✌ అలెగ్జాండర్ వీటిని పశ్చిమాసియాకు తీసుకెళ్లాడు.
✌ అరబిక్‌లో బనాన్ అంటే చేతి వేళ్లు
✌ బౌద్ధ మతంలోని తెరవాద గ్రంథమైన పాలి కేనన్‌లో ప్రస్తావించిన ఏకైక పండు
✌ అరటిపళ్లను సర్వ రోగ నివారిణిగా కూడా
✌ భారత సంస్కృతీ సంప్రదాయాల్లో అడుగడుగునా దీని జాడలు కనిపిస్తాయి.✌ భారత్ అరటి పళ్లకు పుట్టినిల్లు.✌ఏడాది పొడవునా అందుబాటులో ఉండటం, తక్కువ ధరకే లభించడంతో ప్రజల జీవితాల్లో వీటికి ప్రత్యేక స్థానం దక్కింది..✌వీటిలో ఒక్కో రకం అరటి పండుకు ఒక్కో పేరు ఉంది. పూవన్, చెవ్వళి, మట్టిపళ్లం ఇలా భిన్నమైన పేర్లతో వీటిని పిలుస్తారు.వీటిని తమిళంలో వళైపళం, హిందీలో కేలా అని అంటారు.వీటిలో ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. ✌ ఒక్కో అవసరానికి ఒక్కోలా వీటిని ఉపయోగిస్తుంటారు.✌ భారత్‌లో విరివిగా లభించే పళ్లలో అరటిపళ్లు ప్రధానమైనవి. ఇవి ఏడాది పొడవునా లభిస్తాయి. తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి. ✌ అందుకే ప్రతి శుభకార్యం, పండుగ, ఇతరత్రా కార్యక్రమాల్లోనూ వీటికి ప్రత్యేక స్థానముంటుంది. అరటిపళ్లు మాత్రమే కాదు అరటి చెట్టు మొత్తానికీ భారత సంస్కృతీ, సంప్రదాయాలతో విడదీయరాని అనుబంధముంది. ✌ దేశీయ రకాలను ఇంటి వెనుక, తోటల్లో పెంచుతుంటారు. ఇక్కడి తేమతో కూడిన వాతావరణం, చిత్తడి నేలలు అరటిపళ్లు పెంచడానికి అనువైన ప్రాంతాలు. ముఖ్యంగా పశ్చిమ కనుమల వెంబడి ఇవి చక్కగా పెరుగుతాయి.✌ భూమిపై తొలినాళ్లలో పండించిన పంటల్లో అరటి కూడా ఒకటి. విస్తృతంగా పండించే పంటగా కూడా దీనికి పేరుంది. వీటికి భారత్, ఆగ్నేయాసియా పుట్టినిల్లు. అయితే, ఇప్పుడు ఇవి చాలా ప్రాంతాలు, దేశాలకు విస్తరించాయి.✌ కరోనావైరస్ వ్యాప్తి నడుమ కూడా ఎక్కువ మంది వీటిని ఆహారంగా తీసుకున్నారు. సులభంగా తయారుచేసుకోగలిగే బనానా బ్రెడ్ అయితే, అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది.✌ కదళీ ఫలం రుచికి అలెగ్జాండర్ మంత్రముగ్ధుడైనట్లు చరిత్ర చెబుతోంది.అరటిని సంస్కృతంలో కదళీ ఫలంగా పిలుస్తారు. అలెగ్జాండర్ వీటిని పశ్చిమాసియాకు తీసుకెళ్లాడు. అక్కడే వీటికి బనాన్ అనే పేరు వచ్చింది. ✌ అరబిక్‌లో బనాన్ అంటే చేతి వేళ్లు అని అర్థం. ఆ తర్వాత ఇవి 15వ శతాబ్దంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్ దీవులకు విస్తరించాయి. ఆ తర్వాత బెర్ముడాకు చేరాయి.17,18 శతాబ్దాల్లో బెర్ముడా నుంచి ఇంగ్లండ్‌కు ఈ పళ్లను తీసుకెళ్లేవారు. ✌1835లో మూసా కేవెండిషిగా పిలిచే పసుపు అరటిపళ్లను ఇంగ్లండ్‌లోని డెబ్రీషైర్‌లో జోసెఫ్ ప్యాక్స్‌టన్ పెంచేవారు. తన యజమాని విలియం కేవెండిష్ పేరునే ఆయన ఈ అరటిపళ్లకు పెట్టారు.✌మిగతా రకాలతో పోల్చినప్పుడు పరిమాణంతోపాటు రుచి కూడా కొంత తక్కువగా ఉన్నప్పటికీ ఈ కేవిండిష్ రకాలు ప్రత్యేకమైనవి. ఇవి వ్యాధులను తట్టుకొని నిలబడతాయి. అదే సమయంలో దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ✌ దీంతో పశ్చిమ దేశాలు ఈ రకానికి బాగా అలవాటుపడ్డాయి. భారత్‌లో అధిక దిగుబడినిచ్చే జీ9 కేవిండిష్ రకాలను వాణిజ్య అవసరాల కోసం పెంచుతుంటారు.✌ అయితే, దేశీయ అరటి రకాలు కూడా చాలా ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ✌ స్థానికులు పూవన్, మొండన్, పేయన్ (త్రిమూర్తులు) అంటూ పాటలు కూడా పాడుతుంటారు. రుచిలో భిన్నంగా ఉండటంతో వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తుంటారు.✌మరోవైపు భారత్‌లో అరటిపళ్లను సర్వ రోగ నివారిణిగా కూడా పిలుస్తుంటారు. ఇటు శారీరక, అటు ఆధ్యాత్మిక చికిత్సల్లోనూ వీటిని ఉపయోగిస్తారు. ✌ నేడు అరటి పళ్లలోని పోషక విలువల గురించి దాదాపు అందరికీ తెలుసు. పండిన తర్వాత వీటిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బీ3, విటమిన్ సీలతోపాటు కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా వుంటాయి.✌ భారత్‌లో వేల ఏళ్ల నుంచీ వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. అరటి చెట్లను చాలా పవిత్రంగా చూస్తారు. దీనిలో ప్రతి భాగాన్ని ఉపయోగిస్తారు. పళ్లు, ఆకులు, పువ్వులు, అరటి దవ్వ ఇలా అన్నింటినీ వైద్యంలో ఉపయోగిస్తారు.✌ అరటి పళ్లలో చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. మరోవైపు ఆయుర్వేదంలో భాగంగా మధుమేహ నివారణకు అరటి పువ్వు, దవ్వలను ఉపయోగిస్తుంటారు. అరటి కాండం లోపలి రసాన్ని కీటకాలు కుట్టినప్పుడు, కుష్టు రోగ నివారణలో ఉపయోగిస్తుంటారు.✌రక్తపోటు, నిద్రలేమి లాంటి ఒత్తిడి సంబంధిత వ్యాధుల నివారణలోనూ అరటిని ఉపయోగిస్తారని శ్రీలక్ష్మి చెప్పారు. థలపొథ్తిచిల్‌గా పిలిచే చికిత్సలోను వీటిని ఉపయోగిస్తారు.బౌద్ధ మతంలోని తెరవాద గ్రంథమైన పాలి కేనన్‌లో ప్రస్తావించిన ఏకైక పండు అరటి పండే. వేదాలు, భగవద్గీతలోనూ దీనికి చోటుంది. అరటి, మామిడి, పనసలను ముక్కానిగా తమిళ సంగం రచనల్లో పిలుస్తారు. అరటిని హిందువుల గురువైన బృహస్పతితో పోలుస్తారు.✌ మరోవైపు సంతాన ప్రాప్తికీ అరటి చెట్టుతో సంబంధముందని హిందువులు భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో అరటి చెట్లను గుమ్మానికి రెండు వైపులా కడతారు. పశ్చిమ బెంగాల్‌లో అయితే దుర్గాపూట సమయంలో అరటి చెట్లును దుర్గా మాతగా కొలుస్తారు. ✌ అరటి చెట్లుకు ఎర్ర రంగు అంచు ఉండే పసుపు చీరను కట్టి అమ్మవారిలా ముస్తాబు చేస్తారు. ఈ దేవతను కోలా బవుగా పిలుస్తారు. ఇక్కడ కోలా అంటే అరటి పండు, బవు అంటే మహిళ అని అర్థం.✌అరటి పళ్లు తినడం విషయానికి వస్తే భారత్‌లో చాలా విధానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొందరు పచ్చివి తింటారు. మరికొందరు పళ్లు తింటారు. మట్టి పళహం లాంటి తేలిగ్గా అరిగిపోయే రకాలను పిల్లలకు ఆహారంగా పెడుతుంటారు. మరోవైపు నేంద్రన్, రస్థలి లాంటి ఎక్కువరోజులు నిల్వ ఉండే, నీరు తక్కువగా ఉండే రకాలను వంటల్లో వాడుతుంటారు.✌అరటి వ్యర్థాలతో, అరటి పీచుతో చీరలు కూడా తయారుచేస్తుంటారు.✌ చివరిగా మీకో ప్రశ్న ??
0 Comments