రాజ్యం
         ప్రభుత్వం
1) రాజ్యం ప్రజలందరితో కూడుకొని ఉన్నందువల్ల విస్తృతమైంది.
1) ప్రభుత్వం కొద్దిమంది వ్యక్తులతో కూడుకొని ఉన్నందువల్ల పరిమితమైనది.
2) రాజ్యం శాశ్వత సంస్థ.
సార్వభౌమాధికారం ఉన్నంత కాలం రాజ్యం కొనసాగుతుంది.
2) ప్రభుత్వం తాత్కాలికమైనది. ఎన్నికలు, విప్లవాల ద్వారా ప్రభుత్వం మారుతూ వుంటుంది.
3) ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం అనే నాలుగు ప్రధాన లక్షణాలున్న సంపూర్ణ వ్యవస్థే రాజ్యం.
3) ప్రభుత్వం రాజ్యం యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటి మాత్రమే. ఇది రాజ్యంలో అంతర్భాగం.
4) రాజ్యానికి సార్వభౌమాధికారం అనే విశిష్ట లక్షణం ఉంటుంది.
4) ఇది రాజ్యం ద్వారా సంక్రమించిన పరిమితాధికారాలను నిర్వహిస్తుంది.
5) రాజ్యానికి స్వతఃసిద్ధమైన రూపం లేదు.
5) ప్రభుత్వం రాజ్యానికి జీవనాధారం.
6) రాజ్యం ఒక నిర్దిష్ట భూభాగంలో ఏర్పడిన సంస్థ.
6) ప్రభుత్వానికి నిర్దిష్ట భూభాగం అవసరం లేదు. అది ఎక్కడ నుంచి అయిన పనిచేయగలదు.
7) రాజ్యానికి ఏకరూపత ఉంటుంది.
7) ప్రభుత్వానికి బహురూపాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం, నియంతృత్వం, అధ్యక్ష పార్లమెంటరీ వ్యవస్థ అనే వివిధ రూపాల్లో ఉంటుంది.
8) రాజ్యం ఒక నిర్ణీత ప్రదేశంలోని ప్రజలందరికీ చెందిన రాజకీయ సంస్థ.
8) ప్రభుత్వం రాజ్యానికి హృదయం లాంటింది. ఇది కొద్దిమందితో కూడి ఉంటుంది.
9) రాజ్యం యజమానిగా ఉంటూ, ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేస్తుంది.
9) ప్రభుత్వం రాజ్యానికి సేవకురాలిగా ఉంటుంది. ఇది రాజ్యాధికారానికి ప్రతీకగా వ్యవహరిస్తుంది.
10) రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే హక్కు ప్రజలకు లేదు.
10) అసమర్థమైన, నిజాయితీలేని ప్రభుత్వాన్ని ప్రజలు తొలగించవచ్చు. అలాగే ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉంటుంది.


రాజ్యం, సమాజం మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వివరించండి ??

          రాజ్యం
              సమాజం
1) రాజ్యం సహజ వికాసం కోసం ప్రయత్న పూర్వకంగా ఏర్పడిన సంస్థ.
1) సమాజం మానవుడి సహజ ప్రేరణ వల్ల ఏర్పడింది.
2) రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది.
2) సమాజం రాజ్యం కంటే ముందే ఏర్పడింది.
3) రాజ్యంలో సభ్యత్వం తప్పనిసరి.
3) సమాజంలో సభ్యత్వం స్వచ్ఛందమైనది.
4) రాజ్యం శాసనల ఆధారంగా అధికారం చెలాయిస్తుంది.
4) సమాజం సంప్రదాయాలపై ఆధారపడి పనిచేస్తుంది.
5) రాజ్యం ఒక నిర్దిష్ట భూభాగానికి పరిమితం. దానికి భౌగోళిక సరిహద్దులు ఉంటాయి.
5) సమాజానికి భౌగోళిక సరిహద్దులు ఉండవు.
6) రాజ్యానికి దండనాధికారం ఉంటుంది.
6) సమాజానికి దండనాధికారం ఉండదు.
7) రాజ్యం వ్యక్తుల రాజకీయ అవసరాలను తీరుస్తుంది. సమాజంలో శాంతి భద్రతలను రక్షించడంతోపాటు ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తుంది.
7) మానవుడి జీవన సంబంధమైన అన్ని విధులను సమాజం నిర్వహిస్తుంది.
8) రాజ్యం సమాజంగా ఏర్పడిన సంస్థ కాదు.
8) సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ.
9) రాజ్య చట్టాలు విధి విధానాలు కచ్చితంగా, స్పష్టంగా ఉంటాయి.
9) సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
10) రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అంతరించిపోయే అవకాశం ఉంది. వేరొక రాజ్యం దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
10) సమాజం శాశ్వతమైనది. ఇది నిరంతరం కొనసాగుతుంది.


 రాజ్యం - సంఘాల మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వర్ణించండి. ??

       రాజ్యం
            సంఘం
1) రాజ్య సభ్యత్వం నిర్భందమైనది.
1) సంఘాల్లో సభ్యత్వం ఐచ్ఛికమైనది. సంఘాల్లో సభ్యత్వం వ్యక్తి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది.
2) ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం కలిగి ఉంటాడు.
2) ఒక వ్యక్తి ఒకే సమయంలో అనేక సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండవచ్చు.
3) సరిహద్దు, నిర్ణీత భూభాగం ఉంటుంది.
3) సరిహద్దులు, నిర్ణీత భూభాగం ఉంటుంది.
4) రాజ్యం శాశ్వతమైంది.
4) సంఘాలు తాత్కాలికమైనవి.
5) రాజ్యం సమాజ సంక్షేమానికి ఉపయోగపడే పనులను చేపడుతుంది.
5) సంఘాలు అందులో సభ్యత్వం ఉన్నవారి ప్రయోజనాల కోసం పని చేస్తాయి.
6) రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది. రాజ్య శాసనాలను ఉల్లంఘిస్తే శిక్షించడం జరుగుతుంది.
6) సంఘాలకు సార్వభౌమాధికారం, శిక్షించే అధికారం ఉండదు. సంఘ నియమాలను ఉల్లంఘించే వారి సభ్యత్వాన్ని రద్దుచేయవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu