👉 ఐరాస మానవ హక్కుల కమిషనర్ మైఖేల్ బాచ్‌లెట్ మరియు భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే
👉భారత్‌లో కొనసాగుతున్న రైతుల నిరసనలు, జర్నలిస్టులు, కార్యకర్తలపై నమోదవుతున్న దేశద్రోహం కేసులు, సోషల్‌మీడియాను అడ్డుకోవడం వంటి అంశాలను నిన్న జరిగిన మానవ హక్కుల మండలిలో ఐరాస మానవ హక్కుల కమిషనర్ మైఖేల్ బాచ్‌లెట్ లేవనెత్తారు. స్పెయిన్ నుండి సూడాన్ వరకు 50 దేశాలలో తలెత్తుతున్న మానవ హక్కుల సమస్యలపై బాచిలెట్ ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
👉రైతుల ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ.. చట్టాలు, విధానాలు సంబంధిత వర్గాల వారితో అర్థవంతమైన చర్చలపై ఆధారపడి ఉంటాయని ఆమె తెలిపారు.
👉రైతులు, కేంద్రం మధ్య చర్చలు ఈ సంక్షోభానికి పరిష్కారాన్ని చూపుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
👉పోరాటాలకు మద్దతిస్తున్న, సంబంధిత వార్తలను నివేదిస్తున్న కార్యకర్తలు, జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం, సోషల్ మీడియాలో భావ ప్రకటనా స్వేచ్ఛను అరికట్టేందుకు యత్నించడం వంటివి.. మానవ హక్కుల నిబంధనలకు భంగం కలిగిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
👉జనవరి 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ గురించి తప్పుడు వార్తలు పోస్ట్ చేశారంటూ జర్నలిస్టులపై మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో దేశద్రోహం కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
👉ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండలో మరణించిన నవ్రీత్ సింగ్‌పై పోలీసులు కాల్పులు జరిపారంటూ అతని కుటుంబసభ్యులు చేసిన వ్యాఖ్యలను ప్రచురించిన 'వైర్' పత్రిక వ్యవస్థాపకుడు, ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్, రిపోర్టర్ ఇస్మత్ అరాలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
👉రైతుల ఆందోళనలను రిపోర్ట్ చేస్తున్న స్వతంత్ర జర్నలిస్ట్ మణ్‌దీప్ పునియాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
👉రైతుల ఆందోళనలకు సంబంధించిన నిరంతరం సమాచారాన్ని అప్‌డేట్ చేస్తున్న వెయ్యికి పైగా ఖాతాలను నిలిపివేయాల్సిందిగా కేంద్రం ట్విటర్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే.
👉మాగజైన్ కారవాన్, రైతు సంఘం కిసాన్ ఏక్తా మోర్చాలతో పాటు పలువురు కార్యకర్తలు, స్వతంత్ర జర్నలిస్టుల ఖాతాలు వీటిలో ఉన్నాయి.
👉కరోనా మహమ్మారి సమయంలో కేరళ ప్రభుత్వం, అధికారులు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ చూపిన చొరవను బాచ్‌లెట్ ప్రశంసించారు.
👉అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పేద ప్రజలకు అవసరాలను సకాలంలో గుర్తించి, పరిష్కరించగలిగారని అన్నారు.
👉మరోవైపు జమ్ముకాశ్మీర్ పరిస్థితి గురించి కూడా బాచ్‌లెట్ మాట్లాడారు. కార్యకర్తల సమాచార మార్పిడి, వారి అణచివేతపై ఆంక్షలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు.
👉 2019ఆగస్టు నుండి ఇంటర్నెట్‌పై కొనసాగిన నిషేధం ఇటీవల పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. అయితే కమ్యూనికేషన్‌పై నిషేధం విధించడంతో.. వ్యాపారం, జీవనోపాధి, విద్య,ఆరోగ్య సంరక్షణ, వైద్య సమాచారం లభ్యతను తీవ్రంగా దెబ్బతీశాయి.
👉సరిహద్దుల్లో ఇంటర్నెట్‌లో అంతరాయం కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో విద్యార్థుల నిరసనలు జరిగాయని బాచ్‌లెట్ పేర్కొన్నారు.
👉 ఐరాస మానవ హక్కుల కమిషనర్ మిచెల్ బాచెలెట్ చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ మానవహక్కుల కౌన్సిల్‌లోని భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రమణి పాండే ఈ విధంగా స్పందించారు.
👉వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతుల నిరసనలపై, వారి సమస్యల పరిష్కారానికి చర్చల్లో నిమగమైందని పాండే తెలిపారు.
👉రైతుల ఆదాయాన్ని 2024 నాటికి రెండింతలు చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
👉రైతుల పండించిన ఉత్పత్తులకు తగిన ధరలు లభించేలా, వారి ఆదాయం మెరుగయ్యేందుకే కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చామని అన్నారు.
👉అలాగే, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హౌదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం చరిత్రాత్మక నిర్ణయమని, ఈ నిర్ణయాన్ని జమ్ముకాశ్మీర్ ప్రజలు సహా దేశమంతా స్వాగతించిందని అన్నారు. 'సరిహద్దు ఉగ్రవాదానికి కారణమై ప్రజల మానవ హక్కులను పూర్తిగా ఆస్వాదించడంలో కీలకమైన అవరోధంగా ఉన్న ఆర్టికల్ 370రద్దు సామాజిక-ఆర్ధిక అభివఅద్ధికి ప్రేరణ కల్పించి, దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్షతకు తెరదించిందని పాండే అన్నారు.
👉డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (డీడీసీ) ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించే ప్రక్రియ ప్రారంభించామని చెప్పానరు. జాతీయ ప్రగతశీల చట్టాలను జమ్మూ కాశ్మీర్‌కు విస్తరించామని, అక్కడ ప్రజలు దేశంలోని మిగతావారి మాదిరిగానే హక్కులు పొందగలుగుతారని ఉగ్రవాద దాడుల విషయంలో గణనీయమైన క్షీణత ఉందని ఆమె పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (United Nations Human Rights Council)
ట్రాక్టర్ ర్యాలీ ఎప్పుడు జరిగింది ??
👉రైతుల ఆదాయాన్ని 2024 నాటికి ఎంత చేయనుంది ప్రబుత్వం ??
0 Comments