✌ బెంగళూరు రోస్ ఉల్లిపాయ

✌ బెంగళూరు రోస్ ఉల్లిపాయ  బెంగళూరు అర్బన్, బెంగళూరు గ్రామీణ, చిక్కబల్లాపూర్, కోలార్ జిల్లాల్లో బెంగళూరు గులాబీ ఉల్లిపాయలను పండిస్తారు.
✌ తుమ్కూర్, హసన్, దావనగెరె, ధార్వాడ్ మరియు బాగల్కోట్లలో కూడా వీటిని పెంచుతారు. ఈ  గులాబీ ఉల్లిపాయలను భారతదేశంలో మరే ప్రదేశంలోనూ పండించరు
✌ దీనిని స్థానికంగా గులాబీ ఈరుల్లి అంటారు.
✌ఈ రకమైన ఉల్లిపాయలు ఫ్లాట్ బేస్ తో వెలుగులు  కలిగి ఉంటాయి మరియు గోళాకారంగా ఉంటాయి.
✌వీటిలో లోతైన స్కార్లెట్ ఎరుపు రంగు, ఆంథోసైనిన్, ఫినాల్స్ మరియు అధిక పన్జెన్సీ ఉన్నాయి.
వాటిలో ప్రోటీన్, భాస్వరం, ఐరన్ మరియు కెరోటిన్ కూడా అధిక స్థాయిలో ఉంటాయి.

✌ దీనికి 2015 లో భౌగోళిక సూచిక ట్యాగ్ వచ్చింది.

✌ ఉల్లి పాయ

✌ ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి . ఇది ఆసియాలో పుట్టింది. ఇప్పుడు అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది.

పచ్చి ఉల్లి మంచి ఊఫ్రొడయజిక్ (Aphrodisiac) గా పనిచేయును.ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి.టేస్తోస్తేరాన్ (testosteron), ఇన్సులిన్ (insulin), గ్రౌత్ హార్మోన్ (GrowthHormone, ఆక్షితోసిక్ (Oxytocic) వంటి లక్షణాలు ఉన్నాయి., పచ్చి ఉల్లి ఎక్కువగా తింటే గుండె మంట (Acidity) వస్తుంది . 

దీనిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటుంది కావున కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి . ఉల్లిలో కేలరీలు శక్తి ఎక్కువ..వేయిస్తే ఈ శక్తి విలువ ఇంకా పెరుగుతుంది.ఉల్లిని అన్ని కూరలలోలో వాడుతారు.విందు భోజనాల్లో ఉల్లి పెరుగు చట్ని తప్పని సరిగా ఉంటుంది.భారతీయ వంటలలో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము.వివిధ రకాలైన కూరలు తయారుచేయడంలో దీనిని అనుబంధ పదార్ధంగా వాడతారు.

ఉల్లికాడలు కొన్ని రకాలైన ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు.       

ఉల్లి స్టమక్ అప్సెట్ నుండి ఉపసేమానం పొందడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఉల్లిపాయలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉంటాయి.


✌ కొన్ని వ్యాదులకు ఉల్లి చాల మేలు చేస్తుంది       

  • రక్తపోటు
  • గుండె జబ్బులు
  • ఆస్తమా
  • అల్లెర్జి
  • ఇన్ఫెక్షన్
  • దగ్గు
  • జలుబు
  • నిద్రలేమి
  • ఉబకాయము
✌ ఉల్లిపాయ లో రకాలు

1.తెల్లనివి
2.ఎర్రనివి
3.చిన్నవి
4.పెద్దవి
5.ఎక్కువ వాసన కలవి
6.తక్కువ వాసన కలవి
7.తియ్యటివి

Post a Comment

0 Comments

Close Menu