మళ్ళి రాచరికం లోకి రాను ఇష్టం లేదు

 

  • ఏమిటి : రాజరికం వదులుకొన్న  బ్రిటన్‌ యువరాజు
  • ఎప్పుడు : గత ఏడాది తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం
  • ఎవరు : బ్రిటన్‌ యువరాజు హ్యారీ
  • ఎక్కడ : బ్రిటన్‌
  • ఎందుకు : స్వతంత్రంగా బతకాలని

✌మళ్లీ రాజకుటుంబంలో సభ్యులుగా చేరడం ఇష్టం లేదు అని బ్రిటన్‌ యువరాజు ప్రకటించాడు 

బ్రిటన్‌ యువరాజు హ్యారీ, భార్య మేఘన్‌ మార్కెల్‌ తిరిగి రాజకుటుంబంలో సభ్యులుగా చేరడానికి ఇష్టపడడం లేదని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఒక ప్రకటనలోతెలిపింది.

రాజ కుటుంబ బాధ్యతలకు దూరంగా, ఆర్థికంగా స్వతంత్రంగా బతకాలని గత ఏడాది తీసుకున్న నిర్ణయానికే ఈ జంట కట్టుబడి ఉందని, అందువల్ల వారి రాచరికపు హోదాలు, బిరుదులు, సైనిక గౌరవాలు తదితరాలన్నింటిని రాజకుటుంబంలోని మిగతా సభ్యులకు రాణి పంచుతారని రాణి ఎలిజబెత్‌-2 తరఫున విడుదలైన ప్రకటన తెలిపింది.

ఇక నుంచి హ్యారీ, మేఘన్‌లకు హిస్‌ రాయల్‌ హైనెస్, హర్‌ రాయల్‌ హైనెస్‌ (హెచ్‌ఆర్‌హెచ్‌) బిరుదులు, డ్యూక్‌ ఆఫ్‌ ససెక్స్, డచెస్‌ ఆఫ్‌ ససెక్స్‌ హోదాలు ఉండవు.  

2020 మార్చిలో రాజరికపు బంధనాలకు దూరంగా, స్వతంత్రంగా బతకాలని హ్యారీ (36), మేఘన్‌ (39) నిర్ణయించుకున్నారు. 

✌ ఆ సమయంలో ఈ నిర్ణయంపై 12 నెలల తర్వాత సమీక్ష చేయాలని నిర్ణయించారు. మార్చితో ఆ గడువు తీరనుంది.

Post a Comment

0 Comments

Close Menu