✌ దేశంలో కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలా ? లేదా?

 ✌ పంచాయితీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ జీఓ నంబరు 693ని జారీ చేసింది
✌ రూ.500 జరిమానా వేస్తారు..
✌ 10 రోజుల్లోగా వాటిని రెన్యువల్ చేసుకోవాలి.


✌ఇటివల ఆంధ్రప్రదేశ్‌లో కుక్కలకు, పందులకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ పంచాయితీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ జీఓ నంబరు 693ని జారీ చేసింది.
✌లైసెన్స్ లేని కుక్కలను, పందులను అధికారులు పట్టుకుంటే వాటిని పెంచుకుంటున్నవారికి రూ.500 జరిమానా వేస్తారు.
✌లైసెన్స్ గడువు ముగిసిన 10 రోజుల్లోగా వాటిని రెన్యువల్ చేసుకోవాలి. లేకపోతే రోజుకు రూ.250 అపరాధరుసుం అదనంగా చెల్లించాలి. లైసెన్స్ కావాలంటే కుక్కలకు, పందులకు ముందుగా హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి.
✌ గ్రామాల్లో తిరిగే వీధి కుక్కలు, పందులను గుర్తించి బహిరంగ నోటీసులు జారీ చేయాలని కూడా పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

✌అలాగే లైసెన్సు తీసుకోకుండా కుక్కలు, పందులను పెంచినా... లైసెన్స్ ఉంది కదా అని జంతువులను బయట వదిలేసినా... జరిమానా విధించాలనిఆదేశించింది.
అలాగే వాటిని పట్టుకున్న సమయంలో తమవని ఎవరూ ముందుకు రాకపోతే వీధి కుక్కలుగా, వీధుల్లో తిరిగే పందులుగా పరిగణించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చెయ్యాలని పేర్కొన్నారు.
✌ పంచాయతీల పరిధిలో కుక్కలు, పందులను పెంచుకుంటున్న ప్రతి ఒక్కరూ విధిగా ఆ ప్రాంత వెటర్నరీ వైద్యుడిచ్చే సర్టిఫికెట్లను సమర్పించాలి. వాటిని పరిశీలించి ఉచితంగానైనా...నిర్దిష్ట మొత్తాలను కట్టించుకునైనా లైసెన్స్‌లను పంచాయతీ మంజూరు చేస్తుంది. బిళ్లల రూపంలోనో, బ్యాడ్జీల రూపంలోనే ఉండే ఆ లైసెన్సులను జంతువుల మెడలో కానీ, చెవులపై కానీ ఉండేలా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి.
✌ గ్రామంలోకి పందులు రాకుండా పంచాయతీకి దూరంలో వాటి కోసం కొన్ని ప్రదేశాలను ఏర్పాటుచేయాలి.
అక్కడే పందుల పెంపకం జరిగేటట్లు చూడాలి. ఈ లైసెన్స్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కమిటీని నియమించాలి.
ఈ కమిటీలో సర్పంచ్ కమిటీ చైర్ పర్సన్‌గా, గ్రామ కార్యదర్శి కన్వనీర్‌గా, పంచాయతీ సెక్రటరీ, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, మండల పశుసంవర్ధక శాఖ అధికారి, గ్రామ పశుసంవర్ధక శాఖ సహాయకుడు, జిల్లా SPCA (Society for the Prevention of Cruelty to Animals) నామినేట్ చేసిన సభ్యులు, జంతు సంరక్షణ సంస్థల నుంచి ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు.

👉 అసలు ఒక జీఓ ఎందుకు
?

గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయితీ రాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇకపై కుక్కలను, పందులను పెంచుకోవాలంటే గ్రామ పంచాయతీల్లో లైసెన్సు తీసుకోవడం వలన వాటి లెక్కలు తెలుస్తాయి.
నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా కుక్కలను పెంచుకోవడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది.గొర్రెలు, మేకలు వంటి వాటి కాపలాకు కూడా కుక్కలను పెంచుతుంటారు.
ఇకపై పంచాయతీ జారీచేసే లైసెన్స్‌లను కుక్కలు, పందులకు తగిలించాలి.
✌ దీని వలన ఏది సురక్షితమైనదనే విషయం కూడా తెలుస్తుందని పంచాయితీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జీఓలో తెలిపారు."అయితే ఈ జీఓని పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ జారీ చేసింది కాబట్టి ఇది మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వర్తించదు.దానికి మున్సిపల్ శాఖ నుంచి వేరే జీఓ రావాలి. వచ్చినప్పుడు దానికి తగినట్లుగా చర్యలు చేపడతాం" అని జీవీఎంసీ కమిషనర్ చెప్పారు.
✌ ఆంధ్రప్రదేశ్‌లో కుక్కల దాడులు విపరీతంగా జరిగాయి. కొన్ని సంఘటనల్లో కొందరి ప్రాణాలు కూడా పోయాయి.
✌ ఇంటి వద్ద ఆడుకుంటున్న పసిపిల్లలను కుక్కలు పీక్కుతిన్న సంఘటనలు విశాఖ, కర్నూలు, విజయవాడలో జరిగాయి.
అలాగే విశాఖలో జరిగిన మరో ఘటనలో కుక్కలు ఒక్కసారిగా మీదకు దూకడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ముగ్గురు భవన నిర్మాణకార్మికులు భవనంపై నుంచి దూకడంతో వారిలో ఇద్దరి ప్రాణాలు పోయాయి.ఇక నెల్లూరులో రోడ్డుపై వెళ్తున్న మహిళపై రెండు పందులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.కుక్కలు, పందులు స్వేచ్ఛగా రోడ్లపై సంచరిండం కూడా అనేక సమస్యలను తీసుకొస్తుంది. అవి రోడ్లపై మల విసర్జన చేస్తుంటాయి.
వేసవిలో అయితే అవి ఎండిపోయిన తరువాత గాలిలో దూళి కణాల రూపంలో కలిసిపోతాయి. అలాగే వర్షకాలంలో అయితే విసర్జకాలు నీటిలో కలిసిపోతాయి. కంటికి కనబడనంత సూక్ష్మ రేణువులు రోడ్లపై అమ్మే తినుబండరాలపై పడుతుంటాయి. అలాంటి రేణువులు పరిసరాలను కలుషితం చేస్తాయి. కలుషితమైన గాలి పీల్చడం, బయట తినుబండరాలు తినడం వల్ల వ్యాధులు వస్తాయి.
చిన్న పిల్లలు, వృద్దుల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండడం వల్ల అలాంటి రేణువులతో ఫ్లూ, మెదడువాపు వ్యాధులు వస్తాయి.
దేశంలో కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలా?, లేదా? అనేది ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకోవాల్సిందేనని...కేంద్ర స్థాయిలో ఒక చట్టమంటూ ఏదీ లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్పారు.
మన రాష్ట్రంలో పందులు, కుక్కల లెక్కలు పూర్తి స్థాయిలో లేవు. వాటిని లెక్కించడం కూడా కష్టమే.కేవలం స్టైరిలైజేషన్, టీకాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాటి వివరాలే ఉంటాయి. అవే వీటి గణనకు ఆధారం. అందుకే కుక్కలు, పందుల లెక్కలు కచ్చితంగా చెప్పలేం.
✌ అయితే కేంద్రం చేపట్టిన 19వ పశు గణన లెక్కల ప్రకారం ఏపీలో కుక్కల సంఖ్య 1,22,106. ఆ తరువాత మళ్లీ కుక్కల లెక్కలు అధికారికంగా కేంద్రం, ఇటు రాష్ట్రం చేసిన దాఖలాలు లేవు. 20వ పశు గణన లెక్కల ప్రకారం ఏపీలో 1,46,045 పందులున్నాయి.
✌ వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,18,540ఉండగా....పట్టణ ప్రాంతాల్లో 27,502 ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ రెండు లెక్కలు వాస్తవానికి అమడ దూరంలో ఉన్నాయి అని పశుసంవర్థక శాఖలోని పిగ్గరీ డెవలప్‌మెంట్ విభాగం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు లక్షలకుపైగా కుక్కలు, ఆరు లక్షల వరకు పందులు ఉంటాయని అనధికార లెక్కలు ద్వారా తెలుస్తుంది.పైగా సుప్రీంకోర్టు తీర్పు వలన కుక్కలను స్టెరిలైజేషన్ చేయడమే కానీ...చంపడానికి వీలు లేదు.
✌ దాంతో కుక్కల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోనే 1,76,873 వీధి కుక్కలున్నాయని ఒక అంచనా.ప్రస్తుతం నగరాల్లో ఉన్న పెంపుడు కుక్కల్లో లైసెన్సు తీసుకుని పెంచుకుంటున్నవి 10 శాతానికి మించి ఉండవు.
ఇక పట్ణణాలు, పల్లెల్లో అరశాతమైనా అలాంటివి ఉంటాయో, లేదో అన్నది అనుమానామే. పందుల సంగతైతే అడగక్కరలేదు..
✌ ఇప్పుడు పట్టణాలు, గ్రామాల్లో కూడా కుక్కలని ఎక్కువగానే పెంచుతున్నారు. అయితే వాటికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తేనే, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడో వాటిని వీధుల్లోకి వదిలేస్తుంటారు.
✌ ఇది వీధికుక్కల లెక్కల్లో చేరిపోతాయి. వీటిని పట్టుకున్నప్పుడు ఒక వీధిలో పట్టుకుని...మరో వీధిలో వదిలేస్తుంటారు.దీని వలన కూడా ఎన్ని సార్లు గణన చేసినా కచ్చితమైన డేటా రాదు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పందుల పెంపకం దారులు ఉంటారు. వారు ఇంత వరకూ పందులకు లైసెన్సులు తీసుకోవడం లేదు.పెంపుడు కుక్కలకు కొన్ని చోట్ల ట్యాగింగ్ సిస్టమ్ లాంటివి ఉన్నాయి. కానీ ఎవరూ లైసెన్సులు తీసుకుంటున్న దాఖలాలు లేవు. నగరాలు, పట్టణాల్లో ఈ తరహా నిబంధనలు కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ, పంచాయితీల్లో దీనిని ఎలా అమలు చేస్తారు? అన్నది ప్రశ్నార్ధకమే ?
✌ కొంతమంది పిల్లుల్ని, పక్షుల్ని కూడా పెంచుతారు. ఇళ్లలో కోళ్లు పెంచుతుంటాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో, దైవ క్షేత్రాల్లో కనిపించే కోతుల పరిస్థితేంటి 
వాటికి కూడా రాబోయే రోజుల్లో లైసెన్సులు తప్పవా? అన్న సందేహం లేకపోలేదు 
✌ ప్రభుత్వం ఈ జీఓని ఆదాయం కోసమే తీసుకొచ్చినా...మంచి కూడా జరుగుతుంది. కనీసం కుక్కలు, పందుల లెక్కలైనా కనీసం తెలుస్తాయి.
పందుల పెంపకం కొందరి కులవృత్తి. వారికి తగిన విధంగా ప్రత్యామ్నాయం చూపించి, అవగాహన కల్పించి అప్పుడు లైసెన్స్ విధానం తీసుకురావాలి. వీధి కుక్కులకు ఎవరు లైసెన్స్ తీస్తారు? వాటిని ఏ లెక్కలోకి తీసుకుంటారు? కుక్కలని గ్రామ సింహాలంటారు. అవే గ్రామాలకు రక్షణ కల్పిస్తాయి. గ్రామంలోకి దొంగలు, కొత్త వ్యక్తులు వచ్చినా అవే రక్షణ కల్పిస్తాయి. అటువంటి వాటిని లైసెన్స్ లేదని తీసుకుపోయి చంపేయడమో, మరొక చోటుకి తరలించడమో చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా ? డబ్బుల కోసం పిచ్చి ఆలోచనలు చేస్తూ ప్రజలను ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది అని కొందరు వ్యక్తం చేసారు.


Post a Comment

0 Comments

Close Menu