ఆస్ట్రేలియా ఓపెన్ విజేతలు

  • ఏమిటి : ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్
  • ఎప్పుడు : 8, ఫిబ్రవరి 2021 – 21, ఫిబ్రవరి 2021
  • ఎవరు : జకోవిచ్ , ఒసాకా, ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)-అరినా సబలెంక (బెలారస్), క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)-రాజీవ్ రామ్ (అమెరికా)
  • ఎక్కడ : ఆస్ట్రేలియా



✌ మెల్బోర్న్ లో పురుషుల సింగిల్స్ ఫైనల్ లో  మెద్వెదెవ్ ను వరుస సెట్లలో ఓడించిన జకోవిచ్ 7-5, 6-2, 6-2తో విజయం సాదించాడు.  

ప్రైజ్ మనీ కింద రూ.15 కోట్లు అందుకోనున్న జకోవిచ్ ,ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 9వ టైటిల్ సాధించిన సెర్బ్ వీరుడు గా అవతరించాడు. 

ఓవరాల్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ల విషయంలో స్విస్ వీరుడు రోజర్ ఫెదరర్, స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్... జకోవిచ్ కంటే ఓ మెట్టుపైన ఉన్నారు. 

వీరిద్దరూ ఇప్పటివరకు చెరో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నారు. మరో రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిస్తే జకోవిచ్ కూడా ఫెదరర్, నడాల్ ల సరసన చేరతాడు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 20న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ ఒసాకా 6-4, 6-3తో అమెరికాకు చెందిన 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీని చిత్తు చేసింది. దీంతో ఒసాకా రెండోసారి ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నట్లయింది.

గతంలో 2019లో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ఒసాకా గెలిచింది. తాజా విజయంతో ఒసాకా... ఓవరాల్‌గా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

✌ రెండు యూఎస్ ఓపెన్ (2018, 2020) టైటిల్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.

✌ పురుషుల డబుల్స్ విభాగం లో Slovakia Filip Polášek , Croatia Ivan Dodig లు గెలుపొందారు 

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను రెండో సీడ్ ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)-అరినా సబలెంక (బెలారస్) జంట కై వసం చేసుకుంది.

✌ తుదిపోరులో బెల్జియం-బెలారస్ జోడీ 6-2, 6-3తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా క్రెజికొవా- కెటరినా సినియకొవా జంటపై అలవోక విజయం సాధించింది.

✌ మిక్స్‌డ్ డబుల్స్‌లో బార్బరా క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ విజేతగా నిలిచింది.ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన క్రెజికొవా-రాజీవ్ రామ్ జోడీ 6-1, 6-4తో ఆస్ట్రేలియన్ వైల్డ్‌కార్డ్ జంట సమంత స్టొసుర్-మాథ్యూ ఎడెన్‌పై విజయం సాధించింది.

గుర్తు ఉంచుకోవలసిన అంశాలు ...

✌ మిక్స్‌డ్ డబుల్స్ : బార్బరా క్రెజికొవా (చెక్ రిపబ్లిక్)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ

✌ మహిళల డబుల్స్ : ఎలైస్ మెర్టెన్స్ (బెల్జియం)-అరినా సబలెంక (బెలారస్)

✌ మహిళల సింగిల్స్ : ఒసాకా

✌ పురుషుల సింగిల్స్  : జకోవిచ్
 
✌ పురుషుల డబుల్స్  : Slovakia Filip Polášek , Croatia Ivan Dodig

Post a Comment

0 Comments

Close Menu