👉 ఐటి హార్డ్ వేర్ రంగం లో పెద్ద ఎత్తున దేశీయ ఉత్పత్తి ని పెంచేందుకు
👉 ఈ పథకం లో భాగం గా ఐటి హార్డ్ వేర్ రంగం లో పెద్ద ఎత్తున దేశీయ ఉత్పత్తి ని పెంచేందుకు, ఈ రంగం తాలూకు వేల్యూ చైన్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రతిపాదించడమైంది.
👉 ప్రతిపాదిత పథకం తాలూకు లక్షిత క్షేత్రాల్లో టాప్ టాప్ లు, టాబ్లెట్ లు, ఆల్- ఇన్- వన్ పీసీ లు, సర్వర్ లు వంటివి ఉన్నాయి.
👉 అనువైన కంపెనీల కు 4 సంవత్సరాల పాటు లక్షిత క్షేత్రం లోకి వచ్చే, భారతదేశం లో తయారైన ఉత్పత్తుల కు మొత్తం వృద్ధిశీల విక్రయాల (ఆధారంగా పరిగణించే సంవత్సరం 2019-20) పై 4శాతం నుంచి 2శాతం / 1శాతం ప్రోత్సాహక రాశి ని ఇవ్వాలనే ప్రతిపాదన ను ఈ పథకం లో ప్రస్తావించడమైంది.
👉 ఈ పథకం తో లాప్ టాప్, టాబ్ లెట్, ఆల్- ఇన్- వన్ పీసీ, సర్వర్ లు సహా ఐటీ హార్డ్ వేర్ నిర్మాణం తో ముడిపడిన ప్రముఖ గ్లోబల్ కంపెనీలు ఐదింటికి, దేశీయంగా పది కంపెనీలకు ప్రయోజనం అందేందుకు ఆస్కారం ఉంది.
👉 ఆత్మనిర్భర్ భారత్ లో భాగం గా తయారీ ని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన విభాగం గా ఐటీ హార్డ్ వేర్ నిర్మాణం ఉంది; ఎందుకంటే, ప్రస్తుతం ఈ తరహా వస్తువుల కోసం దిగుమతుల పై ఆధారపడుతున్న ధోరణి చాలా ఎక్కువ గా ఉంది.
0 Comments