👉 ఒక జిల్లా.. ఒకే వ్యవసాయోత్పత్తిపై దృష్టి సారింపు' (ఓడీఓఎఫ్‌పీ)
👉 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో సంప్రదించి 'ఒక జిల్లా.. ఒకే వ్యవసాయోత్పత్తిపై దృష్టి సారింపు' (ఓడీఓఎఫ్‌పీ)విధానం కోసం ఉత్పత్తులను ఖరారు చేసింది.
👉దేశ వ్యాప్తంగా 728 జిల్లాలకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన, పశువులు, పౌల్ట్రీ, పాలు, మత్స్య, ఆక్వాకల్చర్, సముద్ర రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల్ని ఇందులో గుర్తించారు.
👉రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ ఉత్పత్తుల జాబితా ఖరారు చేయబడింది.
👉ఈ ఉత్పత్తులను క్లస్టర్ విధానంలో భారత ప్రభుత్వ పథకాల కలయిక ద్వారా, ఉత్పత్తుల విలువను పెంచడానికి, రైతు ఆదాయాన్ని పెంచే తుది లక్ష్యంతో ప్రోత్సహించబడతాయి.
👉ప్రమోటర్ మరియు సూక్ష్మ సంస్థలకు ప్రోత్సాహకాలను అందించే కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీఎం-ఎఫ్ఎంఈ పథకం కింద.. ఈ గుర్తించబడిన ఉత్పత్తులకు మద్దతు ఉంటుంది.
👉 అనేక ఉత్పత్తుల ఎంపికలో వనరుల కలయిక మరియు ఇతర డిపార్ట్‌మెంట్‌ల విధానం కూడా సమీకృతమై ఉంది.
👉కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఎంఐడీహెచ్, ఎన్ఎఫ్ఎస్ఎం, ఆర్‌కేవీవై, పీకేవీవైల నుంచి మద్దతునిస్తుంది.
👉రాష్ట్ర ప్రభుత్వాలు ఓడీఓఎఫ్‌పీలు అమలు చేయడం వల్ల అన్నదాతలకు తగు ప్రయోజనం చేకూరుతుంది.
👉 వ్యవసాయోత్పత్తుల విలువ పెరుగుదల అంచనాల్ని గ్రహించడానికి, తరువాత సాగు ఎగుమతులను పెంచడానికి తోడ్పడుతుంది.
0 Comments