✌ వార్తల్లో ఎందుకు?
✌ హయా సోఫియా చరిత్ర ఏమిటి ?
✌ ఇది ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశమయింది ?
✌ కాన్స్టాంటినోపుల్ ఇప్పటికీ ఇస్తాంబుల్ లోనే ఉంది
✌ఆధునిక టర్కీ వ్యవస్థాపక రాజనీతిజ్ఞుడు భవనం మ్యూజియంగా మార్చడం చట్టవిరుద్ధమని ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తరువాత టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇస్తాంబుల్ యొక్క హగియా సోఫియాను ముస్లిం ఆరాధనకు తెరిచినట్లు ప్రకటించారు.
హయా సోఫియా చరిత్ర ఏమిటి ?
✌ ఇస్తాంబుల్‌లోని ఫతిః జిల్లాలో బోస్పోరస్ పశ్చిమ భాగాన హయా సోఫియా నెలకొని ఉంది.
హయా సోఫియాను ఆరవ శతాబ్దంలో బైజాంటిన్ చక్రవర్తి జస్టీనియన్ వన్ ఆదేశాలమేరకు నిర్మించారు. తరువాత దాదాపు 1,000 సంవత్సరాలు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రైస్తవ మత కేంద్రంగా కొనసాగింది.
✌ అప్పట్లో ఈ నగరాన్ని కాన్స్టాంటినోపుల్ అని పిలిచేవారు.
✌ అప్పటి బైజాంటిన్ సామ్రాజ్యానికి ఇదే రాజధానిగా ఉండేది.
✌ 1453 లో ఒట్టోమన్ చక్రవర్తి ఈ నగరాన్ని ఆక్రమించుకున్నప్పుడు దీన్ని మసీదుగా మార్చేశారు.
✌ 1930లలో ఈ మసీదు మ్యూజియంగా మారింది.
ఇది ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశమయింది ?
✌1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడం టర్కీ దేశస్థులకు మాత్రమే కాకుండా ప్రపంచంలో మరెన్నో వర్గాల వారికి రాజకీయ, ఆధ్యాత్మిక, మత పరమైన అంశంగా మారింది.
✌1934లో చేసిన చట్టప్రకారం ఈ భవనంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు జరగడానికి వీలు లేదు.
✌అయితే, దీన్ని తిరిగి మసీదుగా మార్చాలని, మత ప్రార్థనలకు అనుమతివ్వాలని ముస్లింలు, ఇస్లాంవాదులు నిరసనలు నిర్వహించారు.
✌ ఈ ప్రతిపాదనలకు టర్కీ అధ్యక్షుడి మద్దతు కూడా తోడయింది.
✌ గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో మసీదుని మ్యూజియంగా మార్చడం చాలా పెద్ద తప్పని, తిరిగి దాన్ని మసీదుగా మార్చే అవకాశాలని పరిశీలించాలని అన్నారు.
✌ఈస్ట్రన్ ఆర్థడాక్స్ చర్చి ప్రధాన కార్యాలయం, ఎక్యుమెనికల్ పాట్రియార్క్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ఇప్పటికీ ఇస్తాంబుల్ లోనే ఉంది.
✌ హయా సోఫియాను మసీదుగా మారిస్తే ఇక్కడి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటాయని, దేశం రెండు ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని ఆర్చ్‌బిషప్ పాట్రియార్క్ బర్థోలమ్యూ గతంలో హెచ్చరించారు.
✌ హయా సోఫియాను మసీదుగా మారిస్తే భిన్న మతాల, సంస్కృతుల మధ్య సామరస్యం పెంపొందించగలిగే సామర్థ్యం తగ్గిపోతుందని, మానవాళికి ఇది మంచిది కాదని యూఎస్ సెక్రటరీ ఆఫ స్టేట్ మైక్ పాంపేయో హెచ్చరించారు.
✌ యుఎస్ రాయబారి శామ్ బ్రౌన్బ్యాక్ గత వారం లార్జ్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ లో మాట్లాడుతూ హయా సోఫియాను యథాతథంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.
✌"హయా సోఫియా ఎంతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ యునెస్కో వారసత్వ సంపద భిన్న విశ్వాసాల ప్రజలకు అందుబాటులో ఉంటూ యథాతథంగా మ్యూజియంగానే కొనసాగించాలని టర్కీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను" అని ట్వీట్ చేసారు.
✌కానీ, ఈ కట్టడం టర్కీ భూభాగంలో ఉంది కాబట్టి దీనిపై తీసుకునే నిర్ణయంలో ఏథెన్స్‌కు ఎలాంటి సంబంధం లేదని టర్కీ విదేశాంగశాఖ మంత్రి మెవ్లట్ కవుసోగ్లు అన్నారు.
✌"మా దేశం, సంపదపై నిర్ణయాధికారం మాకు మాత్రమే ఉంది" అని టర్కిష్ బ్రాడ్‌కాస్ట్ 24 టీవీతో ఆయన అన్నారు.
హగియా సోఫియా ముఖ్యమైన అంశాలు (Hagia Sophia) :
✌ ఇది మొట్టమొదట క్రైస్తవ బైజాంటైన్ సామ్రాజ్యంలో కేథడ్రల్‌గా నిర్మించబడింది, కాని 1453 లో ఒట్టోమన్ కాన్స్టాంటినోపుల్‌ను ఆక్రమించిన తరువాత మసీదుగా మార్చబడింది.
✌ ఇది ఇస్తాంబుల్‌లో ఉన్న చారిత్రాత్మక ప్రార్థనా మందిరం.
✌ దీనిని క్రైస్తవులు మరియు ముస్లింలు ఒకే విధంగా గౌరవిస్తారు.
✌ 1935 లో, ముస్తఫా కెమాల్ అటతుర్క్ ఆధ్వర్యంలో ఆధునిక లౌకిక టర్కిష్ రాష్ట్రం యొక్క ప్రారంభ రోజుల్లో, ఇది మ్యూజియంగా ఉండేది.
✌ ఇది యునెస్సో ప్రపంచ వారసత్వ ప్రదేశం.
0 Comments