👉ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి

 👉ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి

  • ఏమిటి : చీనాబ్ వంతెన
  • ఎప్పుడు : ఈ మార్చిలో పూర్తి అవ్వొచ్చు  
  • ఎవరు : యుఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్‌ కత్రా-లావోలి విభాగం  
  • ఎక్కడ : జమ్మూ కశ్మీర్‌లో
  • ఎందుకు : దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానం చేసేందుకు


👉ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మిస్తున్నది. అయితే ఈ చీనాబ్ వంతెనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

👉జమ్మూకాశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ భారీ ఉక్కు వంతెన నిర్మాణం పూర్తి కావొచ్చినట్లు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు.

👉 476 మీటర్ల పొడవులో విల్లు ఆకారంలో నిర్మిస్తున్న.. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన .

👉 ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరు తెచ్చుకోనుంది.

👉 దేశంలోని ఇతర ప్రాంతాలకు కశ్మీర్‌ను అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఈ విల్లు వంతెనను నిర్మిస్తున్నారు.

👉 2017 నవంబర్‌లో మెయిన్ ఆర్చ్ పనులు ప్రారంభమయ్యాయి.

👉 476 మీటర్లు విల్లు ఆకారంలో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 1,315మీటర్లు. 17వ్యాసార్థాలల్లో దీనిని నిర్మిస్తున్నారు. కాగా.. దీనికయ్యే అంచనా వ్యయం రూ.1,250కోట్లు. ఉధంపూర్‌- శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే సెక్షన్‌లో ఈ లైన్‌ను దీనిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి జమ్మూ కశ్మీర్‌లోని బక్కల్‌, కౌరి మధ్య చీనాబ్‌ నదిపై అనుసంధానంగా ఉంటుంది.

👉ఈ వంతెనను జమ్మూ కశ్మీర్‌లోని యుఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్‌ కత్రా-లావోలి విభాగం నిర్మిస్తోంది.

👉 చీనాబ్ వంతెనను నదికి 359మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు.

👉 ఇది ఈఫిల్ టవర్ (324మీటర్లు) కంటే 35మీటర్ల పొడవు ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

👉 ఈ చీనాబ్ వంతెన మార్చి నాటికి పూర్తికానుంది.

👉ఈ బ్రిడ్జి పూర్తయితే.. జమ్మూ కాశ్మీర్‌లోని లోయ ప్రాంతాలకు రవాణా మార్గం సులభం అవుతుంది.

👉చీనాబ్ వంతెన భారతదేశంలో నిర్మాణంలో ఉన్న ఒక ఆర్చి వంతెన. ఇది జమ్మూ కాశ్మీర్‌ లోని రేసి జిల్లాలో, బక్కల్, కౌరి మధ్య చీనాబ్ నదిపై సంధానంగా ఉంటుంది.

👉వంతెన పూర్తయినప్పుడు 1,263 మీటర్ల పొడవు, ఆర్చ్ స్పాన్ దూలం 480 మీటర్ల తో, చీనాబ్ నదిపైన 359 మీటర్ల ఎత్తులో, కౌరి వైపు వయాడక్ట్ 650 మీటర్ల పొడవుగా ఉంటుంది.

  • నిర్మాణం ఎప్పుడు  ప్రారంభమైంది: ఆగస్టు 2004
  • ఎత్తు: 359 m
  • మొత్తం పొడవు: 1,315 m
  • జలాశయం: చంద్ర నది
  • వంతెన రకం: వంపు వంతెన, డెక్ ఆర్క్ వంతెన

Post a Comment

0 Comments

Close Menu