కేంద్ర ఎన్నికల సంఘం
👉 ఇది బహుళ సభ్య సంస్థ. ప్రారంభంలో 1950, జనవరి 25నుంచి 1989, అక్టోబర్ 15వరకు ఏకసభ్య కమిషన్‌గా కొనసాగింది.
👉 1989, అక్టోబర్ 16న బహుళసభ్య కమిషన్‌గా మారింది. కానీ 1990లో తిరిగి ఏకసభ్య కమిషన్‌గా కొనసాగింది.
👉 చివరికి 1993నుంచి ఒక ప్రధాన ఎన్నికల కమిషన్‌తో పాటు ఇద్దరు కమిషనర్లను కలిగి ఉండి బహుళసభ్య సంస్థగా పనిచేస్తుంది.
👉ఎప్పుడు ఏర్పాటు చేసారు - 1950, జనవరి 25
నోట్: జనవరి 25ను ప్రతి ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మొదటిసారి 2011లో నిర్వహించారు. రాజ్యాంగంలోని 15వ భాగంలో 324నుంచి 329వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి పేర్కొంటున్నాయి.
👉 నిర్మాణం ఎ విధంగా ఉంది : కేంద్ర ఎన్నికల సంస్థ రాజ్యాంగ సంస్థ, శాశ్వతసంస్థ.
👉 324 ఆర్టికల్ ప్రకారం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.
👉 324 (1) ఆర్టికల్ ప్రకారం కింది విధులు నిర్వహిస్తుంది.
👉 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం విధులను 3రకాలుగా పేర్కొనవచ్చు. అవి..
1. పరిపాలన విధులు
👉 ఓటర్ల జాబితాను రూపొందించడం, నిర్ణీత కాలవ్యవధిలో వాటిని సవరించడం
పార్లమెంట్ చేసిన డీలిమిటేషన్ కమిషన్ చట్టం ప్రకారం నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం
👉ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ తేదీల ఖరారు పర్యవేక్షణ
👉 రాజకీయ పార్టీలను గుర్తించడం, వాటికి గుర్తులను కేటాయించడం
2 సలహా విధులు
👉 పార్లమెంట్, రాష్ట్రశాసన సభ్యుల అనర్హతకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్‌కు సలహా ఇస్తుంది.
3 అర్ధన్యాయసంబంధమైన విధులు- (క్వాజీ జుడీషియల్)
👉 రాజకీయ పార్టీల మధ్య వచ్చే వివాదాలను విచారించి, పార్టీల వాదనలను విని పరిష్కరిస్తుంది. ఈ సందర్భంలో ట్రిబ్యునల్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ‘క్వాసి జుడీషియల్ పవర్' అంటారు.
నోట్: ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు వచ్చిన వివాదాలను మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరిస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏ వివాదమైనా బాధితులు ఎన్నికల పిటిషన్‌ను హైకోర్టులోనే దాఖలు చేయాలి.
👉 325 ఆర్టికల్ ప్రకారం మతం, కులం, జాతి, లింగ ప్రాతిపదికలపై ఏ పౌరునికి ఓటు హక్కు నిరాకరించరాదు. అలాగే ప్రత్యేక గుర్తింపు ఇవ్వరాదు.
👉326 ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటుహక్కును గుర్తించారు. పార్లమెంట్, రాష్ట్రశాసనసభకు సార్వజనీన ఓటుహక్కు ప్రాతిపదికపైనా ఎన్నికలు జరుగుతాయి.
👉327 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్, రాష్ట్రశాసనసభ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఒక చట్టం ద్వారా విషయాలను నిర్ణయించవచ్చు.
👉328 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ చట్టం చేయనంత వరకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చట్టాలు చేసుకునే అధికారం ఉంటుంది.
👉329 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానం సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు.
నోట్: ఎన్నికల తేదీని ప్రకటించడం మొదలైన అంశాలు పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం విశిష్ట అధికారాలు. ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని మక్కల్ శక్తి కచ్చి Vs ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (2011) కేసులో సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది.
0 Comments