✌ అంబుడ్స్‌మన్ అంటే ఏమిటి ??
👉 ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి బ్యాంక్‌లో అంతర్గతంగా ఒక వ్యవస్థ ఉంటుంది. సేవల్లో ఏ మాత్రం లోపం ఉన్నా ఖాతాదారులు ఫిర్యాదు చేయాలి.
👉 అయితే ఈ వ్యవస్థ సేవలు అంత సంతృప్తికరంగా లేవని ఫిర్యాదులు రావడంతో ఆర్‌బిఐ 1995లో ‘ద బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ పథకం’ (బిఔస్) తీసుకొచ్చింది.
👉 వాణిజ్య, గ్రామీణ, ప్రాథమిక సహకార బ్యాంకుల సేవన్నీ ఈ పథకం కిందికి వస్తాయి.
👉ఇవి అందించే సేవలపై ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా, ఖాతాదారులు నేరుగా ఆ విషయాన్ని బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
👉ప్రతి బ్యాంక్... తమ బ్యాంక్ ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం అంతర్గతంగా అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ౨౦౧౫ లో ఆర్‌బిఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది.
👉సాధారణంగా ఆయా బ్యాంకుల్లోని చీఫ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసరే (సిసిఎస్‌ఒ) ఆయా బ్యాంకులకు ఇంటర్నల్ అంబుడ్స్‌మన్‌గా ఉంటారు.
👉బ్యాంకుల సేవల్లో ఏమైనా లోపం జరిగితే ఖాతాదారులు వెంటనే ఆ విషయాన్ని ఆ బ్యాంకు అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విభాగానికి ఫిర్యాదు చేయాలి.
👉అక్కడ సరైన పరిష్కారం లభించకపోతే ఆ బ్యాంకుకు చెందిన ఇంటర్నల్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలి.
👉రుణాలు ఇవ్వడం, వాటిపై వసూలు చేసే వడ్డీ రేటు విషయంలో అనుసరిస్తున్న పద్దతులు ‘బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా’ (బిసిఎ్‌సబిఐ) ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నా ఖాతాదారులు ఆ విషయాన్ని ఫిర్యాదు చేయవచ్చు.
👉 2014-15లో బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో 29 శాతం ఇలాంటివే.
👉వడ్డీ రేట్లు మారినప్పుడల్లా బ్యాంకులు తప్పనిసరిగా ఆ విషయాన్ని రుణాలు తీసుకున్న వారికి తెలియజేయాలి.
👉అయితే కొన్ని బ్యాంకులు ఈ విషయాన్ని రుణ గ్రహీతలకు చెప్పకుండానే వారిపై అదనపు భారం మోపుతున్నాయి.
ఫిర్యాదు ఎలా చేయాలి ?
👉 బ్యాంకులో మీకు సేవా లోపం ఎదురైతే ఆ విషయాన్ని ఆ బ్యాంకులో ఉండే అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విభాగానికి ఫిర్యాదు చేయండి.
👉 అక్కడ పరిష్కారం లభించకపోతే నెల రోజుల్లో ఆ బ్యాంక్‌కు చెందిన ఇంటర్నల్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలి.
👉బ్యాంకులు ఇప్పటికే తమ అంబుడ్స్‌మన్ చిరునామా, వారి ఫోన్ నంబర్లతో కూడిన వివరాలను వెబ్‌సైట్లలో పెట్టాయి.
👉ఖాతాదారులు తమ ఫిర్యాదులను ఇ-మెయిల్ లేదా ఫాక్స్ లేదా కొరియర్, పోస్టు లేదా స్వయంగా ఇవ్వడం ద్వారా కూడా ఇంటర్నల్ అంబుడ్స్‌మన్‌కు పంపించవచ్చు.
👉ఈ ఫిర్యాదు అందిన తర్వాత ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఫిర్యాదును సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఫిర్యాదు అందిన నెల రోజుల్లో పరిష్కారం చూపాలి. అలా కాకపోయినా, లేదా ఆ పరిష్కారం మీకు సంతృప్తికరంగా లేకపోయినా, నేరుగా మీకు చేరువలోని ఆర్‌బిఐ ఆఫీసులో ఉండే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించాలి.
👉ఇక్కడ కూడా సంతృప్తికరమైన పరిష్కారం లభించకపోతే అప్పిలెట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. అక్కడా నిరాశ ఎదురైతే వినియోగదారుల కోర్టులను ఆశ్రయించొచ్చు.
👉 ఖాతాదారుల ఫిర్యాదుల క్రమం
0 Comments