👉 బారత్ వాణిజ్య విస్తృతి ‌ ఒప్పందం మారిషస్ తో

 

  • ఏమిటి : ఆర్థిక సహకార, భాగస్వామ్య ఒప్పందం
  • ఎప్పుడు : ఫిబ్రవరి 22
  • ఎవరు : భారత్ మరియు మారిషస్‌
  • ఎక్కడ : పోర్ట్‌లూయిస్ లో
  • ఎందుకు : ఇరుదేశాల వాణిజ్య విస్తృతి కోసం

👍ఆఫ్రికా దేశమైన మారిషస్తో కీలకమైన ఆర్థిక సహకార, భాగస్వామ్య ఒప్పందం(సీఈసీపీఏ)పై భారత్ ఫిబ్రవరి 22న సంతకాలు చేసింది.

👍 మారిషెస్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్, ఇది ఒక ద్వీప దేశం.

👍ఆఫ్రికా ఖండతీర ఆగ్నేయ తీరప్రాంతంలో 2000 కీ.మీ దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది.

👍 నైఋతిదిశన, మడగాస్కర్కు పశ్చిమాన 870 కి.మీ. మారిషసుకు తూర్పున 560 కి.మీ దూరాన రోడ్రిగ్యూసు, అగలెగా, సెయింటు బ్రాండను ద్వీపాలు కూడా మారిషసులో భాగంగా ఉన్నాయి.

👍 మారిషసు భూభాగ వైశాల్యం 2,040 చ.కి.మీ. ఇది వైశాల్యపరంగా ప్రపంచంలోని 170 వ స్థానంలో ఉంది.

👍మారిషసు రిపబ్లికులో మారిషసు ప్రధాన ద్వీపం, అనేక సుదూర దీవులను కలిగి ఉంది. దేశం ప్రత్యేకమైన ఆర్ధిక మండలం (ఇ.ఇ.జెడ్) సుమారు 2.3 మిలియను చదరపు కిలో మీటర్లు (8,90,000 చ.మై) సుమారు 4,00,000 చ.కి.మీ ఉంటుంది.

👍 ఇది సీ షెలుతో సంయుక్తంగా ఈ ప్రాంతం నిర్వహించబడుతుంది

👍విషయం లోకి వెళితే  ఒక ఆఫ్రికా దేశంతో ఈ తరహా ఒప్పందం(ఇరుదేశాల వాణిజ్య విస్తృతి కోసం) చేసుకోవడం భారత్‌కు ఇదే ప్రథమం.

👍ఆఫ్రికా ఖండంలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న మారిషస్‌తో ఈ ఒప్పందం భారత వాణిజ్య విస్తృతికి అవకాశం కల్పించనుంది. 

👍మారిషస్‌ రాజధాని పోర్ట్‌లూయిస్‌ జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పంద కార్యక్రమంలో మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జుగ్నాథ్, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పాల్గొన్నారు.

👍 ఇరు దేశాలకూ వాణిజ్య అవకాశాలు

👍 సీఈసీపీఏ ఒప్పందం ఇటు భారత్, అటు మారిషస్‌ ఉత్పత్తులు, సేవలకు వాణిజ్య అవకాశాలను విస్తృతం చేయనుంది.

👍 ఇరు దేశాలు మరో దేశ ఉత్పత్తులు, సేవలకు ప్రత్యేక ప్రవేశ అవకాశాన్ని కల్పిస్తాయి. సుమారు 300ఉత్పత్తులను భారత్‌ మారిషస్‌కు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడనుంది.

తెలుగు వారితో అనుబందం

👍ప్రైవేటు వ్యవసాయదారుల క్రింద కూలీలుగా పనిచేయటానికి 1835 లో కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగు వారు కాందిశీకులుగా తొలిసారిగా మారిషస్‌లో అడుగుపెట్టారు.

👍ఆ మరుసటి సంవత్సరం గౌంజన్ అనే ఓడలో దాదాపు 30 మంది తెలుగువారు ఆ ద్వీపంలో కాలుపెట్టారు.

👍కాకినాడ సమీపాన వున్న 'కోరంగి' రేవునుండి బయలు దేరి వచ్చినందుకు వాళ్లని కోరంగివాళ్ళు అని, వారు మాట్లాడే తెలుగు భాషకు 'కోరంగి భాష' అని పిలిచేవారు.

👍1843 సంవత్సరంలో కోరంగి పికేట్ అనబడే 231 టన్నుల బరువు నాలుగైదు తెరచాపలు గల బార్క్ అనే మాదిరి ఓడ రెండు సార్లు ప్రయాణం చేసి దాదాపు రెండు వందల మందిని మారిషస్ దీవికి చేర్చింది.

👍 తెలుగు వారు భాషా సంస్కృతి కాపాడుకొంటున్నారు. సర్ వీరాస్వామి రింగడు తండ్రి తెలుగువాడు, తల్లి తమిళవనిత. తెలుగు భాషా సంస్కృతులపై ఆయన అపారమైన అభిమానం చూపుతారు. ఆంధ్ర విశ్వ విధ్యాలయం డాక్టరేటుతో తెలుగు బిడ్డడైన సర్‌వీరాస్వామి రింగడును సత్కరించింది. అంచెలంచెలుగా వివిధ హోదాలు చేపట్టి, 1986 జనవరి 17 న గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు

  • 'కోరంగి భాష' అని ఎ బాషకి పేరు : తెలుగు భాష
  • మారిషస్‌ రాజధాని : పోర్ట్‌లూయిస్‌; కరెన్సీ: మారిషస్‌ రుపీ
  • మారిషస్‌ ప్రస్తుత అధ్యక్షుడు : పృథ్వీరాజ్‌సింగ్‌ రూపన్
  • మారిషస్‌ ప్రస్తుత ప్రధానమంత్రి :ప్రవింద్‌ జుగ్నాథ్‌

 

Post a Comment

0 Comments

Close Menu