✌మలాలా అంటే అర్థం ?
✌ఎహ్సానుల్లా ఎహ్సాన్ అనే వ్యక్తి... ఎలా
✌మలాలా అంటే అర్థం బాధాసర్పద్రష్ట. ఆమె బాధంతా జాయ్(సంతోషం)కోసమే ఈ సంతోషం విద్య (జ్ఞానం) నుంచే లబిస్తుంది. మహిలకి చదువు ఎందుకు దూరం గా ఉందన్నేదే ప్రాదమిక సమష్య నుంచి తయారయ్యిందే ఈ పోరాటం.
✌ బాలికా విద్య కోసం, మహిళా హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ బహుమతి గ్రహీత మలాల యూసఫ్‌జాయ్‌పై 2012 లో జరిగిన కాల్పుల ఘటన గుర్తుండే ఉంటుంది.
✌ అప్పుడు ఆమెపై కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి.. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆమెపై మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే దీనికి మలాలా గట్టిగానే జవాబు చెప్పింది. అంతే కాకుండా జైలులో అతడు ఎలా తప్పించుకున్నాడంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
✌ఎహ్సానుల్లా ఎహ్సాన్ అనే వ్యక్తికి ఉగ్రవాద సంస్థలతో మెండుగా సంబంధాలు ఉన్నాయి.
✌ఈ వ్యక్తే స్కూలు నుంచి తిరిగి వస్తున్న మలాలాపై కాల్పులు జరిపాడు. ఆమె శరీరంలో మూడు బుల్లెట్లు దిగినప్పటికీ తన ఉక్కు సంకల్పానికి లొంగిపోయాయి.
✌అమెరికాలో చికిత్స అనంతరం మలాలా ప్రాణాల నుంచి బయటపడింది.
✌ తాజాగా ఇదే వ్యక్తి మలాలాకు ఇప్పుడు ట్విట్టర్ ద్వారా బెదిరింపులు చేశాడు. ‘‘ఇంటికి తిరిగి వచ్చెయ్.. నీతో, మీ నాన్నతో లెక్కలు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎలాంటి పొరపాటూ జరగదు’’అని సదరు వ్యక్తి ట్వీట్ చేశాడు.
✌ అయితే అతడి ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మలాలా ‘‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ అనే సంస్థకు ఇతడు మాజీ అధికార ప్రతినిధి. ఇతడే గతంలో నాపై ఇంకా చాలా మందిపై దాడికి పాల్పడింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలను బెదిరిస్తున్నాడు. ఇతడు జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు?’’అని ట్వీట్ చేసింది.
✌ ఈ ట్వీట్‌లో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ మిలిటరీని ట్యాగ్ చేసింది. అయితే ఈ విషయమై వెంటనే స్పందించిన ట్విట్టర్.. ఎహ్సాన్ ఖాతాను తొలగించింది.
✌ ఎహ్సాన్‌ను 2017 లో పాక్ మిలిటరీ అరెస్ట్ చేసింది.
✌పాకిస్తాన్ ఇంటలీజెన్స్ ఎజెన్సీ అదులపులో ఉన్న ఇతడు 2 0 2 0 జనవరిలో తప్పించుకున్నాడు. అతడి అరెస్ట్, ఎస్కేట్ ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
✌అనంతరం అతడు పాకిస్తాన్‌కు చెందిన వివిధ మీడియా మాద్యమాల్లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూల్లో కొన్ని బెదిరింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా కూడా బెదిరింపులు చేస్తూ వచ్చాడు. ఒకటి కంటె ఎక్కువ ట్విట్టర్ ఖాతాలు వినియోగిస్తున్నట్లు పసిగట్టిన ట్విట్టర్.. అతడి అన్ని ఖాతాలను తొలగించింది.
✌ఇక మాలల గురించి చెప్పలంటే అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్ చరిత్ర సృష్టించారు.
✌మన భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు.
✌ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. ఆమెకు విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. బుధవారం పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రి డాక్టర్లు ఏడు గంటల పాటు శ్రమించి ఆమె వెన్నెముకలో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు.ఈ విషయం తెలుసుకున్న తాలిబన్ తీవ్రవాదులు.. ఆమెను హతం చేసి తీరుతామని ప్రకటించారు.
✌డాక్టర్లు ఆమెను రక్షించినప్పటికీ తమ చేతుల్లో చాపు తప్పదని హెచ్చరించారు. ఈ యువతి సాహసంపై పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మాట్లాడుతూ మలాలా ఒక వ్యక్తికాదని ఓ శక్తి అని చెప్పుకొచ్చారు.
✌పాకిస్థాన్ అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్ర "ఐయామ్ మలాలా" పేరిట పుస్తక రూపంలో వచ్చింది.ఇందులో తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను 'ఐయామ్ మలాలా' (నేను మలాలా) అన్న పేరుతో ఆమె పుస్తకం రాసింది.
✌యసఫ్ జాయ్ స్వాత్ లోయలో ప్రముఖ తెగ. స్వాత్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా మలాలా ‘నా స్వాత్ లోయ’అనే అంటుంది. మలాలా తండ్రి కూడా కవి. కుశాల్ పబ్లిక్ స్కూల్స్ పేరిట ప్రైవేటు పాఠశాలలను నిర్వహిస్తూ ఉంటారు. ఇదికూడా కుశాల్ ఖాన్ ఖట్టక్ అనే పస్తూన్ కవి పేరులోదే.
0 Comments