✌ ఫిబ్రవరి 9 ప్రపంచ పిజ్జా దినోత్సవం.

 ✌  ఓ లాటిన్‌ కథలో పిజ్జా ప్రస్తావన 



✌  పిజ్జా అనేది ఇటాలియన్ మూలం యొక్క రుచికరమైన వంటకం, ఇది టమోటాలు, జున్ను మరియు తరచూ అనేక ఇతర పదార్ధాలతో అగ్రస్థానంలో ఉన్న పులియబెట్టిన గోధుమ-ఆధారిత పిండి యొక్క గుండ్రని, చదునైన బేస్ కలిగి ఉంటుంది, తరువాత అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చబడుతుంది, సాంప్రదాయకంగా చెక్కతో కాల్చిన ఓవెన్లో .

✌  పదో శతాబ్దానికి చెందిన ఓ లాటిన్‌ కథలో పిజ్జా ప్రస్తావన ఉంది.

✌  ఈ కథ దక్షిణ ఇటలీ ప్రాంతంలోని గాయిటా పట్టణానికి సంబంధించినది. 

✌  అయితే రిపోర్టుల ప్రకారం 1500వ సంవత్సరంలో పిజ్జాను కనుగొన్నారు. చవుకగా లభించే ఈ పిజ్జాను నేపుల్స్‌కు చెందిన దిగువ తరగతి ప్రజలు వండుకుని తినేవారు.

✌  చీజ్‌కు తోడు టమోటా ముక్కలు పిజ్జా రొట్టెపై టాపింగ్‌ చేసుకుని వారు ఆరగించేవారు.  

✌  18వ శతాబ్దం చివర్లో నేపుల్స్‌లోని పోర్ట్‌ అలబాలో ఓ పిజా షాప్‌ తెరిచినట్లు రికార్డులు చెబుతున్నాయి.  

✌ పిజ్జాలు తొలుత చతురస్రాకారంలో ఉండేవట. తర్వాత అవి గుండ్రటి ఆకారంలోకి మారాయి. పిజ్జాను తయారు చేసేవారిని ఇటాలియన్‌లో పిజ్జాయిలో అంటారట. 

✌  రెండో ప్రపంచ యుద్ధ కాలం వరకూ అమెరికన్లను పిజ్జా గురించి తెలియదు. ఆ యుద్ధంలో పాల్గొన్న అమెరికా సిపాయిలు పిజ్జా టేస్ట్‌కు ఫిదా అయి.. ఆ వంటకాన్ని అమెరికాకు తెచ్చారు

✌  ఆ తర్వాత అది అమెరికన్లకు ప్రీతిపాత్రమైంది.  

✌ ప్రపంచంలో అన్ని చోట్లా బేక్‌ చేసిన పిజ్జా లభిస్తుంది. అయితే స్కాట్లాండ్‌లో మాత్రం డీప్‌ ఫ్రై పిజ్జా దొరుకుతుంది.       

✌ వ్యోమగాముల ఫుడ్‌ కోసం నాసా తయారు చేసిన 3డి ప్రింటర్‌లో పిజ్జాకు కూడా చోటు దక్కింది.  

✌ చవకగా దొరికే పిజ్జాలతో పాటు అత్యంత ఖరీదైనవి కూడా దొరుకుతాయి. ఇప్పటి వరకూ అత్యంత ఖరీదైన పిజ్జా ధర రూ. 7,93,880గా ఉంది.  

✌  2013లో డోమినోస్‌ రూపొందించిన డీవీడీ.. పిజ్జా వాసన రావడం విశేషం 

✌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పిజ్జాను తయారు చేసేదిగా పేరున్న డోమినోస్‌కు మూడు పెద్ద పిజ్జాలను చేయడానికి కేవలం 47.56 సెకన్లు మాత్రమే పడుతుందట.  

✌ ఓ అధ్యయనం ప్రకారం వారానికి ఓ పిజ్జాను తిన్న వారికి కేన్సర్‌ సోకే అవకాశం తక్కువగా ఉంటుందట. 

✌ కొత్త సంవత్సరం రోజు నిమిషానికి 4100 పిజ్జా ఆర్డర్లు వచ్చాయని జొమాటో సీఈవో దీపీందర్‌ గొయెల్‌ చెప్పడాన్ని బట్టి చూస్తే భారత్‌లో కూడా పిజ్జాకు ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది.



Post a Comment

0 Comments

Close Menu