✌ ధోలే Dhole (ఆసియా వైల్డ్ డాగ్)

✌ IUCN స్థితి ?
✌ మీకు తెలుసా ?
✌ దోల్(Dhole) గురించి (రేసుకుక్కలు

వార్తల్లో ఎందుకు ??

✌భారతదేశంలో ధోలే పరిరక్షణలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉన్నాయని కొత్త అధ్యయనం తెలిపింది.

✌ ధోల్ మధ్య, దక్షిణ, తూర్పు ఆసియా మరియు ఆగ్నేయాసియా దేశాలకు చెందినది.
✌ పశ్చిమ కనుమలు, మధ్య భారతదేశం మరియు ఈశాన్య భారతదేశం అనే మూడు ప్రకృతి దృశ్యాలలో కీలక జనాభా ఉన్న భారతదేశం అత్యధిక సంఖ్యలో ధోల్స్‌కు మద్దతు ఇస్తుంది.

IUCN స్థితి: అంతరించిపోతున్న దశలో ఉంది 

✌అటవీ పర్యావరణ వ్యవస్థలలో అపెక్స్ మాంసాహారులుగా ధోల్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
✌ పులితో పాటు, భారతదేశంలో ఐయుసిఎన్ యొక్క ‘అంతరించిపోతున్న’ వర్గంలో ఉన్న ఏకైక పెద్ద మాంసాహారి ధోలే.
✌ ఈ క్షీణతకు కారణమయ్యే కారకాలు నివాస నష్టం, ఆహారం కోల్పోవడం, ఇతర జాతులతో పోటీ, పశువుల పెంపకం వల్ల హింస మరియు పెంపుడు కుక్కల నుండి వ్యాధి బదిలీ.

మీకు తెలుసా ?

✌విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (ఐజిజెడ్‌పి) లో 2014 లో భారత ప్రభుత్వం దీనిని మొదటి ధోలే పరిరక్షణ పెంపకం కేంద్రాన్ని మంజూరు చేసింది.
✌ భారతదేశంలో, వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 లోని షెడ్యూల్ 2 కింద ధోలే రక్షించబడింది.

దోల్(Dhole) గురించి (రేసుకుక్కలు)

✌ ఇవి అడవి జంతువులు, క్రూర జంతువులు. అడవిలో ఎన్నో జంతువులుంటాయి. కాని వీటికి ఒక ప్రత్యేకత వున్నది. వీటి ఆకారం చూడడానికి కుక్కల్లాగె వున్నా ఇంకా అందంగా అన్ని ఒకే రంగులో వుండి కుక్కల కన్నా కొంచెం పెద్దగా వుంటాయి. మూతి కొంచెం పొడుగ్గా మూతి కొన నల్లగా కుచ్చు తోక కలిగి వుంటాయి.

✌ ఇవి ఎప్పుడు గుంపులు గుంపులుగా వుంటాయి. ఒంటరిగా మాత్రం వుండవు.

✌ ఇవి మనుషులకు గాని జంతువులకు గాని ఎంతమాత్రం భయపడవు.

✌ వేటాడె సమయంలో ఇవి చాల చురుగ్గా నిర్బయంగా ప్రవర్తిస్తాయి. మేకలు ,గొర్రెలు ,మందమీద పడి చంపి తింటాయి. మనుషులకు ఇవి ఏమాత్రం హాని చేయవు

ఇవి గొర్రెల మందలో పడ్డాయంటే తప్పనిసరిగా రెండు మూడు గొర్రెలు చావల్సిందే. ఎంతమంది కాపలా దారులున్నా అందరు కలిసి బెదిరించినా అవి తమ దాడిని మాత్రం ఆపవు. అవి ముందుగా గొర్రె గొంతును పట్టి రక్తం పీల్సి పడవేస్తాయి.మిగతావి పొట్టను చీల్సి తింటాయి. కాపలాదారు పక్కనే వున్న వాటికి భయం కనిపించదు. తమ పని తాము కానిస్తాయి. 

కాపరులకు కూడా వాటి సంగతి తెలుసు గాన వాటి బారిన పడిన దాన్ని వదిలి మిగతా వాటిని దూరంగా తోలుకొని పోతారు. 

✌ ఈ రేసు కుక్కలు కేవలం ఒక మంద మాత్రమే వస్తాయి. అవి ఎప్పుడు ఒకే ప్రాంతాన్ని అంటి పెట్టుకొని వుండవు. 

✌ ఆ తర్వాత ఎప్పుడొ ఈ ప్రాంతానికి వస్తాయి. అంత వరకు గొర్రెల కాపరులకు నిచ్చింతే. విశేషమేమిటంటే మనుషులు ఎవ్వరూ వాటికి హాని చేయరు, అవి కూడా మనుషులకు హాని చేయవు. అవి దేవతా కుక్కలని వీరి నమ్మకం. వాటిని కొట్ట కూడదని వీరి నియమం. 

✌ఈ సంగతి వాటికి తెలిసి నట్టుంది. అడవి జంతువుల గురించి తెలిసినవారు చూసిన వారు చెప్పే దాన్ని బట్టి అడవి పందిని వేటాడ్డం పులలకు కూడ చాల కష్టమట. అలాంటి అడవి పందిని కూడ ఈ రేసు కుక్కలు అతి సునాయసంగా వేటాడతాయట. చూసిన వారు చెప్తారు. 

వింతైన విషయమేమిటంటే పులులు కూడ వీటికి భయపడతాయట.

Post a Comment

0 Comments

Close Menu