కోర్టు ధిక్కరణ అంటే ?

✌ కోర్టు ధిక్కరణ అంటే ?



✌ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ -1971ప్రకారం.. కోర్టు ధిక్కరణ రెండు రకాలు. వీటిలో 
✌ మొదటిది సివిల్ కంటెంప్ట్. 
✌ రెండోది క్రిమినల్ కంటెంప్ట్.


ఏదైనా కోర్టు తీర్పు, ఆదేశం లేదా ఇతర కోర్టు ప్రక్రియలకు ఉద్దేశపూర్వకంగానే అనుసరించకపోవడాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం లేదా మాటను ఉద్దేశపూర్వకంగా అనుసరించకపోవడం కూడా దీని కిందకే వస్తుంది.
✌ రెండోది క్రిమినల్ కంటెంప్ట్. దీనిలో మూడు రకాలున్నాయి. ఈ నిబంధనలను ప్రచురణ రూపంలో లేదా వ్యాఖ్యలు చేయడం, లేదా సంజ్ఞల రూపంలో ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. 

✌ ఆ నింధనలు ఏమిటంటే..


✌ ఏదైనా కోర్టు గౌరవాన్ని దిగజార్చేలా చేయడం లేదా దూషణలకు పాల్పడటం
కోర్టు ప్రక్రయల్లో జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నించడం లేదా పక్షపాతం చూపించడం
ఏదైనా చర్యల ద్వారా న్యాయ పరిపాలన ప్రక్రియలకు అడ్డు తగలడం లాంటి ప్రక్రియలు.

✌ క్రిమినల్ కంటెంప్ట్‌తో పోలిస్తే సివిల్ కేసులు ఎక్కువగా వస్తాయి అని  నల్సార్ లా యూనివర్సిటీ అధ్యాపకుడు, కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ గారు తెలిపారు.

''కోర్టు ఆదేశాలను అనుసరించకపోతే.. సివిల్ కంటెంప్ట్ కిందకు వచ్చేస్తుంది. క్రిమినల్ కేసు అవ్వాలంటే.. తీర్పును తప్పుపట్టడం లేదా ప్రతిష్ఠను మసకబార్చేలా వ్యాఖ్యలు లేదా ప్రచురణలు చేయాల్సి ఉంటుంది. అందుకే క్రిమినల్ కంటెంప్ట్‌తో పోలిస్తే.. సివిల్ కేసులు ఎక్కువ''
 
✌ దీనికి అటార్నీ జనరల్ అనుమతి అవసరమా ?

✌ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971లోని సెక్షన్ 1(15) ప్రకారం.. క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయంలో సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు నేరుగా చర్యలు తీసుకోవచ్చు. లేదా అటార్నీ జనరల్ లేదా అటార్నీ జనరల్ సమ్మతితో మరెవరైనా కేసులు నమోదు చేయొచ్చు.
✌ ''సాధాణంగా సుప్రీం, లేదా హైకోర్టులు తమకు తాముగానే కేసులను పరిగణలోకి తీసుకుంటాయి.అదే సాధారణ పౌరులు లేదా న్యాయవాదుల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కేసు నమోదు చేయాలంటే... సుప్రీం కోర్టు విషయానికి వస్తే అటార్నీ జనరల్ అనుమతి తీసుకోవాలి. అదే హైకోర్టు విషయంలో అడ్వొకేట్ జనరల్ అనుమతి తీసుకోవాలి''.

✌ శిక్షలు ఏమి ఉంటాయి ?

✌ కోర్టు ధిక్కరణ చర్యల కింద ఆరు నెలల వరకు జైలు శిక్షవిధించే అవకాశముంది. లేదా రెండు వేల రూపాయల వరకు జరిమానా విధించొచ్చు. లేదా కొన్నిసార్లు రెండూ విధిస్తారు.
✌ అయితే, ఒక్కోసారి క్షమాణలు చెప్పడం ద్వారా ఈ శిక్షలను కోర్టులు మాఫీ చేస్తాయి. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ విషయంలో ఇలానే జరిగింది. ఆయన క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో రూ.1 జరిమానాను కోర్టు విధించింది.

Post a Comment

0 Comments

Close Menu