✌ దుస్తులు ఉండగా శరీరాన్ని తాకితే అది లైంగిక వేధింపు అవుతుందా ??

వాస్త‌వానికి ఇది పోక్సో చట్టం కింద మూడేళ్లు శిక్ష పడే నేరం..

 ✌ చట్టం ఏం చెబుతోంది?



✌పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో త‌న‌కు విధించిన శిక్షపై 39 ఏళ్ల వ్యక్తి బాంబే హైకోర్టులో అప్పీల్ చేశాడు.

ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన నాగ్‌పూర్ బెంచ్ నిందితుడికి శిక్ష తగ్గిస్తూ, ఈ సందర్భంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తింది.

బాలికకు ఇష్టం లేకపోయినా, ఆమె దుస్తులు తొలగించకుండా శరీరాన్ని తాకితే అది లైంగిక‌ నేరమెలా అవుతుందని కోర్టు ప్రశ్నించింది.

వాస్త‌వానికి ఇది పోక్సో చట్టం కింద మూడేళ్లు శిక్ష పడే నేరం. భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 354 ప్రకారం ఇది 'ఒక మహిళ శీలాన్ని చెర‌చాల‌నే ఉద్దేశంలో దాడి చేయడం' కిందికి వస్తుంది.ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం దీనికి కనీసం ఒక సంవత్సరం శిక్ష పడుతుంది.

✌ కానీ నాగ్‌పూర్ బెంచ్ మాత్రం దీనిని లైంగిక వేధింపుల నేరంగా పరిగణించలేదు. నిందితుడు బాధితురాలి దుస్తులు తొలగించలేదనే కారణంతో కింది కోర్టు విధించిన శిక్షను ఒక సంవత్సరానికి తగ్గించింది.

✌ అయితే నిపుణులు కోర్టు ఇలా ప్రశ్నించడాన్ని తప్పుబడుతున్నారు. ఎందుకంటే లైంగిక హింసకు సంబంధించిన చట్టాలలో దుస్తుల తొలగింపుపై ఎలాంటి సెక్షన్లు లేవు.

✌ ‘‘నేర విచారణలో బాధితురాలికి దుస్తులు ఉన్నాయా లేవా అన్న అంశాన్ని చట్టం పరిగణించదు. కానీ లైంగికంగా హింసించాలన్న ఉద్దేశాన్ని మాత్రం గుర్తించాలి. చట్టంలో లేని అంశాలను ప్రశ్నించడం బాధితులకు ఆందోళన కలిగించే అంశం’’

✌ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354లో ‘‘ఒక వ్యక్తి ఒక మహిళను చెరచాలనే ఉద్దేశంతో దాడి చేస్తే అలాంటి వ్యక్తికి కనీసం ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు’’ అని ఉంది.

 పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ‘‘లైంగికంగా కలవాన్న ఉద్దేశంతో ఒక మైనర్ జననాంగాలు లేదా ఛాతీని తాకినా, తన జననాంగాలు లేదా ఛాతీని తాకాలని బలవంతం చేసినప్పుడు శారీరక కలయిక జరగనప్పటికీ ఆ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లే ’’ అని పేర్కొంటోంది.

✌ 2012 నుంచి అమలులోకి వచ్చిన పోక్సో చట్టం మైనర్లపై జరిగే లైంగిక దాడులకు నిర్వచనాలు, న్యాయ ప్రక్రియ, శిక్షలను నిర్ణయిస్తుంది.

✌ పోక్సో చట్టంలోని సెక్షన్ 42 ప్రకారం, పిల్లల మీద లైంగిక నేరానికి పాల్పడితే, ఆ నేరంపై అంతకు ముందున్న చట్టాలు పోక్సో చట్టాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, పోక్సో చట్టంలోని నిబంధనల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని పేర్కొంది.

✌ అయితే బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఈ కేసులో పోక్సోకు బదులుగా ఐపీసీ సెక్షన్ 354 ఆధారంగా శిక్షను ఖ‌రారు చేయ‌డం సరైనది తేల్చింది.

✌ పైగా ఈ నేరాన్ని లైంగిక వేధింపులుగా పరిగణించటానికి న్యాయ‌స్థానం నిరాకరించింది.

✌ దుస్తులు ఉండగా శరీరాన్ని తాకితే అది లైంగిక వేధింపు అవుతుందా అన్ని కోర్టు ప్రశ్నించింది

నేర తీవ్రతను గుర్తించే అంశంలో కూడా కోర్టు తీర్పులో లోపాలు కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

✌ ఈ తీర్పులో పేర్కొన్న ప్ర‌కారం నిందితుడు ఓ యువతిని బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె దుస్తులు విప్పకుండానే, ఆమె ఛాతీని తాకే ప్రయత్నం చేశాడు. ఆమె వేసుకున్న సల్వార్ కమీజ్‌ను తొలగించడానికి ప్రయత్నించాడు.

బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో నిందితుడు ఆమె నోటికి త‌న‌ చేతిని అడ్డుపెట్టాడు. ఆపై బయటి నుంచి ఎవరూ రాకుండా తలుపులు మూసేశాడు. అరుపులు విన్న బాధితురాలి తల్లి కూతురిని వెతుక్కుంటూ వచ్చి నిందితుడి నుంచి ఆమెను విడిపించగలిగింది.

నిందితుడు పాల్పడిన ఇలాంటి నేరానికి మూడేళ్లకు పైబడి శిక్ష విధించాలని చట్టం చెబుతుండగా, న్యాయమూర్తి మాత్రం తక్కువ శిక్షతో సరిపెట్టారు.

నేరం తీవ్రత తెలుసుకోవడానికి లైంగిక దాడికి గురైన బాలిక మానసిక స్థితిని కూడా అంచనా వేయాలని ప్రభాత్ కుమార్ గారు తెలిపారు.

‘‘పరిణితి చెందిన మహిళలతో పోలిస్తే పిల్లలలో లైంగిక హింస ప్రభావం భిన్నంగా ఉంటుంది. పెద్దవాళ్లు తమను తాకరానిచోట తాకారన్న భావన వారిని మానసికంగా ఇబ్బంది పెడుతుంది’’ అన్నారు ప్రభాత్ కుమార్ (ఎన్జీవో 'సేవ్ ది చిల్డ్రన్' పిల్లల రక్షణ విభాగం అధిపతి)

2012లో నిర్భయ అత్యాచారంతోపాటు, అంతకు ముందు అనే దశాబ్దాలుగా మహిళా ఉద్య‌మ‌కారుల‌ పోరాటంతో లైంగిక హింస‌ చట్టంలో అనేక మార్పులు వచ్చాయి.

✌ హింసకు నిర్వచనంతోపాటు బాధితురాలికి అనుకూలంగా ఉండేలా చట్టాలలో అనేక మార్పులు చేశారు. శిక్షలు కఠినం అయ్యాయి.

కనీస శిక్షలు ఈ చట్టాల వల్ల కలిగే లాభాలను దెబ్బతీస్తున్నాయని న్యాయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

నేరస్తుడి నేపథ్యాన్ని కాకుండా నేర స్వభావాన్ని కోర్టులు పరిగణించాలని నిపుణులు అంటున్నారు.

 

Post a Comment

0 Comments

Close Menu