- ఏమిటి : హెలీనా, ధ్రువాస్త్ర ప్రయోగాలు విజయవంతం
- ఎప్పుడు : ౨౦౨౧ ఫిబ్రవరి 19
- ఎవరు : భారత రక్షణ శాఖ
- ఎక్కడ : ఫోఖ్రాన్, జైసల్మేర్ జిల్లా, రాజస్థాన్
- ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం
దేశీయంగా రూపొందించిన యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలు(యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్-ఏటీజీఎమ్)... ‘హెలీనా’, ‘ధ్రువాస్త్ర’లను భారత్ విజయవంతంగా పరీక్షించింది.
✌ దీని వలన హెలీనాను ఆర్మీలోకి, ధ్రువాస్త్రను వైమానిక దళంలోకి చేర్చేందుకు మార్గం సుగమమైంది.
✌ రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా ఫోఖ్రాన్‌లో ౨౦౨౧ ఫిబ్రవరి 19నాటికి ఈ క్షిపణి పరీక్షలు పూర్తయ్యాయి.
హెలీనా, ధ్రువాస్త్రల గురించి ప్రత్యేక విశేషాలు...
✌ హెలీనా, ధ్రువాస్త్ర క్షిపణులను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.
✌ అన్ని వాతావరణ పరిస్థితుల్లో, రాత్రి, పగలు కూడా శత్రు ట్యాంక్‌లపై విరుచుకుపడగలవు.
✌ యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్స్‌లో ఇవి మూడో తరానికి చెందినవి.
✌వీటిని భూఉపరితలం, హెలికాఫ్టర్ నుంచి శత్రు ట్యాంకులపై గురిపెట్టొచ్చు.
✌ 7 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణులు ఛేదించగలవు.
✌హెలీనా క్షిపణిని సైన్యంలో, ధ్రువాస్త్ర క్షిపణిని వైమానిక దళంలో చేరుస్తారు.
✌ హెలీనా, ధృవాస్త్రలు లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలవు. అందుకే వీటిని ఫైర్ అండ్ ఫర్‌గెట్ మిసైల్స్ అని కూడా అంటారు.
✌హెలినా మూడవ తరం, లాక్ ఆన్ బిఫోర్ లాంచ్ (ఎల్‌ఓబిఎల్) ఫైర్ అండ్ క్లాస్ మర్చిపోండి క్లాస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి (ఎటిజిఎం) వ్యవస్థ.
✌ఇది సాంప్రదాయ మరియు పేలుడు రియాక్టివ్ కవచం (ERA) తో యుద్ధ ట్యాంకులను ఓడించగలదు.
✌ఇది డైరెక్ట్ హిట్ మోడ్‌తో పాటు టాప్ అటాక్ మోడ్‌లో లక్ష్యాలను నిమగ్నం చేస్తుంది.
✌ దీనిని DRDO అభివృద్ధి చేసింది.
0 Comments