అర్థశాస్త్రం అంటే ?? అర్థశాస్త్రం సంపద తో ఎందుకు ఆగలేదు ??

✌ అర్ధ శాస్త్రము నిర్వచనము ??

✌ అర్థశాస్త్ర పితామహుడు ??

✌ సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రం ఒక ??



                  అర్ధ శాస్త్రము' లేదా 'ఆర్ధిక శాస్త్రము'ను అనేక విధాలుగా నిర్వచించారు . అసలు నిర్వచించే ప్రయత్నమే నిష్ప్రయోజనమని (పారిటో, మిర్డాల్ వంటి) కొందరు మేధావులు  భావించారు. స్థూలంగా ఆర్థిక శాస్త్ర నిర్వచనాలు మూడు విధానాలలో ఇవ్వబడ్డాయి.

✌ 'సంపద' (Wealth) ఆధారంగా నిర్వచనం ఆడమ్ స్మిత్ చేసాడు .

 ఆడమ్ స్మిత్,మరియు  అతని మార్గీయులు  - సంపదను గూర్చిన విధానాల అధ్యయనం చేసేది  ఆర్ధిక శాస్త్రం అని తెలిపారు.

✌ 'శ్రేయస్సు' (Welfare) ఆధారంగా ఆల్ఫ్రెడ్ మార్షల్  నిర్వచన చేసాడు

ఆల్ఫ్రెడ్ మార్షల్ మరియు  అతని మార్గీయులు   అర్ధశాస్త్రము మానవునికి సంబందిత  జీవనాన్ని గురించి పరిశీలించే ఒక విజ్ఞాన వర్గము. మానవుని శ్రేయస్సుకు కారణాలైన భౌతిక సాధనాల అర్జన, వినియోగాలకు చెందిన వ్యక్తిగత, సామాజిక ప్రక్రియల అధ్యయనం. అని తెలిపారు. సింపుల్ గా చెప్పాలంటే మానవుడు, అతని శ్రేయస్సును గురించి అధ్యయనం చేసే శాస్త్రంమే  అర్థశాస్త్రము

మార్షల్ జాతీయ ఆదాయం నిర్వచనం :

                  ఒక దేశంలో శ్రమ,మూలధననాన్ని ఉపయోగించి....సహజ వనరుల చేత ప్రతి సంవస్తరము ఉత్పత్తి చేసే బౌతిక ,అబౌతిక వస్తు సేవలతో కూడుకొన్న నికర వస్తుసేవల మోత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం అంటారు.

✌ 'కొరత' (Scarcity) ఆధారం చేసుకొని రాబిన్స్ నిర్వచనం రూపొందించారు.  

రాబిన్స్ విధానం - మానవుని (అపరిమితమైన) కోర్కెలకు, వాటిని తీర్చుకొనేందుకు ఉన్న (పరిమితమైన) వనరులు, సాధనాలకు, ఈ నేపధ్యంలో మానవుని ప్రవర్తనకు చెందిన అధ్యయనమే ఆర్ధిక శాస్త్రం.

✌         అర్థశాస్త్రం అనే పదం గ్రీకు భాషలోని 'OIKOS', 'NEMEIN' అనే రెండు పదాల నుంచి ఆవిర్భవించింది. OIKOS అంటే ఇల్లు, NEMEIN అంటే నిర్వహణ. మొత్తం మీద ఇంటిని నిర్వహించడమే అర్థశాస్త్రం అని అర్థం ఇక్కడ ఇండ్లు ...రాష్ట్రం కావచ్చు ,దేశం కావచ్చు ...ప్రపంచం (గ్లోబ్)కావచ్చు విశ్వమే అయినా కావచ్చు.

✌ అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్‌స్మిత్అర్థశాస్త్రాన్ని సంపదకు సంబంధించిన శాస్త్రంగా నిర్వచించారు. ఆయనకు ముందు అర్థశాస్త్రాన్ని రాజనీతి ఆర్థిక వ్యవస్థగా పిలిచేవారు. ఆడమ్ స్మిత్ రచించిన దేశాల సంపద, స్వభావం, కారణాల పరిశోధన1776లో ప్రచురితమైన తర్వాత అర్థశాస్త్రం ప్రత్యేక శాస్త్రంగా రూపొందింది.

✌ సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రం రాణి వంటిదిఅని పాల్ శామ్యూల్‌సన్ పేర్కొన్నారు.

✌ ఇక పోతే మన అమర్త్యసేన్ గారు  సంక్షేమ ఆర్థిక శాస్త్రం గురించి వివరించారు. ఆడమ్ స్మిత్‌తో సహా సంప్రదాయ ఆర్థికవేత్తలందరూ అర్థశాస్త్రం సంపదకు సంబంధించిన శాస్త్రమని అభిప్రాయపడ్డారు.

✌ అర్థశాస్త్రానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనాన్ని ఇచ్చిన మొదటి వ్యక్తి ఆడమ్‌స్మిత్. సంపద నిర్వచనాన్ని బలపర్చినవారు జె.బి.సే, జె.ఎస్.మిల్, వాకర్ మొదలైన ఆర్థికవేత్తలు.

✌ ఆడమ్ స్మిత్ సంపదకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వగా మార్షల్ శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు.

కార్లే, రస్కిల్‌లు సంపద నిర్వచనాన్ని విమర్శిస్తూ కేవలం సంపద అనే ఒకే విషయాన్ని గురించి చర్చించే శాస్త్రం శాస్త్రమే కాదని అది ఒక శూన్య శాస్త్రమని పేర్కొన్నారు.

✌ లయోనెల్ రాబిన్‌‌స 1932లో ప్రచురించిన ప్రఖ్యాత పుస్తకం యాన్ ఎస్సే ఆన్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్‌‌స ఆఫ్ ఎకనామిక్ సైన్‌‌సలో వనరుల కొరతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.

అర్థశాస్త్రం ముఖ్యంగా సంపదకు సంబంధించిన శాస్త్రం.అవును ఇది ముమ్మాటికి నిజమే కాని .... మానవుడు కోర్కెలను సంతృప్తి పర్చుకోవడానికి ధనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాడో తెలియచేస్తుంది. మానవుల కోర్కెలు తీర్చే వస్తు సేవల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? తయారైన వస్తువులు మార్కెట్ల ద్వారా వ్యక్తులకు ఎలా చేరతాయి? వాటి ధరలను ఎలా నిర్ణయిస్తారు వంటి విషయాలను అర్థశాస్త్రం తెలుపుతోంది. ఇక్కడ “కోర్కెలు తీర్చే” ప్రక్రియ అనేది సంతృప్తి కొలమానం కుడా అర్థశాస్త్రం ఇవ్వాలికదా ...అన్నదే సందేహం తో అర్థశాస్త్రం అనేది కేవలం సంపద తో ఆగి పోకుండా శ్రేయస్సు లాంటి అంశాలు తెరమీదకు వచ్చాయి.

✌ ఉధహరణకు మనం చదువుకొనే గ్రోత్ మరియు డెవలప్మెంట్ ప్రక్రియలగా అన్నమాట. గ్రోత్ అంటే కేవలం పెరగం(శరీరం పెరగడం లాంటిది ) మాత్రమే ...డెవలప్మెంట్ అంటే పెరుగుతూ వృద్హి(శరీరం తో పాటు ఆనందం,సౌకర్యాలు...etc ఇలా ..) కుడా చేయడం అన్నమాట.

బిట్స్ ప్రాక్టీస్ చేయండి సందేహాలుంటే లేదా సలహాలు  కామెంట్ చేయండి ...


Post a Comment

0 Comments

Close Menu