✌ జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ ఈ హరిత టపాసుల ఫార్ములాను తయారు చేసింది.✌ చూడ్డానికి ఇవి మామూలు టపాసులలానే ఉంటాయి. అలానే పేలుతాయి. కానీ, వీటి నుంచి పొగ, శబ్దం తక్కువగా వెలువడతాయి.✌ సాధారణ టపాసులు ఎక్కువ నైట్రోజెన్, సల్ఫర్ వాయువులను విడుదల చేస్తాయి. వాటితో పోలిస్తే హరిత టపాసులు 40-50శాతం తక్కువ వాయువులను విడుదల చేస్తాయి. ✌ ఈ హరిత టపాసుల తయారీ కోసం ప్రత్యేకమైన పదార్థాలను వినియోగిస్తారు. ఈ టపాసుల్లో చాలా రకాలుంటాయి.
1. నీరు విడుదల చేసే టపాసులు: ఇవి పేలితే నీటి బుడగలు విడుదలవుతాయి. వీటిని సేఫ్ వాటర్ రిలీజర్లు అని పిలుస్తారు.2. తక్కువ సల్ఫర్, నైట్రోజెన్ విడుదల చేసే టపాసులు: కాలుష్యాన్ని తగ్గించే ఆక్సిడైజింగ్ పదార్థాలు వీటిలో ఉంటాయి.3. అల్యుమినియం వినియోగం తక్కువ: ఈ హరిత టపాసుల తయారీకి 50-60శాతం తక్కువ అల్యుమినియం వినియోగిస్తారు. వీటిని SAFAL (సేఫ్ మినిమల్ అల్యుమినియం క్రాకర్స్) అని పిలుస్తారు.4. ఆరోమా టపాసులు: ఇవి పేలితే శబ్దంతో పాటు సువాసనలు కూడా వస్తాయి.
✌ కానీ, దేశం లోని అన్ని మార్కెట్లో హరిత టపాసులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ప్రభుత్వం వీటికి అనుమతిస్తుంది. అందుకే అవి విస్తరించడానికి ఇంకాస్త సమయం పడుతుంది.✌ ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ హరిత టపాసుల్ని వినియోగించరు. ✌ ఈ ఆలోచన భారత్లోనే పుట్టిందని, ఇవి వినియోగంలోకి వస్తే ప్రపంచంలో ఓ కొత్త మార్పునకు భారత్ శ్రీకారం చుడుతుందని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ చీఫ్ సైంటిస్ట్ చెప్పారు.
0 Comments