✌ కోవిడ్-19 వ్యాక్సీన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి?
✌ భారత్‌లో జనవరి 16 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్ మొదలవుతుంది.
✌ మొదట విడత టీకా ఎవరెవరికి.. ఎంతమందికి వేస్తారు?
✌ రెండో దశలో టీకా ఎవరికి వేస్తారు?
✌ భారత్‌లో రెండో డ్రై రన్ జనవరి 8న జరిగింది. దీని ప్రకారం దేశంలోని అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ రిహార్సల్స్ ప్రక్రియ పూర్తయింది.
✌ మొదట విడత టీకా ఎవరెవరికి.. ఎంతమందికి వేస్తారు?
✌నిర్ధరిత ప్రొటోకాల్ ప్రకారం మొదట టీకాను హెల్త్ కేర్ సిబ్బందికి అంటే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, ఆరోగ్య సేవలకు సంబంధించిన వారికి వేస్తారు.
దేశంలో వీరి సంఖ్య 80 లక్షలకు పైనే ఉంటుందని చెబుతున్నారు.
✌ రెండో దశలో టీకా ఎవరికి వేస్తారు?
✌ తర్వాత దశలో సుమారు రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు అంటే రాష్ట్రాల పోలీసులు, పారామిలిటరీ దళాలు, శానిటేషన్ సిబ్బందికి టీకా వేస్తారు.
అదే సమయంలో 50 ఏళ్లు పైబడినవారు, లేదా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న దాదాపు 27 కోట్ల మంది డేటా సేకరిస్తారు.కరోనా లక్షణాలు ఉన్న 50 ఏళ్ల లోపు వారికి కూడా టీకా వేస్తారు.
✌ టీకా మీకు సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర్‌కు ఎలా చేరుతుంది
✌ వ్యాక్సీన్‌ను మొదట తయారైన చోటు నుంచి దేశంలోని నాలుగు పెద్ద కోల్డ్ స్టోరేజీ కేంద్రాలకు చేర్చాలని, అక్కడ నుంచి వాటిని రాష్ట్రాల నియంత్రణలో ఉన్న 37 కేంద్రాలకు పంపించాలని కేంద్రం ప్లాన్ చేసింది.
✌ ఆ తర్వాత వ్యాక్సీన్ కంటైనర్లను జిల్లా స్థాయిలో స్టోరేజీ కోసం పంపిస్తారు.నగరాల నుంచీ పల్లెల వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో సుమారు నాలుగు లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు చెబుతున్నారు.
✌ 18 ఏళ్ల లోపు వారికి వేస్తారా ?
✌భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సీన్(కోవాగ్జిన్)కు 12 ఏళ్లు పైబడిన పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతి లభించింది.
ఈ వ్యాక్సీన్‌ను 18 ఏళ్ల లోపు యువతకు కూడా క్లినికల్ ట్రయల్ మోడ్‌గా ఉపయోగించడానికి కూడా భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చింది.
ఈ మోడ్ ప్రకారం ఎవరికి టీకా వేస్తారో వారి ఆరోగ్య లక్షణాలను నిరంతరం మానిటరింగ్ చేస్తుంటారు.
✌ కోవిడ్ వ్యాక్సీన్ ధర ఎంత
✌ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కొన్ని రోజుల క్రితం ప్రజలకు యాంటీ-వ్యాక్సీన్ వదంతులను పట్టించుకోవద్దని కోరారు. వ్యాక్సీన్ అందరికీ ఉచితంగా అందిస్తామని తెలిపారు. అయితే, ఆ తర్వాత వ్యాక్సీన్ ధర, దానిని ఉచితంగా అందించడం గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు.
✌ అంతకు ముందు వ్యాక్సీన్ ధరల గురించి మాట్లాడిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆధార్ పునావాలా ప్రభుత్వానికి ఒక డోస్ ధర 200 నుంచి 300 పడుతుందని చెప్పారు.అంటే, సహచర కంపెనీ ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అంతర్జాతీయ మార్కెట్లో ఈ టీకాను ఏ ధరకు(ఒక డోస్ 3 డాలర్లు) ఇస్తోందో, సీరం తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కూడా అదే ధరకు భారత ప్రభుత్వానికి అందిస్తున్నరు.
✌ దేశంలో కరోనా వ్యాక్సీన్ ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే అక్కడ ఈ ధర రెట్టింపు ఉండవచ్చు.
అమెరికా సహా ప్రపంచంలోని మిగతా చాలా దేశాల్లో కరోనా టీకా అందిస్తున్న ఫైజర్ కంపెనీ సీఈఓ కొన్ని రోజుల క్రితం "మా వ్యాక్సీన్ ధర అభివృద్ధి చెందిన దేశాలకు, మధ్య ఆదాయ దేశాలకు, ఆఫ్రికా లాంటి అల్పాదాయ దేశాలకు తగినట్లు మూడు రకాలుగా ఉంటుంది" అన్నారు.
✌ కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఎప్పటి నుంచి వేస్తారు
✌ కేంద్రం జనవరి 16 నుంచి టీకా వేయడం ప్రారంభిస్తుంది.
✌ 2021 జులై నాటికి 30 కోట్ల మందికి కోవిడ్ టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంగా చెబుతున్నారు.
✌ భారత ఔషధ నియంత్రణ మండలి జనవరి 3న దేశంలో కోవిడ్ వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది.
✌ రాయిటర్స్ వివరాల ప్రకారం ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా దాదాపు 29 వేల కోల్డ్ స్టోరేజీలను సిద్ధం చేసింది.
✌ కోవిడ్-19 వ్యాక్సీన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి?
✌ వ్యాక్సీన్ కోసం అందరూ భారత ప్రభుత్వం జారీ చేసిన కో-విన్ డాట్ ఇన్(CoWIN App)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
✌ రిజిస్టర్ చేసుకోనివారికి వ్యాక్సీన్ వేయరు.
✌ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో వ్యాక్సీన్ వేసే సమయం, తేదీ, కేంద్రం వివరాలు ఉంటాయి.
✌ రిజిస్ట్రేషన్ కోసం ఏఏ గుర్తింపు కార్డులు ఇవ్వొచ్చు?
✌ రిజిస్ట్రేషన్ కోసం మీరు ఏదైనా మీ ఫొటో ఐడీ కార్డు యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
వాటిలో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, మన్రేగా జాబ్ కార్డ్, లేదా పోస్టాఫీస్ ఖాతా పాస్‌బుక్, MP/MLA/MLC జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డ్, పెన్షన్ కార్డు, ఎంప్లాయర్ జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా వోటర్ ఐడీ కార్డ్ ఇవ్వవచ్చు.
✌టీకా వేయించుకునే రోజున గుర్తింపు కార్డు తీసుకెళ్లాలా?
✌ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ ఐడీని మీరు రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేస్తారో టీకా వేయించుకునే సమయంలో దానినే తీసుకెళ్లాలి.
✌ వేరే ఐడీతో వెళ్తే టీకా వేయరు.
✌ ఎందుకంటే వ్యాక్సీన్ రెండు డోసులు రెండు దశల్లో వేయనున్నారు.
✌ తర్వాత టీకా వేసుకోవాల్సిన తేదీని ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు.
✌ కోవిషీల్డ్, కోవాగ్జిన్ ప్రభావం ఎలా ఉంటుంది
✌ ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను భారత్ కంటే ముందు బ్రిటన్, అర్జెంటీనా, ఎల్ సాల్వెడార్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చారు. భారత్‌లో ఈ వ్యాక్సీన్ తయారీ పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 'కోవిషీల్డ్' పేరుతో చేసింది.
✌ ఈ వ్యాక్సీన్‌ను కామన్ కోల్డ్ ఎడెనోవైరస్ ద్వారా అభివృద్ధి చేశారు.
చింపాజీలకు సంక్రమించే ఈ వైరస్‌ను మనుషుల్లో వ్యాపించకుండా మార్పులు చేశారు.
✌ ఈ టీకాను 18 ఏళ్లు, అంతకు పైబడిన 23,745 మందిపై పరీక్షించారు.
✌ మరోవైపు, కోవాగ్జిన్‌ను ఐసీఎంఆర్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంయుక్తంగా తయారు చేశాయి.
✌ దీనిని జనాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా, మృత కరోనా వైరస్‌ను ఉపయోగించి అభివృద్ధి చేశారు.
✌ నిపుణుల వివరాల ప్రకారం ఈ వ్యాక్సీన్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కరోనా వ్యాపించకుండా యాంటీబాడీస్ వృద్ధి చేస్తుంది.
✌ వ్యాక్సీన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా
✌కరోనాతో పోరాడ్డానికి ఇప్పటివరకూ తయారైన అన్ని వ్యాక్సీన్ల భద్రత సంబంధిత రిపోర్టులు బాగానే ఉన్నాయని చాలామంది నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
✌వ్యాక్సినేషన్ వల్ల సాధారణ జ్వరం రావచ్చు, లేదా తలనొప్పి, ఇంజెక్షన్ వేసుకున్న చోట నొప్పి లాంటివి ఉండచ్చు.
✌ ఎవరిలో అయినా వ్యాక్సీన్ 50 శాతం వరకూ ప్రభావం చూపిస్తే, వారికి టీకా సక్సెస్ అయినట్టే భావిస్తారని డాక్టర్లు చెబుతున్నారు.
✌వ్యాక్సీన్ వేయించుకున్న వ్యక్తి తన ఆరోగ్య పరిస్థితిలో వచ్చే చిన్న మార్పులను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఎలాంటి తేడా కనిపించినా వెంటనే డాక్టర్‌కు చెప్పాలి అంటున్నారు.
✌ భారత్‌లో ఏ వ్యాక్సీన్లు ఇస్తున్నారు
✌ భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కోవిడ్-19 చికిత్స కోసం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు అత్యవసర అనుమతులు ఇచ్చింది.
✌ కోవిషీల్డ్ నిజానికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ భారత వెర్షన్. కోవాగ్జిన్ పూర్తిగా భారత్‌లో తయారైన వ్యాక్సిన్. అందుకే దీనిని 'స్వదేశీ వ్యాక్సీన్' అంటున్నారు.
✌కోవిషీల్డ్‌ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ తయారు చేసింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ కంపెనీ, ఐసీఎంఆర్తో కలిసి తయారుచేసింది.
✌ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత ఏడాది డిసెంబర్‌లో దేశంలో 8 కరోనా వ్యాక్సీన్లు తయారవుతున్నాయని చెప్పింది. అవి క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయని తెలిపింది.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ తర్వాత భారత్‌లో తయారవుతున్న వ్యాక్సీన్లు ఇవే:
ZyCoV-D :
✌ డీఎన్ఏ ప్లాట్‌ఫాంపై కాడిలా ఈ వ్యాక్సీన్ తయారు చేస్తోంది. దీని కోసం కాడిలా బయోటెక్నాలజీ విభాగంతో కలిసి పనిచేస్తోంది. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
స్పుత్నిక్-వి:
✌ఈ వ్యాక్సీన్‌ను రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్ తయారుచేసింది. హ్యూమన్ ఎడెనోవైరస్ ప్లాట్‌ఫాంపై దీనిని రూపొందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో దీనిని భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాక్సీన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకుంది.
NVX-CoV2373:
✌వైరస్ ప్రొటీన్ ముక్కల ఆధారంగా తయారైన ఈ వైరస్‌ను పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఇన్‌స్టిట్యూట్ దీనికోసం నోవావ్యాక్స్ తో కలిసి పనిచేస్తోంది.
ప్రొటీన్ యాంటీజెన్ బెస్ట్:
✌అమెరికా ఎంఐటీ తయారు చేసిన ప్రొటీన్ యాంటీజెన్ బెస్ట్ వ్యాక్సీన్ ఉత్పత్తి హైదరాబాద్ బయోలాజికల్ ఈ-లిమిటెడ్ చేస్తోంది. దీని మొదటి, రెండో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ మొదలవబోతున్నాయి.
HGCO 19:
✌అమెరికా హెచ్‌డీటీ ఎంఆర్ఎన్ఏ ఆధారిత ఈ వ్యాక్సీన్ ఉత్పత్తిని పుణెలోని జినోవా అనే కంపెనీ చేస్తోంది. జంతువులపై ఈ టీకా ప్రయోగాలు పూర్తయ్యాయి. త్వరలో దీని మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించబోతున్నారు.
భారత్ బయోటెక్, థామస్ జెఫర్సన్ టీకా
✌హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అమెరికా థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ సహకారంతో మృత రేబిస్ వెక్టర్ ప్లాట్‌ఫాం ఆధారంగా కరోనా వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా అడ్వాన్సడ్ ప్రీ-క్లినికల్ స్థాయి వరకూ వచ్చింది.
అరబిందో ఫార్మా టీకా
✌అమెరికా ఆరోవ్యాక్సీన్‌తో కలిసి భారత్‌కు చెందిన అరబిందో ఫార్మా ఒక టీకా తయారు చేస్తోంది. అది ప్రస్తుతం ప్రీ-డెవలప్‌మెంట్ దశలో ఉంది.
0 Comments