ఆంధ్రప్రదేశ్ లో గాడిదలను గాలికొదిలేశారు ....

 👉 ఆవు పాలుగేదే పాలుమేక పాల కంటే గాడిద పాలకు ఎక్కువ ధర పలుకుతోంది

  • ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో బాగా డిమాండ్‌ ఉన్న జంతువుల్లో గాడిద కూడ చేరింది
  • ఎప్పుడు : ఇటివల  
  • ఎవరు : గాడిద
  • ఎక్కడ : తెలుగు రాష్ట్రాలలో   
  • ఎందుకు : శారీరక దారుఢ్యానికి గాడిద పాలు, లైంగిక సామర్థ్యం కోసం దాని మాంసం తినడం వలన

 


👉 ఆంధ్రప్రదేశ్‌లో బాగా డిమాండ్‌ ఉన్న జంతువుల్లో గాడిద కూడ చేరింది. ఆవు పాలు, గేదే పాలు, మేక పాల కంటే గాడిద పాలకు ఎక్కువ ధర పలుకుతోంది. చికెన్, మటన్‌తో పాటు గాడిద మాంసానికీ గిరాకీ ఎక్కువైపోయింది.

👉శారీరక దారుఢ్యానికి గాడిద పాలు, లైంగిక సామర్థ్యం కోసం దాని మాంసం తింటున్నామని ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చాలామంది చెబుతున్నారు.

👉అయితే, గాడిద పాలు ఆరోగ్యానికి మంచిదేగానీ, దాని మాంసం లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వైద్య నిపుణులు తెలిపారు.

👉ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గాడిద మాంసం, పాలకు డిమాండ్ చాలా పెరిగింది.

👉దీంతో గాడిదల అక్రమ రవాణా కూడా ఎక్కువైపోయిందని కాకినాడ కేంద్రంగా పనిచేసే యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ స్వచ్చంధ సంస్థ చెప్పింది.

👉గాడిద మాంసం తింటే సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుందని, దాని పాలు తాగితే జబ్బులు నయమవుతాయనే నమ్మకం ప్రజల్లో చాలా కాలంగా ఉందని. ఇటీవల అది మరింత పెరిగిందని యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ స్వచ్చంధ సంస్థ  సభ్యులు చెబుతున్నారు.

👉గాడిద మాంసానికి గిరాకీ పెరగడంతో ఆ మాంసం అమ్మే దుకాణాలు వెలుస్తున్నాయి. రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో గాడిదల సంఖ్య తక్కువ. దీంతో ఆ రాష్ట్రాల నుంచి వాటిని అక్రమంగా తరలిస్తున్నారు అని యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ తెలిపింది.

👉 ధర ఎలా ఉందంటే  .. ప్రస్తుతం ఏపీలో ఒక్కో గాడిద ధర రూ.15వేల నుంచి రూ.20వేల వరకూ పలుకుతోంది. దీంతో మిగతా రాష్ట్రాల నుంచి గాడిదలను తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు.

👉 ఇప్పటికే దేశవ్యాప్తంగా గాడిదల సంఖ్య బాగా తగ్గిందని, ఏపీలో అది మరీ తక్కువగా ఉందని పరిస్థితి ఇలాగే కొనసాగితే వాటిని ముందు ముందు 'జూ'లోనే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది .

👉శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాడిద మాంసం, పాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గాడిద మాంసం తింటే లైంగిక పటుత్వం పెరుగుతుందనే నమ్మకమే దీనికి ప్రదాన కారణం.

👉గాడిద పాలు, మాంసంలో లైంగిక శక్తిని పెంచే లక్షణాలు లేవని నిపుణులు చెబుతున్నారు

👉గాడిద పాలు, మాంసం విక్రయాలు ఒక్కొచోట ఒక్కో రకంగా జరుగుతున్నాయి. పాలు అమ్ముకునేవారు గాడిదలను ఇళ్ల దగ్గరకే తీసుకొచ్చి అమ్ముతుంటే, గాడిద మాంసం కోసం ప్రధాన కూడళ్లలో కూడా షాపులు ఏర్పాటవుతున్నాయి.

👉 కొన్ని జిల్లాల్లో ఎప్పుడూ గాడిద మాంసం దొరుకుతుంటే, కొన్ని ప్రాంతాల్లో సీజన్ల వారీగా అమ్మకాలు జరుగుతున్నాయి.

👉 ఫుడ్‌ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌- 2011ప్రకారం గాడిదను మాంసం కోసం పెంచే జంతువుగా పరిగణించరు. దాని మాంసం అమ్మడం నేరం.

👉 ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఐపీసీ 428, 429 సెక్షన్ల ప్రకారం శిక్ష కూడా పడుతుంది..

👉ఏపీలో ప్రస్తుతం 5వేల గాడిదల వరకు ఉన్నాయని, ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు చేపట్టకపోతే గాడిదలు కూడా అంతరిస్తున్న జంతువుల జాబితాలోకి చేరడం ఖాయమని భావిస్తున్నారు.

👉ఏపీ ప్రభుత్వం ఇటీవల కుక్కలకు, పందులకు లైసెన్స్ ‌ తీసుకోవాలంటూ జీవో నెంబర్ 693 జారీ చేసింది.కాని గాడిదలను గాలికొదిలేసింది.

👉 20119లో జరిగిన పశుగణన లెక్కల ప్రకారం దేశంలో గాడిదల సంఖ్య 1.2 లక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో వాటి సంఖ్య ప్రస్తుతం 5వేలే ఉంది.

👉 2012లో రాష్ట్రంలో వాటి సంఖ్య 10వేలుగా ఉండేది. అంటే, ఏడేళ్లలో 50శాతానికి పైగా గాడిదలు తగ్గిపోయాయి. దేశంలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. 2012నుంచి దేశవ్యాప్తంగా గాడిదల సంఖ్యలో 61.23శాతం తగ్గుదల కనిపించింది.

👉ఆంధ్రప్రదేశ్‌లో గాడిదల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. దీంతో, ఇతర రాష్ట్రాల నుంచి గాడిదలను అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చి మాంసం విక్రయిస్తున్నారు. గతంలో ముంబయి నుంచి ఏపీకి తరలిస్తున్న 8గాడిదలను, రెండు రోజుల క్రితం దాచేపల్లిలో 39గాడిదలను పోలీసులు పట్టుకున్నారు.

👉అయితే ఈ కేసులతో పోలిస్తే అక్రమంగా రవాణా అవుతున్న గాడిదల సంఖ్య అంతకంటే చాలా ఎక్కువేనని జంతు ప్రేమికులు అంటున్నారు.

👉 ఒక టీ గ్లాసు(100నుంచి 150మిల్లీ లీటర్లు) గాడిద పాలు ప్రాంతాన్ని బట్టి రూ.50నుంచి రూ.100వరకూ అమ్ముతున్నారు. వాటి మాంసం కూడా కేజీ రూ.500నుంచి రూ.700పలుకుతోంది.

👉కొంతమంది గాడిద పాలు, మాంసంకంటే వాటి అక్రమ రవాణా ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గాడిదను 3వేలు నుంచి 5వేల మధ్య కొనుగోలు చేసి, మరో రాష్ట్రంలో దానినే రూ. 15వేల నుంచి రూ. 20వేలకు అమ్ముతున్నారు.

👉తెలుగు రాష్ట్రాల్లో గతంలో గాడిదలను ప్రధానంగా రవాణాకు, బరువులు మోయడానికి ఉపయోగించేవారు. వాగులు, నదుల నుంచి ఇసుక మూటలు తేవడానికి, దుస్తులు ఉతికేవారు ఆ మూటలు తేవడానికి వాడేవారు.

👉తెలంగాణలోని నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు వంటి జిల్లాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉండేది.

👉విజయనగరం జిల్లా సాలూరులో గాడిదలను దొంగిలించిన కేసులు నమోదైన సందర్భాలున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

👉వీటి మాంసానికి గిరాకీ ఉన్న ప్రాంతాలకు తరలించడం కోసం అక్కడ గాడిదలను చోరీ చేసేవారు.

Post a Comment

0 Comments

Close Menu