పర్యావరణం పరిచయం

👉 ఎకాలజీ అనే గ్రీకు పదానికి అర్థం ఇంటి  అధ్యయనం (Study of home) 
✍  ఈ పదం మొదట గా  వాడిన వ్యక్తి  రీటర్   
  Oikos అనగా ఇల్లు, లాగస్  అనగా అధ్యయనం అని అర్థం 
ప్రకృతి నిర్మాణం, విధుల అధ్యయనమే ఆవరణశాస్త్రం - యూజిన్ ఓడమ్        
జీవులకు,పరిసరాలకు మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రం జీవావరణ శాస్త్రం - ఎర్నెస్ట్ హెగెల్         
ఆవరణ శాస్త్ర పితామహుడు (Father of Ecology) - యూజిన్ ఓడమ్   
భారత ఆవరణ శాస్త్ర పితామహుడు (Father of Indian Ecology) రాందేవ్ మిశ్రా
             
✍ జీవావరణ శాస్త్రం ప్రధానంగా రెండు శాఖలు కలవు.
ఆటికాలజీ లేదా జాతి/జనాభా ఆవరణ శాస్త్రం : ఒకే జాతికి చెందిన జీవులకు, వాటి పరసరాలకు మధ్య గల సంబంధంను ఇది తెలియజేస్తుంది ఇంకా  జాతుల జనాభాలోని గమనశీలతను,అవి వాటి పరిసరాలతో జరిపే అంతర చర్యలు తెలియజేస్తుంది
సైనోకాలజీ/సమాజం ఆవరణ శాస్త్రం: ఇది జీవావరణ సమాజం నిర్మాణం, అభివృద్ధి, విస్తరణను అధ్యయనం చేసే శాస్త్రం, ఇది జీవుల క్రియాశీల పాత్రను, వాటి సమాజ గమనశీలతను పరిగణనలోకి తీసుకొనును.
      జీవావరణ శాస్త్రం ప్రధానంగా నాలుగు జీవ వ్యవస్థీకరణ అంశాలను వివరించును. అవి జీవులు, జనాభాలు, సమాజాలు, జీవ మండలాలు.
ఆవరణశాస్త్రం- పరిభాష (Terminology of Ecology)
1. పరిసరం లేదా పర్యావరణం (Environment)
పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ప్రకారం జీవుల పెరుగుదలను ప్రత్యుత్పత్తిని ప్రభావితం చేసే బాహ్యకారకాలను "పర్యావరణం" అంటారు.
2.కారణం (Factor) - జీవులపై ప్రభావం చూపే ఏదైనా పదార్థం, స్థితి లేదా బాహ్య బలమునే  "కారకం" అంటారు.
3. నివాసం (Habitat) - ఒక జాతి నివసించే విశిష్ట ప్రాంతం
ఉదా Arboreal - చెట్లపై నివసించేవి,Volant ఎగిరేవి,Fossorial- బొరియలలో  నివసించేవి ,Cursorial పరుగెత్తేవి ,Parasitic పరాన్న జీవులు
4. వెజిటేషన్ - ఒక ప్రాంతంలో నిరంతరంగా పెరిగే మొక్కల సమూహం
౫.ఫ్లోరా - ఒక ప్రాంతంలో నిరంతరంగా పెరుగుతున్న మొత్తం మొక్కల జాతుల సంఖ్యాపరమైన, సమూహం
Ex: The Flora of British India
6. ఫానా - ఒక ప్రాంతం, దానిలో పెరుగుతున్న మొత్తం జంతుజాతుల సమూహం
7. జాతి (Species) - ఒకే రకమైన జన్యు పదార్థాన్ని కలిగి, తమలో తాము అంతరప్రజననం జరుపుకొనే జీవుల సమూహం ఉదా మానవజాతి, పులుల జాతి మొ|||
8. జనాభా (Population) - ఒక నిర్దిష్టమైన జీవావరణ వ్యవస్థలో ఉండే ఒకే జాతి జీవుల సం
9. సముదాయం (Community) ఒక నిర్దిష్టమైన జీవావరణ వ్యవస్థలో ఉండే జనాభా సమూహం
10 బయోమ్ - ఒకేరకమైన పరిస్థితులలో ఒక ప్రాంతంలో నివసించే అనేక జీవసముదాయాలు (మొక్కలు ,జంతువులు) కలిసి ఏర్పడే సంక్లిష్ట సముదాయం వీటిలో కొన్ని చరమదశకు చేరుకోగా, కొన్ని క్రమకీయ దశలో ఉంటాయి
ఉదా॥టండ్రా బయోమ్
11.జీవావరణం (Biosphere) - కొన్ని బయోమ్ ల కలయిక వల్ల ఏర్పడే అతిపెద్ద భూగోళం .
12ఆవరణ వ్యవస్థ (Ecosystem) - ఒక ప్రమాణ ఆవాసంలో జీవసముదాయాలు, పరిసరాల మధ్య నిర్మాణాత్మకమైన చర్య, ప్రతిచర్యల మూలంగా జరిగే సజీవ, నిర్జీవ పదార్థాల వినిమయమే ఆవరణ వ్యవస్థ" అని A.G. టాన్స్ లే  నిర్వచించండి
ఈ పదం మొదటగా వాడినది కూడా  'A.G. టాన్స్ లే".
13జీవ ద్రవ్యరాశి (Biomass) -ఒక ప్రమాణ ఆవాసంలో గల జీవరాశిలోని పొడి జీవపదార్ధ  బరువునే  జీవ ద్రవ్యరాశి అంటారు. ఒక ప్రత్యేక సమయంలో కొలిచిన జీవ ద్రవ్యరాశి "నిలకడ పంట(Standing Crop) అంటారు.
14ఆవరణ రూపాలు (Ecotypes) - ఒకే జాతి లో జన్యుపరమైన, జన్యు వైవిధ్యతగల రకాలను "ఏకో టైప్స్ " అంటారు. ఈ వైవిద్యత కు ప్రధాన కారణం ప్రకృతిలో వచ్చే మార్పులే
ఆవరణ తెగ (Ecades )ఒకే జాతిలో బాహ్యస్వరూప వైవిధ్యతగల రకాలను ఎకేడ్స్" అంటారు.ఇవి  పరిసరాలలో వచ్చే మార్పులకు అనుగుణంగా లక్షణాలను కూడా మార్చుకొని జీవన విధా కొనసాగిస్తాయి. ఈ మార్పులకు జన్యుపదార్థం కారణం కాదు కావున ఇవి తాత్కాలికమే
16ఎకోటోన్  - సమీపంలో ఉన్న రెండు 'బయోమ్'లను వేరుచేస్తూ ఉండే ఒక విధమైన మధ్యంతర ప్రాంతమును 'ఎకోటోన్' అంటారు. ఉదా: చితడి/బురద ,మడ అడవులు ,ఎటి గట్టు
17. బయోటా  (Blota) ఒక నిర్దిష్ట ప్రదేశంలోని జంతు  వృక్ష జాతుల మొత్తమే బయోటా అని అంటారు
౧౮.బయోస్టాసీ (Blostasy) - ఈ పదమును వాడినది - ఎఫర్ట్,
బయోస్టాసీ అనగా సాధారణ వృక్షసంపద గల కాలం.
19 రెక్సీస్టాసీ (Rhexlatasy) -ఎలాంటి వృక్షసంపద లేని ప్రదేశం (denudation)
20. బయో మాగ్నిఫికేషన్/బయలాజికల్ అక్యుములేషన్
హానికర, విషపదార్థాలు ఒక పోషకస్థాయి నుండి (సాధారణంగా తక్కువ), మరొక పోషక స్థాయి (సాధారణంగా ఉన్నత స్థాయి) సంచయనం చెందడమే బయోమాగ్నిఫికేషన్ లేదా బయో యామ్ ప్లిఫికేషన్
ఉదాహరణగా  తల్లిపాలలో DDT అవశేషాలు కనబడడం
నోట్: 
1.పై విషయాన్ని మొదటిసారిగా గ్రంథరూపంలో నిరసించిన వ్యక్తి - రాచెల్ కార్బన్ ఈ గ్రంధం పేరు  - "Silent Spring."
2 మనదేశంలో రాబందుల (Vultures) సంఖ్య తగ్గడానికి కూడా కారణం ఈ ప్రక్రియనే
21. జీవావరణ నిచ్ : ఒక జాతి యొక్క జీవన విధానాన్ని సూచించేది.

Post a Comment

0 Comments

Close Menu