ప్రపంచాన్ని ఎలా ఆడుకోవాలి ??

✌టిల్టింగ్ అంటే ఏంటి ?
✌ మన తలరాతను మనమే రాసుకోగలమా..??
✌ ది కాన్ఫిడెన్స్ గేమ్: వై వియ్ ఫాల్ ఫర్ ఇట్...ఎవ్రీ టైమ్
✌ జీవితాన్ని మనం ఎంత మెరుగ్గా ఎదుర్కోగలరు. చాంపియన్ గాంబ్లర్‌ కావాలనుకున్న ఒక  మహిళ ప్రయత్నం గురించి తెలుసుకుంటే మనకు కొన్ని కిటుకులు లభించవచ్చు.
✌ మన తలరాతను మనమే రాసుకోగలమా.. అవకాశాలను మచ్చిక చేసుకోవడం సాధ్యమేనా.. ఈ ప్రశ్న తత్వవేత్తలను ఎన్నో శతాబ్దాలుగా వేధిస్తోంది. 
✌ 2018 జనవరిలో సైకాలజిస్ట్, రచయిత మారియా కోవా ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేసారు.
✌ అంతకు ఏడాదికి ముందే ఆమె ఒక పెద్ద జూదం ఆడారు. ఒక ప్రొఫెషనల్ పోకర్(పేకాట) ప్లేయర్‌గా శిక్షణ తీసుకోడానికి ఆమె న్యూయార్కులో మంచి ఉద్యోగాన్ని వదులుకున్నారు. 
మన జీవితాల్లో అవకాశాలు పోషించే పాత్ర, పేకాట నేర్చుకోవడంలో ఎదురయ్యే అనుభవాలతో ఒక పుస్తకం రాయాలనేదే ఆమె లక్ష్యం. ఆ ప్రయత్నంలో ప్రముఖ పోకర్ ఆటగాడు ఎరిక్ సీడెల్ ఆమెకు శిక్షణ ఇచ్చారు.
పురాతన, అత్యంత ప్రతిష్టాత్మక లైవ్ పోకర్ టోర్నీల్లో ఒకటైన ‘పోకర్ స్టార్స్ కరిబియన్ అడ్వెంచర్ నేషనల్ చాంపియన్ షిప్‌’లో పోటీపడ్డారు. ఆమె గాంబ్లింగ్ చివరికి ఫలించింది
ఆ ట్రోఫీ గెలుచుకోడానికి కొన్నికోవా మూడు రోజులపాటు 290 మంది ప్రత్యర్థులను ఓడించారు. 
✌ ఆ ట్రోఫీతోపాటూ 84,600 డాలర్ల (సుమారు రూ.64 లక్షల) ప్రైజ్‌మనీ, ఫ్యూచర్ టోర్నమెంట్లలో ఆడడానికి 30 (సుమారు రూ.22 లక్షల) వేల డాలర్ల ప్యాకేజీని కూడా ఆమె సొంతం చేసుకున్నారని అంతర్జాతీయ మీడియా తెలియజేసింది.
✌ ఆమె తన అనుభవాల గురించి రాసిన ‘ది కాన్ఫిడెన్స్ గేమ్: వై వియ్ ఫాల్ ఫర్ ఇట్...ఎవ్రీ టైమ్’ పుస్తకం గురించి ‘ది బిగ్గెస్ట్ బ్లఫ్’ ప్రచురించింది. 
✌ ఇందులో నిజజీవిత పాత్రలే ఉంటాయి. దాన్నుంచి తను నేర్చుకున్న పాఠాలు కాసినోను మించి, చాలా విలువైనవని కొన్నికోవా భావిస్తున్నారు. “ఈ పుస్తకం పేకాట ఎలా ఆడాలనే దాని గురించి కాదు, ఆమె ఆ పుస్తకంలో చెప్పినట్లు... ప్రపంచాన్ని ఎలా ఆడించాలో చెబుతుంది” అని అందులో రాశారు.

✍ అదృష్టమా, నైపుణ్యమా?

✌ “పేకాట ఆడనివారికి దానిపై కొన్ని దురభిప్రాయాలు ఉంటాయి. కానీ అందులో బలమైన ఉదాహరణలు ఉన్నాయని మారియా కోవా చెప్పారు” ఈ విషయం గొప్ప ఆటగాడు, గేమ్ థియరీ కనుగొన్న వారిలో ఒకరు జాన్ వాన్ నూమన్ అన్నారు.
✌ అంతే కాకుండా వివిధ ప్రయోజనాలను బట్టి రాజకీయ బేరసారాలు ఎలా సాగుతాయో, ధరలను బట్టి జనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడానికి ఈ గేమ్ థియరీలో గణిత నమూనాలను ఉపయోగిస్తారు. 
✌ పేకాట బాగా ఆడగలిగినవారు, క్లిష్ట సమయాల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలరని వాన్ నూమన్ భావించారు.
✌ “పేకాటలో ఉన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన జీవితంలోలాగే ఈ ఆటలో కూడా మనం తెలుసుకోవాలనే సమాచారం అసంపూర్తిగా ఉంటుంది. ఇది చదరంగంలా కాదు. పేకాటలో మనం తెలుసుకోవాలి అనుకునేవి, మనకు తెలీకుండా దాక్కుని ఉంటాయి. దాంతో మన నిర్ణయాలన్నీ ఎక్కడో లోపల అనిశ్చితి లోంచి వస్తాయి. మనకు అవన్నీ తెలీదు. మొత్తం పేకల కట్టలో ఏమున్నాయో మనం చూడలేం. అయినా, మనందరం ఒకేలా ఆడుతుంటాం” అని మారియా కోవా తన పుస్తకంలో తెలియజేసారు.
“చాలా టోర్నీల్లో మనం ఆడే మొత్తం పద్ధతిని మన నైపుణ్యమే ఊహిస్తుందనే విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఏ సమయంలో అయినా మన ఆటతీరు ఆ అవకాశం మీద దెబ్బకొట్టవచ్చు”.
✌ సాధారణంగా మనుషుల్లో ఇలాంటి ఆలోచనలను తట్టుకోగలిగేంత సమర్థత ఉండదు. 
✌ చాలామంది మనం అదుపు చేయగలం అనే భ్రమలో పడి తమ నైపుణ్యాన్ని అతిగా అంచనా వేస్తారు. 
కృత్రిమ స్టాక్ మార్కెట్‌ను ఉపయోగించిన ఆమె “చాలామంది అదృష్టం కంటే, తమ నైపుణ్యంపై అతిగా అంచనాలు పెట్టుకుంటారు” అని గుర్తించారు. డేటాలో ఉన్న వాస్తవ పాటర్న్ తెలుసుకోకుండా తమ నైపుణ్యాన్ని గుడ్డిగా నమ్మి, దానిపై అతిగా ఆధారపడ్డం వల్ల వారి నిర్ణయాలు పెద్దగా సౌకర్యవంతంగా ఉండవు అని మారియా కోవా  తెలిపారు.
✌ ఆ ఉచ్చులో పడకుండా, బహుశా.. ఏం జరగచ్చు అని మనం ఆలోచించడం మొదలెట్టాలి. 
✌ పేకాటలో మనకంటే మెరుగ్గా లేదా అధ్వాన్నంగా ఆడేవాళ్లు కూడా ఉంటారని అంచనా వేయాలి. దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ వ్యత్యాసాల వల్ల, మన నిర్ణయానికి ఫలితం ఏదైనా దానిని అభినందించాలి. అంటే మనం గొప్ప విజయం సాధించినా, మనలో అంతర్లీనంగా లోపాలు ఉండచ్చు. 
మనం ఓడిపోయినా, మన చేతిలో ఉన్న సమాచారం ఆధారంగానే మనం ఆ లాజికల్ నిర్ణయం తీసుకుని ఉండడచ్చు.
✌ ఏం జరగవచ్చు అని ప్రతిసారీ బాగా ఆలోచించేవారు, ఆ నిర్ణయంలో నాణ్యతను విశ్లేషించి, వచ్చే ఫలితాలలో తన అదృష్టం పాత్రను గుర్తించగలరు. దానిపై తక్కువ పట్టు ఉన్నవారు విజయాలు, వైఫల్యాలను చాలా లోతుగా విశ్లేషిస్తుంటారు. మన దీర్ఘకాలిక పనితీరును మెరుగుపరుచుకోవాలంటే, ఫలితానికి బదులు మన ఆలోచనల్లో నాణ్యతను పెంచుకోవడం ముఖ్యం.
✌ అనిశ్చితి నిండిన ప్రపంచంలో, చిన్న అవకాశం దొరికినా, 1 లేదా 2 శాతం ప్రయోజనాన్ని పొందడం ఎలా అనేది గుర్తించడం కూడా మారియా కోవా  నేర్చుకున్నారు. 
✌ ఉదాహరణకు దీర్ఘకాలంలో అది చాలా తేడాను తీసుకొస్తుంది. “పేకాటలో మనం అన్నిటినీ ఎప్పటికీ తెలుసుకోలేం, ఇంకొకరి చేతిలో ఏ కార్డులు ఉన్నాయో మనం ఎప్పటికీ తెలుసుకోలేం, తర్వాత ఏ కార్డు రాబోతోందో కూడా మనకు తెలీదు అనే విషయాన్ని మనం తెలుసుకునేలా చేస్తుంది ఈ ఆట. అయినప్పటికీ మనం ఆట ఆడుతూనే ఉండాలి, నిర్ణయం తీసుకుంటూనే ఉండాలి” అంటారు కొన్నికోవా. మనం మనలోని అత్యుత్తమ సామర్థ్యాన్ని గుర్తించాలి. అనిశ్చితి ఉంటుందని తెలిసీ, అత్యుత్తమ నిర్ణయం ఏదో తెలుసుకోగలగాలి అని ఆమె చెప్పుకొచ్చారు.

✌ టిల్టింగ్ అంటే ఏంటి ?

✌ ఈ శిక్షణలో టిల్టింగ్‌ ఎలా ఎదుర్కోవాలో కూడా కొన్నికోవా నేర్చుకోవాల్సి వచ్చింది. 
టిల్టింగ్ అంటే మన భావోద్వేగాలను మనం తీసుకునే నిర్ణయంలో ఇమిడిపోయేలా చేయడం అనే భావన. 
✌ ఉదాహరణకు వరసగా దురదృష్టం ఎదురవడం వల్ల కలిగే నిరాశ కావచ్చు. అది మనకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి, మరింత ఆవేశంగా జూదం ఆడేలా చేయచ్చు. లేదంటే ఒక విజయం నుంచి వచ్చే అతి ఆత్మవిశ్వాసం కావచ్చు. “మన మెదడు గాయపడడం, లేదా మెదడులోని నరాలు దెబ్బతింటే తప్ప దాన్నుంచి పూర్తిగా తప్పించుకునే దారే లేదు” అని మారియా కోవా హెచ్చరించారు. కానీ దాని ప్రభావాలను సమర్థంగా ఎదుర్కోడానికి కొన్ని దారులు ఉన్నాయన్నారు.
✌ “వాటిలో భావోద్వేగాలపై మంచి అవగాహన కలిగి ఉండడం. నాకెలా అనిపిస్తోంది, నేను దీనికి ఎలా స్పందిస్తున్నాను అని మనల్ని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండడం లాంటివి ఉంటాయి” అని మారియా కోవా చెప్పారు. 
✌ ఆ అనుభూతిని మీరు గుర్తించగానే, అవి మీ నిర్ణయం మీద ఏదైనా ప్రభావం చూపిస్తాయా, మీ తుది నిర్ణయంలో దాన్ని లెక్కించవచ్చా అని విశ్లేషించడానికి ప్రయత్నించాలి. 
✌ ఇందులో మన భావోద్వేగాలు మన ఆర్థిక నిర్ణయాలను మెరుగుపరుస్తాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు తమ భావాలను చాలా కచ్చితత్వంతో వివరించగలిగిన వారు కృత్రిమ స్టాక్ మార్కెట్లో మెరుగైన ట్రేడింగ్ చేయగలరు.
✌ “పేకాటలో చిన్న భావ వ్యక్తీకరణలు ఒక వ్యక్తి నైపుణ్యం గురించి బయటపెడతాయి.” ఇలాంటి విశ్లేషణలు చెప్పకుండా పేకాటపై ఏ పుస్తకమూ పూర్తి కాదు. మారియా కోవా తన అధ్యయనంలో ఒక విషయం బయటపెట్టారు. 
✌ అబద్ధాలను గుర్తించేటపుడు, ముఖ కవళికలు దాదాపు పనికిరావని తన విస్తృత పరిశోధనలో తేలిందని చెప్పారు. 
✌ పేకాట ఆడేవారిలో ఎక్కువమంది అవకాశాన్ని మించి మెరుగైన ప్రదర్శన ఇవ్వలేరన్నారు. “అంటే, చాలామంది తమకు ఆట బాగా తెలిసినట్టు ముఖం పెడతారు. గెలవడానికి ఆధారం ఏదైనా దొరుకుతుందని, మనం వారి ముఖ కవళికలను చదవడానికి ప్రయత్నించడం వృధా” అన్నారు.
✌ “మన ముందున్నవారి కళ్లలోకి చూస్తే వారి ఆత్మ మనకు కనిపిస్తుందని, అలా చూసి మనం అన్నీ తెలుసుకోవచ్చు అని చెబుతారు. అది అపోహ మాత్రమే. మనకు అక్కడ అవన్నీ కనిపిస్తాయి. కానీ కనిపించేదంతా నిజం కాదు” అని అన్నారు. దానికి బదులు వారి చేతులు గమనించాలని అధ్యయనాలు చెబుతున్నాయి. చేతులు, వేళ్ల కదలికలో కనిపించే చిన్న తేడాలు వారిలో కంగారు, విశ్వాసం గురించి మనకు చెబుతాయి. “జనం పేకముక్కలు ఎలా పట్టుకుంటున్నారు. చిప్స్ ఎలా హాండిల్ చేస్తున్నారు అనేదాన్ని బట్టి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు” అంటారు మారియా కోవా గారు.
✌ సీడెల్ శిక్షణలో మారియా కోవా అధ్యయనం స్పష్టమైన ఫలితాలను ఇచ్చింది. ఆమె PCAనేషనల్ చాంపియన్‌షిప్‌ గెలవడంతోపాటూ, మకావులో జరిగిన ఆసియా పసిఫిక్ పోకర్ టూర్ టోర్నమెంటులో సెకండ్ వచ్చారు. మరో 60 వేల డాలర్లు (సుమారు రూ.44 లక్షలు) కూడా గెలుచుకుని యూరప్‌, అమెరికాలో వరుస విజయాలు సాధించారు. 2018లో గ్లోబల్ పోకర్ ఇండెక్స్ ఫైనలిస్టుగా నిలిచిన ఆమె ‘బ్రేకవుట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ టైటిల్ దక్కించుకున్నారు.

✍ ప్రపంచాన్ని ఎలా ఆడుకోవాలో మనకు నేర్పించిన కొన్నికోవా మిషన్ ఎలా ఉంది ? 

✌ చాలా వృత్తుల్లో ఆమె చెప్పిన అంశాలు కీలకం అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. 
ముఖ్యంగా ఇంతకు ముందు అనుకున్నట్లుగా వరుసగా వచ్చే అదృష్టం(దురదృష్టం) బ్యాంకర్లు, జడ్జిలు, అథ్లెట్ల నిర్ణయాలను గాడి తప్పేలా చేయవచ్చు. 
✌ ఏది జరిగినా సున్నితంగా ఉండడం వల్ల, యాదృచ్చికంగా జరిగే చాలా ఘటనలకు మరీ ఎక్కువ కంగారుపడకుండా, ఏదీ లేకపోయినా, అక్కడ ఏదేదో ఊహించడం లాంటివి చేయకుండా మనల్ని ఆపుతుంది. బహుశా ఇది మనకు తెలిసిన సమాచారాన్ని, జరిగే ఘటనలను అర్థం చేసుకోవడం, ప్రజలు తమ ఆరోగ్యంలో తేడాలను అంచనా వేయడాన్ని మెరుగుపరుస్తుంది. ఉదాహరణకు గుండెపోటు లక్షణాలు కనిపించినపుడు ఎవరినైనా, సాయం కోరడం, ఎన్నికల సమయంలో తమ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం లాంటివి అనుకోవచ్చు.

✍ గమనిక ఇది బీబీసీ లో ప్రచురితం ఐన ఒక కధనం 

Post a Comment

0 Comments

Close Menu