✌ ఆపరేషన్ జిబ్రాల్టర్

✌ ఆపరేషన్ జిబ్రాల్టర్


✌ జమ్మూ కాశ్మీర్‌లోకి చొరబడటానికి పాకిస్తాన్ వ్యూహానికి ఇచ్చిన సంకేతనామమే ఆపరేషన్ జిబ్రాల్టర్, భారత పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించటానికి స్థానికులను ప్రేరేపించిన ఘటన ఇది.
జిబ్రాల్టర్ నౌకాశ్రయం నుండి ప్రారంభించిన స్పెయిన్ ముస్లింల ఆక్రమణకు సమాంతరంగా గీయడానికి పాకిస్తాన్ ఈ పేరును ప్రత్యేకంగా ఎంచుకుంది.
ఆగష్టు 1965 లో, పాకిస్తాన్ సైన్యం యొక్క దళాలు స్థానికుల మారువేషంలో, కాశ్మీరీ ముస్లింలలో తిరుగుబాటును ప్రేరేపించే లక్ష్యంతో పాకిస్తాన్ నుండి జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించాయి.
ఏదేమైనా వారి సమన్వయం సరిగా లేకపోవడంతో వ్యూహం ప్రారంభం నుంచీ అవాక్కయింది, మరియు చొరబాటుదారులు త్వరలో కనుగొనబడ్డారు.1947 సంవత్సరంలో లో దేశ విభజన జరిగిన  సమయంలో సరిహద్దులను నిశ్చయించే కమిషను నేత సిరిల్ రాడ్‌క్లిఫ్ ముస్లిములు ఎక్కువగా నివసించే ప్రాంతాలను పాకిస్తాన్‌లో చేరుస్తూ సరిహద్దులను నిశ్చయించాడు.
కానీ  జమ్మూ కాశ్మీరుగురుదాస్పూర్ఫెరోజ్‌పూర్ వంటి ప్రాంతాల్లో ముస్లింలు  మెజారిటీగా ఉన్నప్పటికీఆయాసంస్థానాధీశులు కోరుకున్నందువలన వాటిని భారత్‌లో కలిపాడు. 
✌ ఇది 86% ముస్లిములున్న కాశ్మీర్ ప్రాంతంలో  తీవ్ర వ్యతిరేకత రేకెత్తించింది. కాశ్మీరుపై భారత పాక్ యుద్ధాలకు ఇది ప్రాతిపదిక గా మారింది. 

  1962 భారత చైనా  యుద్ధం తరువాత భారత సైన్యం  పునర్నిర్మాణ దశలో ఉన్నపుడుదాడికి అది సదవకాశంగా పాకిస్తాన్ భావించింది.

  సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీపాకిస్తాన్ వాయుసేనఆర్మరీ రెండూ నాణ్యతాపరంగా భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి.1965 నాటి రాన్ ఆఫ్ కచ్ ఘటనలో పాకిస్థాన్ కు  కాస్త అనుకూల ఫలితం రావడం కూడా పాకిస్థాన్ కు ప్రోత్సాహం కలిగించింది. 

 పైగా 1963 డిసెంబరులో శ్రీనగర  లోని హజరత్‌బల్ మసీదు నుండి పవిత్ర జ్ఞాపిక అదృశ్యమవడంతో కాశ్మీరంతటా ముస్లిముల్లో అశాంతి రేకెత్తించింది. తిరుగుబాటు చేసేందుకు ఇది అనుకూలంగా  పాక్  భావించింది. 
 అంశాలన్నీదొంగచాటు దెబ్బతీసేందుకుపూర్తిస్థాయి యుద్ధం అనే భయాన్ని కలిగించేందుకూతద్వారా కాశ్మీరుపై ఒక పరిష్కారం  సాధించేందుకూ ఇది మంచి సమయంగా పాకిస్తాన్ నేతలు భావించారు.
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ మొదట్లో వ్యతిరేకించినప్పటికీ ఆపరేషన్ను మొదలుపెట్టారు. 1965 జూలైఆగస్టుల్లో పాకిస్తాన్ బలగాలు పీర్ పంజల్ పర్వతాల వద్ద నియంత్రణ రేఖను దాటి గుల్మార్గ్యూరిబారాముల్లా  లోకి ప్రవేశించాయి. 
భారతీయ వర్గాల ప్రకారం 30,000 – 40,000 మంది పాకిస్తాన్ సైనికులు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడ్డారు. పాకిస్తానీ వర్గాలు  సంఖ్యను 5,000 -7,000 మాత్రమే అని పేర్కొన్నాయి. 
✌ "జిబ్రాల్టర్ ఫోర్స్" అని పిలిచే  బలగాలు మేజర్ జనరల్ అఖ్తర్ హుసేన్ మాలిక్ నేతృత్వంలో నడిచాయి. ఈ సేననును 9 బలగాలుగా (ఒక్కొక్క దానిలో 5 కంపెనీలు) విభజించారు. ఒక్కో దానికీ చారిత్రిక ముస్లిము పాలకుల పేర్లతో ఒక్కో సంకేత నామం ఇచ్చారు.
✌ చొరబాటుదార్లు స్థానికులలో కలిసిపోయి తిరుగుబాటుకై వారిని రెచ్చగొడతారు. ఈలోగా వారు గెరిల్లా యుద్ధ పద్ధతిలో వంతెనలుసొరంగాలురోడ్లువిమానాశ్రయాల పైనా దాడి చేస్తారు.దీంతో కాశ్మీరులో సాయుధ విప్లవ పరిస్థితులు నెలకొనిదేశవ్యాప్తంగా తిరుగుబాటు జరుగుతుందని పాకిస్తాన్ పాలకులు భావించారు.
భారత్ దీన్ని ఎదుర్కోలేదనిపూర్తిస్థాయి యుద్ధానికి అసలే సిద్ధపడదనీ తద్వారా కాశ్మీరు ఆక్రమణ త్వరితంగా నెరవేరుతుందనీ భావించారు. మొత్తం 9 దళాల్లోనూ మేజర్ మాలిక్ మునావర్ ఖాన్ అవాన్ నేతృత్వంలోని దళం మాత్రమే మెహందర్-రాజౌరీ ప్రాంతంలో తమ లక్ష్యాన్ని చేరుకోగలిగింది 
బలగం పేరు
ఆపరేషన్ ప్రాంతం
సలాహుద్దీన్
శ్రీనగర్ లోయ
ఘజ్నవీ
మెహందర్-రాజౌరీ
తారిఖ్
కార్గిల్-ద్రాస్
బాబర్
నౌషేరా-సుందర్‌బానీ
ఖాసిమ్‌
బందీపురా-సోనార్‌వైన్
ఖాలిద్
ఖాజీనాగ్-నౌగావ్
నస్రత్
తిత్వాల్-తంగ్‌ధార్
సికందర్
గురేజ్
ఖిల్జీ
కేల్-మినిమార్గ్

Post a Comment

0 Comments

Close Menu