👉 న్యూజిలాండ్‌కు చెందిన అమ్రోడ్, పవర్‌కో, టెస్లా సంస్థలతో కలిసి ఈ విధానాన్ని అమలుచేసే పనులు చేపట్టారు.
👉 తొలుత ఆక్లాండ్ నార్త్ ఐలాండ్‌లోని సోలార్ ఫామ్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థావరాలకు బీమ్ ఎనర్జీ ద్వారా విద్యుత్ సరఫరా చేయడానికి ఈ మూడు సంస్థలు సిద్ధమయ్యాయి.
👉 ఈ సాంకేతిక పరిజ్ఞానం కింద మైక్రోవేవ్ యొక్క చాలా సన్నని కిరణాల రూపంలో విద్యుత్ పంపిణీ చేయనున్నారు.
👉 పవర్ బీమింగ్ యొక్క ఈ ప్రక్రియ ఇంతకు ముందు కూడా ఉపయోగించారు. అయితే ఇది కేవలం సైనికులు, అంతరిక్ష ప్రయోగాలకు మాత్రమే పరిమితం చేయబడింది.
👉1975 లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1.6 కిలోమీటర్ల దూరానికి మైక్రోవేవ్ ద్వారా 34.6 కిలోవాట్ల విద్యుత్‌ను సరఫరా చేసి రికార్డు సృష్టించింది. అయితే, ఇది వాణిజ్య ఉపయోగం కోసం ఉపయోగించబడలేదు.
👉అమ్రోడ్ సంస్థ వ్యవస్థాపకుడు గ్రెగ్ కుష్నిర్ తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత కొన్ని కిలోవాట్ల విద్యుత్తును 1.8 కిలోమీటర్ల దూరం వరకు పంపుతారు. దూరం, శక్తి క్రమంగా పెంచుకుంటూ పోతూ మారుమూల ప్రాంతాల వరకు దీనిని కొనసాగించనున్నారు.
👉 ఈ విధానంతో వైరింగ్ యొక్క భారీ వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.
👉 వైర్లు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి అమ్రోడ్ సంస్థ మరో రెండు సాంకేతిక పరిజ్ఞానాలపై కృషి చేస్తున్నది. వాటిలో ఒకటి రిలే. ఇది లెన్స్ మాదిరిగా పనిచేస్తుంది.
👉కనిష్ఠ ప్రసార నష్టం ద్వారా విద్యుత్‌ను అందించడానికి మైక్రోబీమ్‌ను తిరిగి కేంద్రీకరిస్తారు. క్లోకింగ్ పరికరంలో ఇన్‌స్టాల్ చేసిన మెటామెటీరియల్స్.. యుద్ధనౌకలు, యుద్ధ విమానాల రాడార్ నుండి తప్పించుకోవడంలో సహాయపడతాయి.
👉 అలాగే సింగపూర్, అమెరికాలో కూడా ప్రణాళికలు ఉన్నాయి. సింగపూర్ యొక్క ట్రాన్స్‌ఫర్ ఫ్లైతో పాటు అమెరికాకు చెందిన పవర్ లైట్ టెక్నాలజీ సంస్థలు కూడా గాలిలో విద్యుత్ సరఫరా చేసే ప్రణాళికలపై కృషి జరుగుతున్నది.
👉 జపాన్‌కు చెందిన మిత్సుబిషి సోలార్ ప్యానెల్ అమర్చిన ఉపగ్రహాల నుంచి విద్యుత్ సరఫరా చేసే అవకాశాన్ని కూడా అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది.
👉 గాలిలో విద్యుత్ సరఫరా కారణంగా ప్రమాదాలు జరుగకుండా ముందు జాగ్రత్తగా మానవులను లేజర్ బీమ్‌తో కప్పివేస్తారు.
👉 ఈ కిరణాల సాంద్రత చాలా తక్కువగా ఉంటున్నందున మానవులు, జంతువులపై పెద్దగా ప్రభావం చూపదు. ఈ విధానంతో మానవులకుగానీ, ఇతర పరికరాలకుగానీ ఎలాంటి ప్రమాదం ఉండబోదని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకుల అధ్యయనం వెల్లడిస్తున్నది.
నోట్
👉 అమ్రోడ్ సంస్థ వ్యవస్థాపకుడు : గ్రెగ్ కుష్నిర్
0 Comments