👉చంద్ర గ్రహానికి సంబంధించిన ఓయిడ్ ఆవ్లిటిస్ 001 ఉల్క .. డాన్‌‌విల్హెల్మ్‌సైట్

 👉చంద్ర గ్రహానికి సంబంధించిన ఓయిడ్ ఆవ్లిటిస్ 001 ఉల్క .. డాన్‌‌విల్హెల్మ్‌సైట్

  • ఏమిటి : ఓయిడ్ ఆవ్లిటిస్ 001 ఉల్క .. డాన్‌‌విల్హెల్మ్‌సైట్
  • ఎప్పుడు : 2014లో దొరికింది
  • ఎవరు : యూరోపియన్ పరిశోధకుల బృందం
  • ఎక్కడ : సహారా ఎడారిలో
  • ఎందుకు : మాంటిల్‌లో జరిగే చర్యల గురించి అవగాహన


👉
చంద్ర గ్రహానికి సంబంధించిన ఓయిడ్ ఆవ్లిటిస్ 001 ఉల్కలో యూరోపియన్ పరిశోధకుల బృందం ఒక కొత్త ఖనిజాన్ని కనిపెట్టింది.

👉 అధిక ఒత్తిడి ద్వారా ఏర్పడిన ఈ ఖనిజానికి డాన్‌‌విల్హెల్మ్‌సైట్ అని పేరు పెట్టారు.

👉 చంద్రుని నుండి రాళ్ల నమూనాను మొదటిసారి భూమ్మీదికి తీసుకొచ్చిన అపోలో స్పేస్ మిషన్స్‌లో సేవ చేసిన అమెరికన్ సైంటిస్ట్ డాన్ విల్హెల్మస్ జ్ఞాపకార్థం.. ఈ ఖనిజానికి ఆ పేరు పెట్టారు.

👉ఈ కొత్త ఖనిజాన్ని లోతుగా అధ్యయనం చేయడం వల్ల భూఅంతర్భాగంలోని మాంటిల్‌లో జరిగే చర్యల గురించి అవగాహన కలిగే అవకాశం ఉందని అమెరికన్ మినరాలజిస్ట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు.

👉 ఈ ఖనిజంలో కాల్షియం, అల్యూమినియం, సిలికాన్, ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఉన్నాయని తెలిపారు.

👉 ఈ ఓయిడ్ ఆవ్లిటిస్ 001 ఉల్క, పశ్చిమ సహారా ఎడారిలో 2014లో దొరికింది.

👉ఈ ఉల్క పైభాగంలో ఉన్న ఖనిజ సమ్మేళనాలు, భూమ్మీద రాళ్లలో దాగున్న ఖనిజాలతో సరిపోలాయని, కానీ లోతుకు వెళ్లే కొద్దీ వాటి సమ్మేళనం మారిందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 

👉దీన్ని బట్టి భూఉపరితలం మీది రాళ్లతో పోలిస్తే, భూఅంతర్భాగంలోని రాళ్లకు సంబంధించి ఖనిజ సమ్మేళనాల్లో చాలా వైరుధ్యాలు ఉంటాయని వెల్లడైంది. 

👉 అందుకే ఈ ఉల్కలోని కొత్త ఖనిజాన్ని లోతుగా అధ్యయనం చేయడం వల్ల దాదాపుగా భూఅంతర్భాగం గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయని పరిశోధకులు ఆశాభావం తెలుపుతున్నారు.

👉చంద్రుడు, భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం.  

👉భూమి నుండి చంద్రునికి రమారమి 3,84,403 కిలోమీటర్ల దూరముంటుంది.

👉 సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. 

👉ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ 

  • భూమికి దూరం: 384,400 km
  • గురుత్వాకర్షణ: 1.62 m/s²
  • కక్ష్య కాలం: 27 రోజులు
  • వ్యాసార్థం: 1,737.1 km
  • వయస్సు: 4.53E9 సంవత్సరాలు
  • ప్రత్యామ్నాయ పేర్లు: Luna; Selene (poetic); Cynthia (poetic)

Post a Comment

0 Comments

Close Menu