బోత్సువానా ఒకావాంగో డెల్టా ఏనుగులు ??

✌ వార్తల్లో ఎందుకు ?  
✌ ముఖ్య వాస్తవాలు
✌ ఆఫ్రికన్ ఏనుగులు ఎలా ఉంటాయి
✍ వీటికి కలుగుతున్న ప్రమాదాలు
✍బోత్సువానా  ప్రాంతంలోని  ఒకావాంగో డెల్టాలో వందలాది ఏనుగులు రహస్యంగా చనిపోయాయి. కారణం ఇంకా తెలియరాలేదు.

✌ ముఖ్య వాస్తవాలు:

✍ బోత్సువానా దక్షిణాఫ్రికాలో ఉన్న భూభాగం ఒక దేశం.
✍ బోత్సువానా స్థలాకృతిలో చదునుగా ఉంది, దాని భూభాగంలో 70 శాతం వరకు కలహరి ఎడారి ప్రాంతం ఉంటుంది.
✍ బోత్సువానా దీనిని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ బోత్సువానా అంటారు. దక్షిణఫ్రికా స్థానికులు మాట్లడే భాషలలో ఒకటైన త్‌స్వానా భాషలో దీనిని లెఫత్‌షి లా బోత్సువానా అంటారు.
✍వాత్సవంగా ఇది బ్రిటిష్ ప్రొటెక్రేట్ అఫ్ బెచ్యుయానాలాండ్గా గుర్తించబడింది. 1966 సెప్టెంబరు 30న ఈ దేశానికి కామన్‌వెల్త్ దేశాల నుండి స్వతంత్రం లభించిన తరువాత ఈ దేశానికి బోత్సువానా అనే నామంతరం చేసుకున్నారు.
✍ బోత్సువానా దక్షిణ సరిహద్దు, ఆగ్నేయ సరిహద్దులలో దక్షిణాఫ్రికా ఉంది. పడమటి, ఉత్తర సరిహద్దులలో నమీబియా ఉంటుంది. ఉత్తర సరిహద్దులలో జింబాబ్వే ఉంటుంది. 
✍ బోత్సువానా తూర్పు భాగములో స్వల్పముగా కొన్ని వందల మీటర్ల సరిహద్దులలో జాంబియా ఉంటుంది. బోత్సువానా మధ్యంతర పరిమాణము కలిగిన భూపరివేష్టిత (లాండ్ లాక్) దేశము.
✍బోత్సువానా ప్రస్తుతం ఆఫ్రికన్ దేశాలలో అన్నిటికన్నా ఎక్కువ ఏనుగులకు నిలయంగా ఈ ప్రాంతం కలిగి ఉంది.
✍ ఒకావాంగో డెల్టా ఉత్తర బోట్స్వానాలోని విస్తారమైన లోతట్టు నది డెల్టా. ఇది 2014 లో ప్రపంచ వారసత్వ జాబితాలో నమోదు చేయబడింది.
✍ బోత్సువానా జనసంఖ్య 2,000,000. స్వతంత్రం రాక పూర్వము బోత్సువానా ఆఫ్రికా దేశాలలో అతి బీద దేశం. బోత్సువానా జిడిపి అప్పుడు 0.75 అమెరికా డాలర్లు మాత్రమే ఉండేది. 
✍స్వతంత్రం వచ్చిన తరువాత బోత్సువానా స్వశక్తితో శీఘ్రంగా అభివృద్ధి సాధించిన కారణంగా త్వరితగతిన అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
1930 సంవత్సర సమయంలో ,10 మిలియన్ల అడవి ఏనుగులు ఆఫ్రికన్ ఖండంలోని భారీ ప్రదేశాలలో తిరుగుతున్నాయి. కానీ దశాబ్దాల వేట మరియు సంఘర్షణ ఆఫ్రికన్ ఏనుగుల జనాభాను క్షీణించింది.
✍ 2016 లో, ఆఫ్రికా యొక్క ఏనుగుల జనాభా ఒక దశాబ్దం వ్యవధిలో 111,000 ఏనుగులు తగ్గిందని నిపుణులు అంచనా వేశారు. 
✍ ఇప్పుడు  ఆఫ్రికాలో కేవలం 415,000 ఏనుగులు ఉన్నాయి. తూర్పు ఆఫ్రికాలో గణనీయమైన క్షీణతతో, ఏనుగుల వేట క్రిందికి ధోరణిలో ఉన్నప్పటికీ, వేటాడటం జాతులను అంతరించిపోయే ప్రమాదకరమైన పరిస్థితులలోకి  తీసుకువెళుతోంది.

✌ ఆఫ్రికన్ ఏనుగులు ఎలా ఉంటాయి 

ఇవి రెండు ఉప జాతులు ఉన్నాయి :
✍ సవన్నా లేదా బుష్ ఏనుగులు మరియు అటవీ ఏనుగులు లు ఉంటాయి. అటవీ ఏనుగులు  సవన్నా వర్గంలో  పోల్చితే తక్కువగా ఉంటాయి.

✌ నివాస ప్రాంతాలు 

✌ దట్టమైన అడవి
✌ ఓపెన్ మరియు క్లోజ్డ్ సవన్నా గడ్డి భూములు
✌ శుష్క ఎడారి

✍ వీటికి కలుగుతున్న ప్రమాదాలు.

✌ దంతాల కోసం వేట
✌ మానవ జనాభా విస్తరణ మరియు భూ మార్పిడి కారణంగా నివాస నష్టం మరియు విచ్ఛిన్నం
మానవ-ఏనుగుల సంఘర్షణ

✍ కొన్ని  సంవత్సరాల క్రితం, ఆఫ్రికాలో పరిశోధకులు ఒక మముత్ పనిని (mammoth task)చేపట్టారు.  
✍ ఖండంలోని ఏనుగులను లెక్కించడం.గ్రేట్ ఎలిఫెంట్ సెన్సస్ 18 దేశాలు చెందిన 295,000 మైళ్ళు విస్తరించి ఉంది, ఇది ఆఫ్రికన్ ఏనుగుల యొక్క అతిపెద్ద, సమగ్ర సర్వే గా చెప్పవచ్చు .
2016 లో విడుదలైన ఫలితాలు ఇలా  ఉన్నాయి.కేవలం 352,271 సవన్నా ఏనుగులు ఉన్నాయి  వాటి ప్రస్తుత పరిధిలో కనుగొనబడ్డాయి-ఏడు సంవత్సరాలలో 30% పడిపోయింది అని లెక్క తేలింది.

Post a Comment

0 Comments

Close Menu