GHMC మేయర్‌ ఎన్నిక ఎలా జరుగుతుంది ??

✌ ఎక్స్‌అఫీషియో ఓట్లు అంటే ఏమిటి ?

 మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉండచ్చు ?




✌జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికల్లో కార్పొరేటర్లతోపాటు, ఎక్స్‌అఫీషియో సభ్యులను కూడా కలిపి లెక్కిస్తారు.
✌ దీనిప్రకారం హాజరైన మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువమంది మద్దతు ఉన్నపార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకుంటుంది.
✌ కానీ, తాజాగా వెలువడిన గ్రేటర్‌ ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ రెండు పదవుల ఎన్నికపై చర్చ కొనసాగుతున్నది.
✌ వాస్తవంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రత్యేక నిబంధనలను పొందుపర్చారు. కొత్తపాలకవర్గం కొలువుదీరడానికి ముందుగా హైదరాబాద్‌ కలెక్టర్‌ను రిటర్నింగ్‌ అధికారిగా నియమించి.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది.
ఈ క్రమంలోనే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకొనేందుకు అవకాశమిస్తూ రిటర్నింగ్‌ అధికారి మరో నోటిఫికేషన్‌ ఇస్తారు.
గ్రేటర్‌ పరిధిలో ఓటుహక్కు ఉండి, ఇతర ఏ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో ఓటుహక్కును వినియోగించుకోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు.
✌ అనంతరం 150 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలతో కలిపి మేయర్‌ ఎన్నిక కోసం ఓటర్ల జాబితాను రూపొందిస్తారు.
ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు. మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో కనీసం సగం మంది (కోరం) ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లుగా గెలిచినవారు ప్రమాణ స్వీకారం చేశాక ఎన్నిక ప్రక్రియను మొదలుపెడతారు. సమావేశంలో మేయర్‌ అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే, మరొక సభ్యుడు మద్దతు తెలుపాల్సి ఉంటుంది.
కార్పొరేటర్‌గా ఎన్నికైనవారే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు అర్హులు. ఎక్స్‌అఫీషియో సభ్యులకు పోటీచేసే అవకాశం ఉండదు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల కోసం ఏ పార్టీఅయినా తమ అభ్యర్థులను పోటీలో ఉంచవచ్చు.
ఆయాపార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాక.. గుర్తింపుపొందిన పార్టీలు విప్‌లు జారీచేస్తాయి. ప్రత్యేకాధికారి నామినేషన్లవారీగా పోటీలో ఉన్న అభ్యర్థులను పిలిచి చేతులెత్తే విధానంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను నిర్వహిస్తారు.
ఇలా పోటీలోఉన్న ప్రతి అభ్యర్థి ఓట్లను లెక్కించి.. ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉన్నవారిని మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ప్రకటిస్తారు.


✌ ఎక్స్‌అఫీషియో ఓట్లు అంటే ఏమిటి ?


మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నేరుగా ప్రజల ఓట్లతో ఎన్నికైన కార్పొరేటర్లతో (మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు) పాటుగా ఆయా ప్రాంతాలకు చెందిన, ఇతర ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పరోక్షంగా గెలిచిన రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉంటుంది.
ఇందుకోసం వారు ముందుగానే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.అయితే గతంలో వేరే ఏదైనా మున్సిపాలిటీలో ఓటు వేసి ఉంటే మరో చోట పేరు నమోదు చేసుకునే వీలు ఉండదు. అంటే, ఒక ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో రెండు మున్సిపాలిటీలు ఉంటే, ఏదో ఒక చోటే ఎక్స్అషీయోగా తన పేరు నమోదు చేసుకోవచ్చు.
✌ ఎక్స్అఫీషియో సభ్యులను కొన్నిచోట్ల కోఆప్షన్ సభ్యులు అని కూడా అంటారు.

 మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉండచ్చు ?


మేయర్ పదవి దక్కించుకునేందుకు కార్పొరేషన్‌లోని మొత్తం సీట్లలో సగం కన్నా ఎక్కువ దక్కించుకోవాలి. ఉదాహరణకు ఒక చోట 100మంది సభ్యులు ఉంటే, కనీసం 51 ఓట్లు రావాలి.
✌ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 స్థానాలు ఉండగా, వీటికి అదనంగా కొన్ని ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. ఈ ఎక్స్‌అఫీషియో ఓట్లు ఎన్ని అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. 52, 44, 45 ఇలా రకరకాల లెక్కలు ఉన్నాయి.
గ్రేటర్ పరిధిలోని మొత్తం ఎక్స్‌అఫీషియో అర్హత ఉన్న వారి సంఖ్య నుంచి, గతంలో వేర్వేరు మున్సిపాలిటీల్లో ఓట్లు వేసిన వారిని తీసేస్తే ఈ సంఖ్య తేలుతుంది. అందుకు కొంత సమయం పడుతుంది.
ఒకవేళ ఎక్స్‌అఫీషియో ఓట్లు 52 ఉన్నాయి అనుకుంటే, అప్పుడు మేయర్ ఎన్నికలో ఓటు వేసేవారి సంఖ్య 202 అవుతుంది. మేయర్ పీఠం కావాలంటే 102 స్థానాల బలం అవసరం అవుతుంది. దీన్ని మ్యాజిక్ ఫిగర్ అంటారు.
టీఆర్ఎస్ ప్రస్తుతానికి 55 స్థానాలు సంపాదించుకుంది. ఆ పార్టీకి మేయర్ పదవి దక్కించుకోవాలంటే, ఇంకా 47 ఓట్లు అవసరం.ఒకవేళ ఎక్స్‌అఫీషియో ఓట్లు 44 అయితే, అప్పుడు మొత్తం బలం 194గా మారుతుంది. మ్యాజిక్ ఫిగర్ 98 అవుతుంది.
  

Post a Comment

0 Comments

Close Menu