✌ ఇంతకీ అసలు కొత్త పాలసీలో ఏముంది? ✌ పిల్లల తలరాత మార్చే చదువుల తీరును కేంద్రం ఎలా మార్చాలనుకుంటోంది?
✌ 2015 నుంచి మొదలైన ఈ అధ్యయనం ఇన్నాళ్లకు ఆమోదంపొందింది.
✍ ఆశయాలు, ఆదర్శాలు వినడానికి బావుంటాయి. కానీ అమల్లో, అందులోనూ భారతీయ విద్యా వ్యవస్థలో ఇలాంటి ఆదర్శాల అమలు అంత తేలిక కాదని గతము లో చాల అనుభవాలు చెబుతున్నాయి.✌చదువు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ మేధావులు తరచూ చెప్పే పరీక్షా విధానం, బోధన పద్ధతులు, సిలబస్ గురించి ఈ పత్రంలో చాలా చెప్పారు. అంతర్జాతీయ స్థాయి విద్య, భారతీయ విలువలు అంటూ సాగిందీ పత్రం. పరీక్షలు, సిలబస్, కోర్సు నిబంధనలు సులభం చేస్తామని చెబుతోంది.✌అయితే, కోర్సు నిబంధనలు సులభతరం చేసినంతగా, పరీక్షలను సులభతరం చేస్తే, మార్కులు వేసే వారు చేసే దుర్వినియోగాలను అరికట్టడం ఎలా అన్న అంశం ఈ పత్రం చర్చించలేదు.✌ మాములుగా విద్యలో రెండు ముఖ్యాంశాలు ఉంటాయి :✌ ఒకటి అకడమిక్. అంటే చెప్పే పాఠాలు, పరీక్షలు విధానం వంటివి.✌రెండోది అడ్మినిస్ట్రేటివ్ లేదా సిస్టమ్. అంటే కోర్సు కాలం, మధ్యలో మానేస్తే ఎలా, స్కూల్ పెత్తనం ఎవరిది వంటి అంశాలన్నీ వస్తాయి.✌ తాజా పాలసీ అకడమిక్ అంశాలను టచ్ చేసినా, సిస్టమేటిక్ మార్పులపై ఎక్కువ దృష్టి పెట్టింది.✌ ఒకప్పుడు కేంద్రానికి సంబంధం లేని, రాష్ట్రాల బాధ్యతగా ఉన్న విద్యను ఇందిరా గాంధీ.రాష్ట్రం-కేంద్రం ఉమ్మడి వ్యవహారంగా మార్చారు.✌ఇప్పుడు మోదీ పూర్తిగా కేంద్రం చేతుల్లో ఉంచేలా కొత్త పాలసీ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషణ వినిపిస్తోంది.✌రాజీవ్ గాంధీ ఈ శాఖకు మానవ వనరుల శాఖ అని పేరు పెడితే.. మోదీ మళ్లీ విద్యా శాఖగా పేరు మారుస్తున్నారు.✌ఇంతకీ ఇన్ని మార్పులు సూచించిన, ఇస్రో పూర్వ అధ్యక్షులు కస్తూరి రంగన్ బృందంఐదేళ్లపాటూ అధ్యయనం చేసారు.2 లక్షల సూచనలు చదవి ఇచ్చిన 484 పేజీల పత్రాల్లో ఏముంది ? పిల్లల చదువుల్లో వచ్చే మార్పులు
✌ ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఒక దశ, ఆ తరువాత రెండేళ్ల కోర్సు మరో దశ ఉంది. తాజాగా వాటి స్థానంలో కింద పద్ధతి వస్తుంది.
✌ విద్యా హక్కు చట్టంలో 8వ తరగతి వరకూ మాతృభాష విద్య తప్పనిసరికాగా, ఇందులో 5వ తరగతి వరకే చేశారు.
✌ ఇప్పటి వరకూ 6-14 ఏళ్ల లోపు పిల్లలకే తప్పనిసరి విద్య ఉండేది. ఇప్పుడు 3-18 ఏళ్లకు పెంచారు. దీనివల్ల కొత్తగా 3-6 మధ్య ఉన్న పిల్లలూ, 14-18 మధ్య ఉన్న పిల్లల విద్యకు ఏర్పాట్లు చేయాలి.
✌ దేశమంతా ఉత్తరాది తరహాలో ఇంటర్ ను 11,12 తరగతులుగా వ్యవహరిస్తారు.
✌ ఆరవ తరగతి నుంచే వృత్తి విద్య (వొకేషనల్ శిక్షణ)
✌ 2025 నాటికి 5వ తరగతి దాటిన అందరికీ అక్షరాస్యత (ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు 7-8 తరగతుల తరువాత కూడా చదవడం, రాయడం, కూడికలు వంటివి కూడా రావడం లేదు. దీంతో దీనిపై శ్రద్ధ పెట్టలాని)
✌ 2030 నాటికి 3-18 వయసులో ఉన్న అందరికీ చదువు
✌ 2035 నాటికి ఉన్నత విద్య చదివే వయసు ఉన్న వారిలో కనీసం సగం మంది అయినా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరేలా చూడడం.
✌ ఉపాధ్యాయ శిక్షణ, వారి అర్హతలు జాతీయ స్థాయిలో నిర్ణయించడం, 2030 నాటికి నాలుగేళ్ల బీఈడీ చేసారు
✌ ప్రధాని అధ్యక్షతన రాష్ట్రీయ శిక్షా ఆయోగ్
✌ ఇన్ని విభాగాలుగా ఉన్నంత మాత్రాన ఇన్ని స్కూళ్లు రావు. ఉన్న స్కూళ్లే తరగతులను పెంచుకుంటాయి. జూనియర్ కాలేజీలు కావాలంటే 9వ తరగతి నుంచే మొదలుపెడతాయి. హైస్కూళ్లు 12వ తరగతి వరకూ పెంచుకుంటాయి.✌ పెద్దల చదువుల్లో వచ్చే మార్పేమిటి
✌ క్రెడిట్ సిస్టం వస్తుంది. అంటే ఇన్ని పాఠాలు చదివి, పరీక్ష రాస్తే ఇన్ని క్రెడిట్స్ అని ఇస్తారు. మొత్తం నిర్ణీత క్రెడిట్స్ పూర్తి చేస్తే సర్టిఫికేట్ వస్తుంది. ఇది ప్రస్తుతం ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో ఉంది.
✌ కోర్సు మధ్యలో కొంత కాలం మాని తరువాత కొనసాగించడం సులువు అవుతుంది.
✌ డిగ్రీ నాలుగేళ్లు ఉంటుంది. డిగ్రీ పీజీ కలిపిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు వస్తాయి. ఎం ఫిల్ రద్దు
✌ లా, మెడిసిన్ తప్పా అన్ని చదువులూ ఒకే బోర్డు కిందకు
✌ గ్రూపులు కాలేజీ చెప్పినట్టు కాకుండా, విద్యార్థికి నచ్చినట్టు తీసుకోవచ్చు. ఉదాహరణకు ఫిజిక్స్, హిస్టరీ, బోటనీ కూడా కలిపి తీసుకోవచ్చు
✌ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వస్తుంది. యూజీసీ ఇక ఉండదు. దీని కింద.. నేషనల్ హయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్నేషనల్ ఎక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్ స్థానంలో), హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ (నిధులకు), జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, దీని కింద మళ్లీ నేషనల్ హయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేం వర్క్ కార్యక్రమం ఉంటుంది.
✌ ప్రస్తుతం ఉన్న వివిధ సంస్థలు (ఐసీఎంఆర్) వంటివి ఆయా సబ్జెక్టుల్లో విద్యకు నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించే సంస్థలుగా ఉంటాయి. (స్టాండర్డ్ సెట్టింగ్ బోర్డ్)
వీసీలకు అధికారాలు పెరుగుతాయి. యూనివర్సిటీల పాలన బోర్డు ఆఫ్ గవర్నర్స్‌కు వెళుతుంది.
✌ పరిశోధనలు చేసే వారితో వాటికి డబ్బులు ఇచ్చే వారిని నేరుగా కనెక్ట్ చేస్తారు. దీంతో పీహెచ్‌డీల బాధ్యత పెరుగుతుంది.
✌ మామూలు డిగ్రీకి కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. (నీట్ తరహాలో)
✌ ప్రాథమిక విద్యలో వచ్చే మార్పులు
✌ ఒకటి నుంచి పదో తరగతి, ఆ తరువాత రెండేళ్ల కోర్సు స్థానంలో కింద పద్ధతి వస్తుంది.
✌ ఫౌండేషన్: 3-8 ఏళ్ల వారు ఒక గ్రూపు - ఐదేళ్ల చదువు - ఎల్‌కేజీ నుంచి 2వ తరగతి;
✌ ప్రిపరేటరీ: 8-11 ఏళ్ల వారు ఒక గ్రూపు - మూడేళ్ల చదవు - 3 నుంచి 5 తరగతులు;
✌ మిడిల్: 11-14 ఏళ్ల వారు ఒక గ్రూపు - మూడేళ్ల చదవు - 6 నుంచి 8 తరగతులు ;
✌ సెకండరీ: 14-18 ఏళ్ల వారు ఒక గ్రూపు - నాలుగేళ్ల చదువు - 9 నుంచి 12వ తరగతి
10వ తరగతి, 12వ తరగతికి బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ ఎస్ఎస్‌సీ బోర్డు, ఇంటర్ బోర్డూ కలసిపోతాయి. ఇవికాక 3, 5, 8వ తరగతి పరీక్షలు వస్తాయి.
✌ విద్యా హక్కు చట్టంలో 8వ తరగతి వరకూ మాతృభాష విద్య తప్పనిసరికాగా, ఇందులో 5వ తరగతి వరకే చేశారు.
✌ ఇప్పటి వరకూ 6 నుంచి14 ఏళ్ల లోపు పిల్లలకే తప్పనిసరి విద్య ఉండేది. ఇప్పుడు 3 నుంచి 18 ఏళ్లకు పెంచారు. దీనివల్ల కొత్తగా 3 నుంచి 6ఏళ్ల మధ్య వయసున్న పిల్లలూ, 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉన్న పిల్లల విద్యకు ఏర్పాట్లు చేయాలి.దేశమంతా ఉత్తరాది తరహాలో ఇంటర్‌ను 11,12 తరగతులుగా వ్యవహరిస్తారు.
✌ ఆరో తరగతి నుంచే వృత్తి విద్య (వొకేషనల్ శిక్షణ)
✌ 2025 నాటికి 5వ తరగతి దాటిన అందరికీ అక్షరాస్యత (ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు 7-8 తరగతుల తరువాత కూడా చదవడం, రాయడం, కూడికలు వంటివి కూడా రావడం లేదు. దీంతో దీనిపై శ్రద్ధ పెట్టలాని)
✌ 2030 నాటికి 3-18ఏళ్ల వయసులో ఉన్న అందరికీ చదువు
✌ 2035 నాటికి ఉన్నత విద్య చదివే వయసు ఉన్న వారిలో కనీసం సగం మంది అయినా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరేలా చూడడం.
0 Comments