✌ ఇప్పటికీ ఈ పంచాయితీ తేలలేదు.
✌ అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తే ...
✌ కొటియాపై ప్రేమకు ఖనిజాలే కారణమా...?
✌ ఒక ఓటరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం.
✌ అలా వేస్తే ఆ రెండు ఓట్లూ చెల్లవు.
✌ కానీ ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న 34 గ్రామాలకు చెందిన దాదాపు 4 వేల మంది ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తారు. అది ఒక రాష్ట్రంలో కాదు.... రెండు రాష్ట్రాల్లో.
✌ అలా ఓట్లు వేయడం కోసమే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండూ రాష్ట్రాలు వీరికి పోటీ పడి ఓటు హక్కుతో పాటు అనేక పథకాలు అందిస్తున్నాయి.
✌ దీంతో ఇక్కడ గిరిజనులకు రెండు రేషన్ కార్డులు, రెండు పింఛన్ కార్డులు, రెండు ఓటరు కార్డులు...ఇలా అన్నీ రెండేసి ఉంటాయి.
✌ అలాగే రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను వీరు ఎన్నుకుంటారు.
✌ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్ ప్రాంతంలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు.
✌ఇక్కడ దాదాపు 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,902 మంది ఓటర్లు. వీరు ఇటు ఆంధ్రాలోనూ, అటు ఒడిశాలో ఓటు హక్కును కలిగి ఉంటారు.
✌ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు.
✌ఈ గ్రామాలు తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. 1968 లో సుప్రీంకోర్టునూ ఆశ్రయించాయి.
✌అప్పటి నుంచి ముందుకు కదలని కొటియా కేసుపై 2 0 0 0 లో సుప్రీం కోర్టు ఓ ప్రతిపాదన చేసింది. దాని ప్రకారం కొటియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని వేసింది. అందులో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, న్యాయవాదులు ఉన్నారు.
✌కొటియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు, కోర్టులో వాదనలు చేసింది. అయినా విషయం కొలిక్కి రాలేదు. తర్వాత 2006 లో ఈ సమస్యని పార్లమెంటులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.
✌ ఇప్పటికీ ఈ పంచాయితీ తేలలేదు.
✌ అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తే ...కొటియా గ్రామాలుగా ఉన్న 21 గ్రామలు...మరికొన్ని గ్రామాలుగా విడిపోయి వాటి సంఖ్య ప్రస్తుతం 34 కి చేరింది.
✌1942 లో పరిపాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసింది. దానికోసం 1942 లో సర్వే జరిపించింది.
✌ఆ క్రమంలో ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించేందుకు గిల్. జి అనే సర్వే అండ్ ల్యాండ్ రికార్డు కార్యాలయ అధికారి సర్వే నిర్వహించారు.
✌ఇందులో ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని ఇరు రాష్ట్రాల్లో విలీనం చేయగా... కొటియా పంచాయతీ పరిధిలో 2 1 గ్రూపు గ్రామాల సంగతి తేల్చలేదు.
✌అప్పట్నుంచి ఈ గ్రామాలు తమవంటే తమవని ఒడిశా, ఆంధ్రా పట్టుబడుతున్నాయి.
✌ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968 లో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే... కోర్టు స్టేటస్ కో విధించింది.దీంతో ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. అసలు కొటియా గ్రామాల సమస్యపై అవగాహన ఉన్నవారు కూడా లేరు.
✌గత ఏడాది ఫిబ్రవరిలో ఒడిశా స్థానిక ఎన్నికల్లో ఓటేసిన ఈ గిరిజనం.. ఇప్పుడు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
✌ కొటియా, కురిటిభద్ర, మడకార్, డోలియాంబ తదితర గ్రామలు ఒడిశాకు....
✌నేరేళ్లవలస, ఎగువశెంబి, దిగువశెంబి, ధూళిభద్ర, మూలతాడివలస, పగులు చెన్నేరు, పట్టుచెన్నేరులు, సొలిపిగుడ, శిఖపరువుగ్రామాలు ఏపీ భూభాగానికి సమీపంలో ఉంటాయి.
మిగతావి రెండు సరిహద్దులకి దాదాపు సమాన దూరంలో ఉంటాయి.
✌దీంతో ఏ రాష్ట్రానికి సమీపంగా ఉన్న గ్రామాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులో ఒడిశా రాష్ట్రానిదే పైచేయిగా కనిపిస్తోంది. ఎందుకంటే రోడ్లు వేయడంతో పాటు అనేక కార్యాలయాలు ఆ రాష్ట్రం నిర్మిస్తోంది.
✌ఎక్కడ చూసినా ఒడిశా కార్యాలయాలు, ఒరియా భాషలోని బోర్డులే కనిపిస్తున్నాయి తప్పా...తెలుగు భాషలో అరుదుగా బోర్డులు కనిపిస్తాయి.
✌ అయితే రెండు రాష్ట్రాల ఫలాలను అందుకుంటున్న కొటియా గ్రామాల గిరిజనం అభివృద్ధి కోసం ఒడిశా ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటున్నారు.
✌ఇప్పటివరకు రెండు రాష్ట్రాల సమస్యగా ప్రభుత్వాల మధ్య నలుగుతున్న సమస్యలోకి రాజకీయాలు చేరాయి. ఎన్నికల సమయం కావడంతో రాజకీయ నాయకులు ఈ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు.
✌కొటియా గ్రామాల్లో ఒడిశా బీజేపీ నాయకులు పర్యటనలు చేస్తున్నారు. ఆంధ్రా ప్రభుత్వం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవద్దని కొటియా వాసులకి ఒడిశా బీజేపీ నాయకత్వం సూచించింది. అలాగే అయా ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసింది.
✌మరో వైపు కొటియా పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికలను ఆపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 10వ తేదిన (2021) హైకోర్టులో పిల్ నమోదైంది. భారత్ బికాస్ పరిషత్ అనే స్వంచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ పిల్ వేశారు.
✌ కేసులు, క్షేత్రస్థాయి పర్యటనలు, రాజకీయాలు ఎలా ఉన్నా... అసలు ఈ ప్రాంతంపై ఇరు రాష్ట్రాలకు ఇంత ప్రేమ ఎందుకు?
✌గిరి శిఖర ప్రాంతంలో ఎవ్వరికి పట్టనట్లు ఉండే ఈ కొటియా గ్రామాల్లో వందల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు పోటీపడి మరీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేస్తున్నాయి?
✌ఈ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయని...వాటిని దక్కించుకోవాంటే ముందుగా ఇక్కడి గిరిజనుల మనస్సుని గెల్చుకోవాలని... అందుకే ప్రభుత్వాలు పోటీపడి మరి పథకాలు ఇస్తూ పనులు చేస్తున్నాయని వామపక్షనాయకులు అంటున్నారు.
✌ కొటియా గ్రామాల పరిధిలో ఖనిజ సంపద అనే మాట అందరి నోటా వినిపిస్తూనే ఉంది. అసలు నిజంగా ఇక్కడ ఖనిజాలు ఉన్నాయా
✌తూర్పు కనుమల్లో చాలా చోట్ల ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా బాక్సైట్ వంటి ఖనిజాలు విస్తరంగా ఉన్నాయి. మనం ఒప్పుకున్నా...లేకున్నా...ఖనిజాలను తవ్వడానికి ఏ ప్రభుత్వమూ సంకోచించదు. విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను తమ పరిధిలోకి తెచ్చుకోవాలనే చూస్తాయి. కొటియా గ్రామాల పరిధిలోని కొండల్లో కూడా విలువైన ఖనిజాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తూర్పు కనుమల్లోని ఈ బెల్ట్‌లో మాంగనీసు, ఇనుము, లైమ్ కంకర, క్వార్జ్, గ్రానెైట్, రంగురాళ్లు వంటి ఖనిజ సంపద ఉంది. వీటితో పాటు జల, జంతు సంపద కూడా అపారం. వీటిని కాపాడుకోవాలి. అసలు తూర్పు కనుమల్ని బయోడైవర్సీటి హాట్ స్పాట్‌గా గుర్తించాల్సిన అవసరం ఉంది.
✌ఏపీ వేసిన రోడ్లపైనే ఒడిశా రోడ్లు వేస్తోంది ..మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి నేటి వరకు ఏపీ రాష్ట్రానికి సంబంధించి భౌగోళికంగా ఎన్నెన్నో మార్పులొచ్చాయి. కానీ కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనే వివాదం మాత్రం ఇంకా తేలలేదు.
✌ ఏపీ, ఒడిశా రెండు రాష్ట్రాలు కొటియా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాయి. అయితే ఏపీ కంటే ఒడిశాయే ముందంజలో ఉంది.
✌ కొటియా గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు రూ.180 కోట్లను మంజూరు చేసింది. అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకునే గిరిజన ఉత్సవాలకు, పండుగలకు భారీగా నజరానాలు అందిస్తోంది.
✌ కొటియాలోని అన్ని గ్రామాలను కలుపుతూ రహదారులు నిర్మించింది. కొటియా కొండ గ్రామాల్లో ఎటు చూసిన అందమైన రోడ్లు కనిపిస్తాయి. వీటితో పాటు మరికొన్ని గ్రామాలకు కూడా ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టింది. ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, పాఠశాల, ఆశ్రమ పాఠశాల ఇలా అనేక సౌకర్యాలను ఏర్పాటు చేసింది.
0 Comments