మత మార్పిడి కి చట్టం ఏమి చెబుతోంది ??

✌ వార్తల్లో ఎందుకు ?

✌బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేందుకు ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు హరియాణా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే అమలులోనున్న ఇదే తరహా చట్టంపై హరియాణా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.


✌ చట్టం ఏం చెబుతోంది?

✌హిమాచల్ ప్రదేశ్‌లో మత మార్పిళ్లకు సంబంధించిన చట్టం.కొండ ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయన్న వార్తల నడుమ 2006లో వీరభద్ర సింగ్ ప్రభుత్వం మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది.
✌అయితే, ఈ చట్టంపై కొన్ని క్రైస్తవ మిషనరీలు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశాయి. హైకోర్టులో కూడా సవాల్ చేశాయి. 13ఏళ్ల తర్వాత దీనికి తాజాగా సవరణ తీసుకొచ్చారు. చట్టాన్ని మరింత కఠినంగా మార్చారు.

చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించేవారికి విధించే శిక్షను.. ఇక్కడి ముఖ్యమంత్రి జయ్ రామ్ ఠాకుర్నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం శిక్ష ను  మూడు నుంచి ఏడేళ్లకు పెంచింది. 

ఈ చట్టానికి గతేడాది ఆమోదం లభించింది. అన్ని పార్టీలు ఈ చట్టానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.

✌ మత స్వేచ్ఛ చట్టం-2019లో ఎనిమిది కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. కేవలం మత మార్పిడే లక్ష్యంగా పెళ్లిని చేసినట్లయితే, ఆ పెళ్లి చెల్లదని నిబంధన కూడా వీటిలో ఉంది.
✌పెళ్లికి ముందు లేదా తర్వాత ఒక వ్యక్తి మతం మారినా లేకపోతే పెళ్లికి ముందు లేదా తర్వాత భాగస్వామి మతం మారేలా చేసినా.. ఆ పెళ్లి చెల్లదు అని చట్టంలో పేర్కొన్నారు.

✌ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం. ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా లేదా ఒత్తిడితో లేదా ప్రలోభపెట్టి లేదా మాయ మాటలు చెప్పి, లేదా కుట్ర పూరితంగా మతమార్పిడికి పాల్పడటం నేరం అని తెలుపుతోంది. 
✌ఒకవేళ షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు చెందిన వారిని, మహిళలను మత మార్పిడి చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
✌ సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చేలా కొత్త చట్టాలను తీసుకొన్నారు. వీటి కింద కేసులు నమోదు చేస్తే బెయిలు కూడా తీసుకోవడం కుదరదు.

✌ ఇతర రాష్ట్రాలలో ఎలా ఉంది ?

✌ఒడిశా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో ఈ మతమార్పిడి వ్యతిరేక చట్టాలు.. ఒక్కోలా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో గిరిజనులను క్రైస్తవంలోకి మారుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు హిందూ అమ్మాయిలను పెళ్లిళ్ల ద్వారా ఇస్లాంలోకి మారుస్తున్నారని కూడా వార్తలు వస్తుఉంటాయి  వీటినే లవ్ జిహాద్‌గా పిలుస్తున్నారు .

✌మత మార్పిడికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టాలు అమలులో ఉన్నాయి. కానీ ఇప్పుడు లవ్ జిహాద్ అనే కొత్త కోణం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా హిందూ అమ్మాయిలు, ముస్లిం అబ్బాయిల మధ్య వివాహాల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇదొక రాజకీయ అంశంగా కూడా  మారిపోతోంది అనుకొంటున్నారు.

మత మార్పిళ్లు మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా హెచ్చరించారు.

😎 మీకు ఒక ప్రశ్న ?? ఈ మత మార్పిడి ల మీద మీ అభిప్రాయం ఏమిటి ??

Post a Comment

0 Comments

Close Menu