✌ వేశ్య కోసం మసీదు

✌ వార్తల్లో ఎందుకు ??
✌ మసీదు నిర్మాణం ఏమిటి ??
✌ ముబారక్ బేగం ఎవరు ??

వార్తల్లో ఎందుకు ??

✌19 వ శతాబ్దపు ముబారక్ బేగం మసీదు రాండి కి మసీదు లేదా రండి కి మసీదుగోపురాలలో ఒకటి కూలిపోయింది.
✌ చావండి బజారు లోని ఇరుకు సందులలో గల ఈమసీదు ఎరుపు రంగు రాయిలతో నిర్మించారు. 
✌ నేటికి ఈ మసీదు పేరును రాండి కి మసీదు అనే పిలుస్తారు. 
✌ రండి అంటే అర్థం వేశ్య అని వేశ్య కోసం మసీదు అని అర్థం వస్తుంది. ఈ పేరే కాకా ఇంకో పేరు ఉంది దీనికి ముబారక్ బేగం మసీదు అని ఉంది . నిజానికి ఇదే అసలు పేరు.

మసీదు నిర్మాణం ఏమిటి ??

✌ మసీదు ప్రవేశ ద్వారం దగ్గర మాజీద్ ముబారక్ బేగం' అనే పేరు రాసి ఉంటుంది.
✌ మసీదు రెండు అంతస్థులతో నిర్మితమైంది. 
✌ మసీదులో గ్రౌండ్ ఫ్లోర్ లో పూర్తిగా దుకాణాలు ఉన్నాయి. 
మసీదు ప్రవేశం దగ్గరకు వెళ్ళడానికి ఇరుకైన సందు ఉంటుంది. మొదటి అంతస్థులో మసీదు ఉంటుంది. 
అందులో ఒక ప్రార్ధనా మందిరం, మూడు గోపురాలు ఉంటాయి. 
✌ గత ఆదివారం(జులై 19) నాటి వర్షాలకు ఇందులో ఒక గోపురం పడిపోయింది.
✌ మసీదుని ఎర్ర సున్నం రాయితో నిర్మించారు.
ఆదివారం కూలిన గోపురాన్ని మినహాయించి మసీదులో మిగిలిన భాగమంతా దృఢంగానే ఉంది. మసీదు మరెక్కడా చెక్కు చెదరలేదు. 

ముబారక్ బేగం ఎవరు ??

ఆమె అసలు పేరు చంపానా అనేది తేలకపోయినప్పటికీ ఆమె పుణే నుంచి దిల్లీకి చేరాక ఇస్లాం మతంలోకి మారారు.
ఆమె కొత్త పేరు బీబీ మహ్రతున్ ముబారక్ అల్ నిస్స బేగంగా మార్చుకున్నారు.
ఆమె బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ డేవిడ్ ఆక్టర్లని ని వివాహంచేసుకున్నారు. (కొంత మంది చరిత్రకారులు ఆమె డేవిడ్ ప్రియురాలు అని కూడా చెబుతారు)
✌ జనరల్ డేవిడ్ రెండో అక్బర్ షా పాలన కాలంలో దిల్లీలో రెసిడెంట్ అధికారిగా పని చేశారు.
✌డేవిడ్, ముబారక్ ల మధ్య ఉన్న బంధం ఏదైనప్పటికీ ఆయన జీవితంలో ముబారక్ బేగం వహించిన స్థానం చాలా ముఖ్యమైనది. 
✌ ముబారక్ బేగం పట్ల డేవిడ్‌కున్న ప్రేమ గురించి జాఫర్ మాసన్ అనే రచయిత గతంలో ది హిందూ పత్రికలో రాసిన వ్యాసంలో వివరించారు.
డేవిడ్ కు 13 మంది భార్యలుండేవారు. అందులో ముబారక్ బేగం ఒకరు. 
✌ ఆమె డేవిడ్ చిన్న కొడుకుకు తల్లి కూడా. వయసులో చిన్నదైనప్పటికీ వారిద్దరి బంధంలో ఆమెకి ఎక్కువ అధికారం మాత్రం ఉండేది.
✌ అందుకే ముబారక్ బేగం ద్వారా పుట్టిన పిల్లలను ఆయన ముస్లిం మతస్థుల పద్ధతులలోనే పెంచడానికి నిర్ణయించుకున్నారు. 
✌ ఆమె ప్రజలకు ముస్లింల తరహాలోనే బహుమతులు (నిజార్) ఇవ్వడం, ఖిలాత్ (బట్టలు పంచడం) లాంటివి చేసేవారు.

Post a Comment

0 Comments

Close Menu