పూజ బిషోని (Pooja Bishnoi)

✌ పూజా బిషోని.
✌ ఈసారి పోటీలో ఎలాగైనా గెలవాలి
✌ 2017లో నిర్వహించిన జోధపూర్‌ మారథాన్‌

✌ఓ చిరుత పిల్ల లాగ తాయారు అయిన ఒక పిల్ల ఇప్పుడు ఒలంపిక్‌ పరుగు పోటీకి సిద్ధమవుతోంది. ఆ పోటీలో బంగారు పతకం సాధించాల్సిందే నంటూ కఠోరశిక్షణ తీసుకుంటోంది. ఆ పిల్లే పూజా బిషోని.
✌ రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌ పూజ స్వస్థలం. 
✌నిరుపేద రైతు కుటుంబంలో పుట్టింది. మూడేళ్ల వయసులో తోటి మగపిల్లలు పరుగుపందెం ఆట ఆడుకుంటుంటే తాను కూడా వారితో పరుగెత్తాలనుకుంది. ఆమె కోరిక నెరవేర్చేందుకు  వారి మామయ్య సర్వాన్‌ సహాయపడ్డాడు. అలా మొదటిసారి మూడేళ్ల వయసులో పరుగుపందెంలో పాల్గొంది పూజ. అయితే ఆ పోటీలో ఓడిపోయింది. 
✌ ఆ ఓటమితో చిన్నబుచ్చుకున్న చిన్నారి 'ఈసారి పోటీలో ఎలాగైనా గెలవాలి. అందుకు నన్ను సిద్ధం చేయండి ' అంటూ మామయ్య దగ్గరికి వెళ్లింది.మేనకోడలు కి  సర్వాన్‌ ఆమెకు శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు పూజ ఒలింపిక్‌ పరుగుపందెం కోసం ఎదురుచూస్తోంది. 
✌తొమ్మిదేళ్లకే పలు పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు పొందింది. 
✌ 2017లో నిర్వహించిన జోధపూర్‌ మారథాన్‌లో 10 కి.మీ దూరాన్ని 48 నిమిషాల్లో పూర్తి చేసింది. 
✌ అప్పుడు పూజకు ఆరేళ్లే. ఆ పోటీల్లో ఆమె పరుగును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత చిన్న వయసులో మృదువైన శరీరం గల పూజ సిక్స్‌ప్యాక్‌ బాడీని కలిగివుండడం ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. చివరిసారి 2019 నవంబరులో ఢిల్లిలో 'స్పోర్ట్యిగో' టోర్నమెంట్‌లో పాల్గొంది. 3 కి.మీ దూరాన్ని 12.50 నిమిషాల వ్యవధిలో పూర్తిచేసి అండర్‌ 14 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. అలాగే వరుసగా 3 వేల మీటర్లు, 15 వందల మీటర్లు, 8 వందల మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకాలు సాధించింది.
✌చిన్న వయసులోనే కఠోర దీక్షలా అభ్యాసం చేస్తోంది. ఉదయం 3 గంటలకే శిక్షణ ప్రారంభమవుతుంది. ఆ శిక్షణ 7 లేక 8 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత స్కూలుకు వెళ్లేది. ఇప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది. ఆ తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ సాయంత్రం శిక్షణకు సిద్ధమైపోతుంది. 'నేను చాలా కఠిన ఆహార నియమాలు పాటిస్తాను. శిక్షణ తీసుకుంటూనే క్లాసులకు హాజరై పరీక్షలకు సిద్ధమవుతున్నాను. రాత్రి 10 గంటలకు నిద్రపోతాను. 2024లో జరిగే యువ ఒలంపిక్స్‌ పోటీల్లో పాల్గొనాలి, బంగారు పతకం సాధించాలన్నదే నా లక్ష్యం' అంటోంది. 
✌లక్ష్యాన్ని సాధించడం కోసం ఇంత చిన్నవయసులోనే ఎన్నో నియమ నిబంధనలను పాటిస్తోంది.


✌ పూజ అమ్మానాన్నా రైతు కూలీలు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. కాని పూజ అభీష్టాన్ని నెరవేర్చేందుకు తమ శక్తికి మించి కష్టపడుతున్నారు. మామయ్య సర్వాన్‌ అథ్లెట్‌. ఆయన 'స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జోథ్‌పూర్‌' సభ్యుడు కూడా.
✌ ఒక యాక్సిడెంట్‌ వల్ల అతనికి గాయాలయ్యాయి. దీంతో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలన్న కోరిక మధ్యంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మేనకోడలి ద్వారా ఆ కలను తీర్చుకోవాలనుకుంటున్నానని చెప్తాడు సర్వాన్‌.

Post a Comment

0 Comments

Close Menu